ABP Desam


రథసప్తమి 2023: ఐశ్వర్యం, ఆరోగ్యానికి మూలం సూర్యుడు


ABP Desam


ఈ ఏడాది (2023) రథసప్తమి జనవరి 28న వచ్చింది. ఈ రోజు సూర్యారాధనకు అత్యంత శ్రేష్ఠమైన రోజు..


ABP Desam


భగవంతుడు లేడు అనేవారు ఉండచ్చుగానీ..వెలుగూ వేడీ లేవనీ, వాటికి కారకుడైన..నిత్యం కనిపించే సూర్యుడు లేడనీ ఎవరూ అనలేరు. అందుకే సూర్యుడిని ప్రత్యక్షదైవం అంటారు.



సప్తమి సూర్యుడి జన్మతిథి, ఉత్తరాయణం ప్రారంభానికి సూచనగా మాఘ శుద్ధ సప్తమి నాడు జరుపుకునే రథసప్తమి సూర్యసంబంధమైన పర్వదినాల్లో అత్యంత ముఖ్యమైనది.



విధినిర్వహణలో సూర్యుడిని మించిన ఆదర్శం ఎవరుంటారు..ఉదయం, సాయంత్రం ఎప్పుడూ వేళను అతిక్రమించడు.



సూర్యుడి వల్లే సంపదలు కలుగుతోంది అనేందుకు ఎన్నో పురాణగాథలు ప్రచారంలో ఉన్నాయి. మునులకు ఆహారం కల్పించడం ఎలాగో తెలియక ధర్మ రాజు సూర్యుడిని ప్రార్థిస్తే..అక్షయ పాత్ర ప్రసాదించింది సూర్యుడే.



సత్రాజిత్తు అనేరాజు సూర్యుని ప్రార్థించి శమంతక మణిని పొందుతాడు. ఆ మణి నిత్యం బంగారాన్ని ప్రసాదిస్తుంది. విద్యావివేకాలకూ, బుద్ధి వికాసానికీ వెలుగే మూలం. ఆ వెలుగును ప్రసాదించే సూర్యభగవానుడు .



సూర్యుని దగ్గరే ఆంజనేయుడు వేద శాస్త్రాలను అభ్యసిస్తాడు. బుద్ధిని ప్రేరేపించే వాడు సూర్యుడేనని చెబుతుంది గాయత్రీమంత్రం. జీవుల పుట్టుకకు, పోషణకూ అవసరమైనవన్నీ సూర్యునివల్లే లభిస్తున్నాయి.



శరీరంలో 24 తత్వాలుంటాయనీ, సూర్య కాంతి ప్రసారంతో వీటిని మేలుకొలిపి చైతన్యవంతం చేస్తే జ్ఞానం సిద్ధిస్తుందని మునులు చెబుతారు.



సూర్యనమస్కారాలు, ఆసనాలవల్ల సూర్య శక్తిని నేరుగా స్వీకరించినప్పుడు ఆ సూర్యశక్తి మనలోని శక్తులకు అనూహ్యమైన పరివర్తన కలిస్తుంది. శరీర, ప్రాణ, మనస్సులను మూడింటినీ విశ్వ చైతన్యంలోకి ప్రవేశపెడుతుంది.



అందుకే సూర్యుడిని పూజిస్తే సకల సమస్యలు తీరడంతో పాటూ..ఆయుష్షు, ఐశ్వర్యం సిద్ధిస్తుందని చెబుతారు...
ఓం హ్రీం సూర్యాయ నమః



Images Credit: Pinterest