ABP Desam


ఈ రాశివారు క్లోజ్ ఫ్రెండ్ చేతిలో మోసపోతారు
జనవరి 20 రాశిఫలాలు


ABP Desam


మేష రాశి
ఈ రోజు మీరు కొన్ని కొత్త అవకాశాలతో పాటు శుభవార్త వింటారు. మీ పనిని ఎంజాయ్ మెంట్ తో కలసి చూడకండి. వ్యక్తిగత, గోప్యమైన సమాచారాన్ని బహిర్గతం చేయవద్దు. మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి, ఆహారపు అలవాట్లను మెరుగుపరచుకోండి.


ABP Desam


వృషభ రాశి
ఈ రోజు మీకు ఒడిదొడుకులతో నిండిన రోజు. ఆరోగ్యం కాస్త బలహీనంగా ఉన్నా పనిలో మంచి ఫలితాలను పొందుతారు. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. ఆహారం విషయంలో జాగ్రత్త అవసరం.


ABP Desam


మిథున రాశి
ఈ రోజు మీకు మునుపటి కన్నా బావుంటుంది. కొంచెం కష్టపడితే పెద్ద లాభాలు పొందవచ్చు. మీ జీవిత భాగస్వామితో కలిసి సంతోష సమయం గడుపుతారు. మీ ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరుగుతుంది.


ABP Desam


కర్కాటక రాశి
ఈ రోజు నిరుద్యోగులు శ్రమకు తగిన ఫలితం పొందుతారు. మీరు తలపెట్టిన పనులకు మంచి ఫలితం పొందుతారు. ఇంటి బాధ్యతలు నెరవేర్చడంలో ఒకరికొకరు సహకరిస్తారు. ఉద్యోగులు కార్యాలయంలో జాగ్రత్తగా ఉండాలి.


ABP Desam


సింహ రాశి
ప్రయత్నాలను వేగవంతం చేస్తారు. వ్యాపారంలో లాభం పెరుగుతుంది. ఆదాయం పెరుగుతుంది. ఒక కొత్త ఆలోచన మిమ్మల్ని ముందుకు నడిపించడానికి సహాయపడుతుంది. ఆస్తిని కొనుగోలు చేయాలనే ఆలోచన ముందుకు వెళుతుంది.


ABP Desam


కన్యా రాశి
ఈ రోజు మీకు మంచి రోజు. కుటుంబ సభ్యులతో కలిసి పుణ్యక్షేత్రాలకు వెళతారు. మీ స్నేహితుల సంఖ్య పెరుగుతుంది. ఆర్థికంగా లాభాలు పొందుతారు. మీ పనిలో కొత్తదనం ఉంటుంది.


ABP Desam


తులా రాశి
ఈ రోజు మీరు అనుకున్న పనులన్నీ పూర్తిచేస్తారు. కొత్త ప్రణాళికలు కూడా అమలు చేస్తారు. కొత్త వాహనం కొనుగోలు చేయాలనే ఆలోచన ఫలిస్తుంది. భార్యాభర్తలు కూడా ఎక్కడికైనా వెళ్లేందుకు ప్లాన్ చేసుకోవచ్చు.


ABP Desam


వృశ్చిక రాశి
ఖర్చులపై నియంత్రణ కోసం మీ బడ్జెట్ ను ప్లాన్ చేసుకోవాలి. మీ ఖర్చులు తగ్గించుకునేందుకు ప్లాన్ చేసుకోవాలి. ఎవరినీ బాధపెట్టే మాటలు మాట్లాడొద్దు. ఆలోచించి మాట్లాడండి. ఉద్యోగులు, వ్యాపారులు కష్టానికి తగిన ఫలితం పొందుతారు.


ABP Desam


ధనుస్సు రాశి
ఈ రోజు మీకు అద్భుతమైన రోజు అవుతుంది. మిమ్మల్ని కలిసేందుకు స్నేహితులు రావొచ్చు. అసంపూర్తిగా ఉన్న పనులు పూర్తవుతాయి. వ్యాపారంలో కొత్త ఒప్పందాలు కుదుర్చుకుంటారు. సంపదను పెంచుకునే ఏ పథకమైనా విజయవంతమవుతుంది.


ABP Desam


మకర రాశి
ఈ రోజు ఆత్మవిశ్వాసం పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. మీ క్లోజ్ ఫ్రెండ్ మిమ్మల్ని మోసం చేస్తారు..జాగ్రత్త పడండి. కొన్ని ఇబ్బందులు తప్పవు...కానీ..వాటిని క్రమంగా అధిగమిస్తారు. మీ మంచి పనుల వల్ల సమాజంలో మీ ఆధిపత్యం పెరుగుతుంది.


ABP Desam


కుంభ రాశి
ఈ రోజు మీకు అదృష్టం కలిసొస్తుంది. కష్టానికి తగిన ఫలితం అందుకుంటారు. ఆహ్లాదకరమైన ప్రయాణం చేసే అవకాశాలు ఉన్నాయి. అనుకున్న పనులు పూర్తిచేస్తారు..కోర్కెలు నెరవేరుతాయి. మనసంతా సంతోషంగా ఉంటుంది.


ABP Desam


మీన రాశి
ఈ రోజు మీరు కొన్ని కొత్త పురోగతి మార్గాలను పొందుతారు. కొంతమంది మంచి వ్యక్తులను కలవడం మీ రోజును మెరుగుపరుస్తుంది. ఫ్యూచర్ ప్లాన్స్ వేసుకుంటారు. వ్యాపారాభివృద్ధి ఉంటుంది.