ABP Desam


ఒకే రాశిలో శుక్రుడు-శని , ఈ రాశులవారికి యోగకాలం


ABP Desam


జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, నవ గ్రహాలలో శని-శుక్రుడిని స్నేహితులుగా పరిగణిస్తారు. జనవరి 17 నుంచి శని మకర రాశి నుంచి కుంభరాశిలోకి ప్రవేశించాడు. 22న శుక్రుడు కూడా మకర రాశి నుంచి కుంభరాశిలోకి సంచారం చేయనున్నాడు.


ABP Desam


ఈ రెండు గ్రహాల కలయిక ప్రభావం అన్ని రాశులపైనా పడుతుంది. కొన్ని రాశులవారికి ప్రతికూల ఫలితాలుంటే మరికొన్ని రాశులవారికి అనుకూల ఫలితాలున్నాయి.


ABP Desam


మరికొన్ని రాశులవారికి మాత్రం ఇది యోగకాలమనే చెప్పాలి. ముఖ్యంగా ఈ నాలుగు రాశులవారికి మాత్రం అద్భుతంగా ఉంది. అందులో మీరున్నారా....


ABP Desam


మేష రాశి
ఈ రాశి వారికి కుంభరాశిలో శని, శుక్ర గ్రహాల కలయిక వల్ల చాలా ప్రయోజనాలున్నాయి. గడిచిన రోజులకన్నా ఆదాయం పెరుగుతుంది, వ్యాపారులు పెట్టిన పెట్టుబడులకు లాభాలు పొందుతారుయ ఉద్యోగులు కార్యాలయంలో కష్టానికి తగిన ఫలితం పొందుతారు.


ABP Desam


ఇంక్రిమెంట్, ప్రమోషన్ కి సంబంధించిన సమాచారం వినే అవకాశం ఉంది. వ్యాపారులు లాభాలు ఆర్జిస్తారు. అనుకోని ఆదాయం పెరుగుతుంది. అప్పులు తీరుతాయి.. రాని బాకీలు వసూలవుతాయి. ఇంట్లో సంతోష వాతావరణం ఉంటుంది.


ABP Desam


వృషభ రాశి
శని-శుక్రుడు మకరరాశిలో సంచరించడం వల్ల వృషభరాశివారికి కూడా ఇది యోగకాలం అనే చెప్పాలి. ఉద్యోగులు, వ్యాపారులు, విద్యార్థులు విశేష ఫలితాలు పొందుతారు. నూతన ఉద్యోగంలోకి మారాలి అనుకున్నవారికి ఇదే శుభసమయం.


ABP Desam


శని అనుగ్రం మీపై ఉంటుంది...కష్టానికి తగిన ఫలితం పొందుతారు. ఉద్యోగంలో పురోగతి ఉంటుంది. విలాసాలు పెరుగుతాయి. కుటుంబంతో కలసి దూరప్రాంతానికి వెళ్లి సంతోషంగా గడుపుతారు. వ్యాపారాన్ని విస్తరించాలి అనుకునేవారికి ఇదే మంచి సమయం.


ABP Desam


సింహ రాశి
శని-శుక్రుడు..ఈ రాశినుంచి ఏడో స్థానంలో సంచరిస్తున్నారు. ఈ సమయంలో మీ వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. ప్రేమికులు పెళ్లిదిశగా అడుగేయాలి అనుకుంటే ఇదే శుభసమయం. కుటుంబంలో సంతోషం నెలకొంటుంది.


ABP Desam


అవివాహితులకు సంబంధాలు కుదురుతాయి. తలపెట్టిన పనులు పూర్తవుతాయి..కుటుంబ సభ్యుల నుంచి సహకారం ఉంటుంది. బంధాలు మరింత బలపడతాయి. వ్యాపారులకు ప్రయోజనకరమైన సమయం. విద్యార్థులకు చదువుపై శ్రద్ధ పెరుగుతుంది.


ABP Desam


మకర రాశి
మీ రాశినుంచి శని కుంభ రాశికి మారడం మీకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. అంటే మకర రాశినుంచి రెండో స్థానంలో శని సంచారం ఉంటోంది. ఈ సమయంలో మీ ఆర్థిక పరిస్థితి బావుంటుంది. అనుకోని ఆదాయం పెరుగుతుంది. వివిధ వనరుల నుంచి ఆదాయం పొందుతారు.


ABP Desam


కుటుంబ సభ్యుల నుంచి పూర్తి మద్దతు మీకు ఉంటుంది. ఆస్తి వ్యవహారాలు కలిసొస్తాయి.మాట్లాడేటప్పుడు జాగ్రత్త.. మీ మాటతీరే మీ బంధాలను నిలబెడుతుందన్నది గుర్తుంచుకోవాలి. ఈ రాశివారు మార్కెటింగ్, సేల్స్ రంగంలో ఉన్నవారు ప్రయోజనాలు పొందుతారు.


ABP Desam


Images Credit: freepik