Magha Gupta Navratri 2023: ఆరోగ్యం, శ్రేయస్సు, ఐశ్వర్యాన్నిచ్చే శ్యామల నవరాత్రులు - జనవరి 22 నుంచి ప్రారంభం
Shyamala navratri 2023: చైత్ర మాసంలో ఉగాది నుంచి తొమ్మిది రోజులు జరుపుకునేవి వసంత నవరాత్రులు...ఆశ్వయుజ మాసం ఆరంభంలో జరుపుకునేవి శరన్నవరాత్రులు...అయితే మాఘమాసంలోనూ నవరాత్రులు జరుపుకుంటారని తెలుసా..
![Magha Gupta Navratri 2023: ఆరోగ్యం, శ్రేయస్సు, ఐశ్వర్యాన్నిచ్చే శ్యామల నవరాత్రులు - జనవరి 22 నుంచి ప్రారంభం Magha Gupta Navratri 2023: importance and significance of worship of shyamala navratri,know in telugu Magha Gupta Navratri 2023: ఆరోగ్యం, శ్రేయస్సు, ఐశ్వర్యాన్నిచ్చే శ్యామల నవరాత్రులు - జనవరి 22 నుంచి ప్రారంభం](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/01/21/36d320915389316a50a9c4a433209e0d1674283253277217_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Magha Gupta Navratri 2023: శ్యామల నవరాత్రులు, గుప్త నవరాత్రులు..ఈ పేర్లు ఎప్పుడైనా విన్నారా..దక్షిణాదిన కన్నా ఉత్తరాదిన ఈ నవరాత్రులు అత్యంత వైభవంగా జరుపుకుంటారు. ఈ ఏడాది మాఘ గుప్త నవరాత్రులు జనవరి 22 నుంచి ప్రారంభమై 30 వ తేదీ వరకూ ఉంటాయి. శక్తి ఆరాధనకు ఈ తొమ్మిరోజులు రహస్య మార్గంలో సాధన చేస్తారు..అందుకే గుప్త నవరాత్రులు అనే పేరువచ్చింది. శరన్నవరాత్రుల్లో అమ్మవారిని రోజుకో రూపంలో పూజించినట్టే...శ్యామల నవరాత్రుల్లో కూడా దుర్గమ్మని తొమ్మిది రూపాలలో అలంకరించి పూజిస్తారు. శ్యామలాదేవి తిరుగాడే ఈ నవరాత్రుల్లో అమ్మను ఎవరైతే అత్యంత భక్తి శ్రద్ధలతో పూజిస్తారో వారు వారి కోర్కెలు నెరవేరతాయని విశ్వాసం. మంచి ఉద్యోగం, ఉన్నత పదవులు, విద్య, ఐశ్వర్యం లభిస్తాయి. భార్య-భర్త మధ్య అన్యోన్యత పెరుగుతుంది. పెళ్లికానివారికి పెళ్లి జరుగుతుంది.
Also Read: మీరు నాన్ వెజ్ తింటున్నారా - అయితే ఈ 8 మందికి హింసాదోషం తప్పదు!
శ్యామలా దేవి
భండాసురుడనే రాక్షసుడిని చంపడానికి ఆది పరాశక్తి శ్రీలలితా దేవి గా ఉద్భవించి బ్రహ్మాది దేవతలను మరలా నూతనంగా సృష్టించే క్రమంలో శ్యామలాదేవిని సృష్టించింది. 16 మందిలో ముఖ్యమైన శ్యామలాదేవిని ప్రధానమంత్రిగా నియమంచింది లిలాతదేవి. అందుకే శ్యామలాదేవిని మహామంత్రిణీ దేవి అని కూడా అంటారు. ఈ తల్లిని దశ మహా విద్యల్లో మాతంగి అని పిలుస్తారు.
మాతంగి అనే పేరు ఎలా వచ్చింది
హిమవంతుని స్నేహితుడైన మతంగముని తపస్సుకి సంతోషించిన శ్యామలాదేవి ఆయన కోరిక మేర మాతంగుడి కుమార్తెగా జన్మించి మాతంగిదేవిగా ప్రసిద్ధి చెందింది. ఈవిడకు నీల సరస్వతి, గేయ చక్ర వసిని, లఘు శ్యామల, వాగ్వాధిని శ్యామల, నకుల శ్యామల, హసంతి శ్యామల, సర్వసిద్ది మాతంగి, వాస్య మాతంగి, సారిక శ్యామల, శుక శ్యామల, రాజ మాతంగి అని ఎన్నో నామాలున్నాయి
గుప్త నవరాత్రుల్లోని తొమ్మిదిరోజులు అమ్మవారి అలంకారాలు
తొలిరోజు కాళికా దేవి..
రెండో రోజు త్రిపుర తారా దేవి (శైలపుత్రి పూజ)
మూడో రోజు సుందరీ దేవి (బ్రహ్మచారిని పూజ)
నాలుగో రోజు భువనేశ్వరి దేవి (చంద్రఘంట పూజ)
ఐదో రోజు మాతా చిత్రమాతా త్రిపుర దేవి (కుష్మాండ పూజ)
ఆరో రోజు భైరవి దేవి (స్కందమాత పూజ)
ఏడో రోజు మాధుమతి దేవి (శక్తి)
ఎనిమిదో రోజు మాతా బాగళాముఖి దేవి (కాత్యాయని పూజ)
తొమ్మిదో రోజు మాతంగి కమలాదేవిగా (మహాగౌరి పూజ) అలంకరించి పూజిస్తారు.
అయితే మాఘ గుప్త నవరాత్రి పండుగ కొన్ని ప్రాంతాల్లో మాత్రమే జరుపుకుంటారు. ప్రధానంగా ఉత్తర భారత రాష్ట్రాలైన పంజాబ్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్ లో ఘనంగా జరుపుకుంటారు. ఈ గుప్త నవరాత్రులను దేవత కోపాన్ని తగ్గించేందుకు జరుపుకుంటారు. ఈ సమయంలో దేవి తన భక్తులకు ఆరోగ్యం, శ్రేయస్సు, జ్ణానం , సానుకూల శక్తులను ప్రసాదిస్తుంది. గుప్త నవరాత్రుల సమయంలో అన్ని రకాల భయాలు మరియు ఆందోళనలు తగ్గిపోతాయని భక్తుల విశ్వాసం.
శ్యామలా దండకం
మాణిక్యవీణా ముపలాలయంతీం
మదాలసాం మంజుల వాగ్విలాసాం
మాహేంద్ర నీలద్యుతి కోమలాంగీం
మాతంగ కన్యాం మనసా స్మరామి.
చతుర్భుజే చంద్రకళావతంసే
కుచోన్నతే కుంకుమరాగశోణే
పుండ్రేక్షు పాశాంకుశ పుష్పబాణహస్తే
నమస్తే జగదేకమాతః
మాతా మరకతశ్యామా మాతంగీ మధుశాలినీ
కుర్యాత్కటాక్షం కళ్యాణీ కదంబవనవాసినీ
జయమాతంగ తనయే జయనీలోత్పలద్యుతే
జయ సంగీత రసికే జయ లీలాశుకప్రియే
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)