ABP Desam


ఈ రాశివారు రొమాంటిక్ మూడ్ లో ఉంటారు


ABP Desam


మేష రాశి
రోజు మీ కోరిక నెరవేరుతుంది. భార్యాభర్తల మధ్య సమయ లోపం ఉండవచ్చు. అవివాహితుల పెళ్లి గురించి మాట్లాడుకుంటారు. ప్రేమ జీవితంలో ఎదురయ్యే అడ్డంకులు తొలగుతాయి. ధైర్యంగా మీ మనసులో మాట చెప్పేయండి.


ABP Desam


వృషభ రాశి
మీ భాగస్వామితో వాదనలకు దూరంగా ఉండండి. అవివాహితులకు వివాహ ప్రతిపాదన వస్తుంది. ఈ రోజు ప్రేమికులకు సాధారణంగా ఉంటుంది. జీవితానికి సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకోవద్దు.


ABP Desam


మిథున రాశి
ఒంటరి వ్యక్తుల జీవితంలో ఒక ప్రత్యేకమైన వ్యక్తి రావచ్చు. భార్యాభర్తల మధ్య వివాదం తలెత్తుతుంది. ఏదైనా వివాదం తలెత్తితే గొడవ తగ్గించేందుకు ప్రయత్నించండి. అవివాహితులకు వివాహ ప్రతిపాదన వస్తుంది.


ABP Desam


కర్కాటక రాశి
భార్యాభర్తల మధ్య సామరస్యం నెలకొంటుంది కానీ చిన్న విషయం మాత్రం మీ ఇద్దర్నీ బాధపెడుతుంది.సాలోచనగా మాట్లాడండి. రిలేషన్ షిప్ లో ఉండేవారు ఈ రోజు అత్యంత సంతోషంగా ఉంటారు.


ABP Desam


సింహ రాశి
కొంతమంది ప్రేమను వివాహంగా మార్చుకోవాలని నిర్ణయించుకుంటారు. ఈ రోజు భార్యాభర్తలకు మంచి రోజు. సహోద్యోగి పట్ల ఆకర్షణ పెరుగుతుంది. జీవిత భాగస్వామికి సమయం కేటాయించడం ద్వారా మీలో ఒంటరితనం దూరమవుతుంది.


ABP Desam


కన్యా రాశి
ఈ రాశివారు మీకంటే పెద్దవారిపట్ల ఆకర్షితులవుతారు. అవివాహితులకు వివాహ ప్రతిపాదనలు అందుతాయి. జీవిత భాగస్వామికి మీపై కోపం వస్తుంది..వాదన పెట్టుకోవద్దు. ఒత్తిడి నుంచి ఉపశమనం పొందేందుకు వాకింగ్ కు వెళ్లొచ్చు.


ABP Desam


తులా రాశి
ప్రేమికులు మీ ప్రేమ భాగస్వామిపై శ్రద్ధవహించండి..వాళ్లు ఏం చెబుతున్నారో వినండి..అందులో మిమ్మల్ని ఇబ్బందికి గురిచేసే విషయం ఉంటే వాదన పెట్టుకోవద్దు..ప్రశంతంగా అక్కడి నుంచి దూరంగా వెళ్లిపోవడం మంచిది.


ABP Desam


వృశ్చిక రాశి
ప్రేమికులకు వారి భాగస్వామి ఆరోగ్యం పట్ల ఆందోళన ఉంటుంది. ఎవరికైనా ప్రపోజ్ చేయాలనుకునేవారికి ఈ రోజు అనుకూలమైన రోజు. జీవిత భాగస్వామితో వివాదం ఉండవచ్చు. మానసిక ఒత్తిడి కలవరపెడుతుంది.


ABP Desam


ధనుస్సు రాశి
కుటుంబానికి సమయం కేటాయించడం ద్వారా ప్రశాంతతను పొందుతారు. మీ ప్రవర్తనకు ప్రశంసలు అందుకుంటారు. అదనపు బాధ్యతలు భుజానికెత్తుకోవద్దు.


ABP Desam


మకర రాశి
ఈ రాశి ఉద్యోగులకు కార్యాలయంలో పనిభారం ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల మానసిక ఒత్తిడికి గురవుతారు. ఆ ప్రభావం వ్యక్తిగత జీవితంపై పడుతుంది. ప్రేమ సంబంధాన్ని కొనసాగించడానికి కొన్ని విషయాలను విస్మరించాల్సి ఉంటుంది.


ABP Desam


కుంభం రాశి
ఈ రోజు ఒంటరి వ్యక్తులు జంటను వెతుక్కోవడంలో సక్సెస్ అవుతారు. అవివాహితులకు సంబంధాలు కుదురుతాయి. మీరు మీ భాగస్వామి నుంచి ప్రేమను పొందుతారు. ఈ రోజు మీరు రొమాంటిక్ మూడ్ లో ఉంటారు.


ABP Desam


మీన రాశి
ఈ రాశి వివాహితులు వాకింగ్ కివెళ్లడం వల్ల మానసిక ప్రశాంతతను పొందుతారు. ప్రేమ జీవితం సాధారణంగా ఉంటుంది. మీ భాగస్వామితో ఏకాంత సమయం గడిపే అవకాశం వస్తుంది. అవివాహితులకు పెళ్లి ప్రపోజల్ రావొచ్చు.