ABP Desam


ఈ రాశులకు చెందిన పెళ్లికానివారికి శుభవార్త


ABP Desam


మేష రాశి
భార్యాభర్తల మధ్య సామరస్యం నెలకొంటుంది. ఒంటరి వ్యక్తుల జీవితంలో భాగస్వామి కోసం అన్వేషణ పూర్తవుతుంది. ఈ రోజు మీరు మీ భాగస్వామికి సమయం కేటాయించండి.


ABP Desam


వృషభ రాశి
ఈ రోజు ప్రేమికులు శుభవార్త వింటారు. వైవాహిక జీవితం సాధారణంగా సాగుతుంది. అనవసర వాదనకు పెట్టుకోవద్దు.


ABP Desam


మిథున రాశి
అవివాహితుల పెళ్లి సంబంధాల వేట ఓ కొలిక్కివస్తుంది. వైవాహిక జీవితంలో కొన్ని ఇబ్బందులు తప్పవు. అనవసర వాదనల భారాన్ని అనుభవిస్తారు కానీ కొద్దిరోజుల్లో అంతా బావుంటుంది. మీ భాగస్వామిపై ఒత్తిడి తీసుకురావద్దు.


ABP Desam


కర్కాటక రాశి
చర్చకు దూరంగా ఉండండి. రిలేషన్ షిప్ లో ఎలాంటి టెన్షన్ లేకుండా చూసుకోవాలి. ఆల్రెడీ ఉన్న శాంతిని కొనసాగించడానికి ప్రయత్నించండి. ఇది మీకు చాలా ప్రశాంతతను ఇస్తుంది.


ABP Desam


సింహ రాశి
జీవిత భాగస్వామితో విభేదాలు తలెత్తవచ్చు. ఈరోజు చిన్న చిన్న విషయాలకు గొడవలు జరిగే అవకాశం ఉంది. ఈ రోజు మీ కంటే పెద్దవారు మీకారణంగా ప్రభావితమవుతారు.


ABP Desam


కన్యా రాశి
ఈ రోజు మీ భాగస్వామి ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. భార్యాభర్తల మధ్య సంబంధాలు సాధారణంగా ఉంటాయి. ప్రేమికులకు మంచి రోజు.


ABP Desam


తులా రాశి
ఒంటరి వ్యక్తులు భాగస్వామిని పొందుతారు. పెళ్లి చేసుకోవాలి అనుకునే జంట ఆ దిశగా అడుగేసేందుకు మంచిరోజు. ఈ రోజు మొదలైన బంధం ఎక్కువ కాలం కొనసాగుతుంది.


ABP Desam


వృశ్చిక రాశి
ప్రేమికులకు తమ ప్రేమికుల ఆరోగ్యం పట్ల ఆందోళన చెందుతారు. ఈ రోజు మీరు అనుకున్న పనులు పూర్తిచేస్తారు. మీ సహోద్యోగితో మీ బంధం బలంగా ఉంటుంది. ఈ రోజు మీరు ప్రేమను వ్యక్తపరిస్తే పాజిటివ్ రిప్లై వచ్చే అవకాశం ఉంది.


ABP Desam


ధనుస్సు రాశి
మీకు ఈ రోజు మంచి రోజు. అవివాహితులు ఈ రోజు ప్రత్యేకంగా ఒకరిని కలసి మనసులో మాట చెప్పేందుకు ప్రయత్నిస్తారు. వైవాహిక బంధం బాగానే ఉంటుంది.


ABP Desam


మకర రాశి
మీ భాగస్వామి తప్పులను మరీ లాగకండి..ఇంట్లో ప్రశాంతవాతావరణం దెబ్బతింటుంది. ఈ రోజు మీకు కొత్త స్నేహితుడి నుంచి వచ్చే ఆఫర్..గందరగోళానికి గురిచేస్తుంది. జీవిత భాగస్వామితో ఏకాంత సమయం గడిపే అవకాశం వస్తుంది.


ABP Desam


కుంభ రాశి
మీ భావాలను భాగస్వామితో పంచుకుంటారు. చెడు సంబంధాలను వదులుకునేలా చేసేందుకు మీ ప్రయత్నం మీరు చేయండి. కొత్తగా మీ జీవితంలోకి వచ్చే వ్యక్తి ఎక్కువరోజులు ఉండరు..వైవాహిక జీవితం బావుంటుంది.


ABP Desam


మీన రాశి
ఈ రోజు మీకు మానసిక ప్రశాంతత లభిస్తుంది. మీ భాగస్వామితో విభేదాల నుంచి ఉపశమనం పొందుతారు. భాగస్వామి ఆరోగ్యం గురించి ఆందోళన ఉంటుంది. అవివాహితులు వివాహ ప్రతిపాదనలు పొందుతారు.