సంక్రాంతికి మీ ఇంటిముందుకి వచ్చేది శివుడు,శ్రీ మహావిష్ణువే!



భోగి, సంక్రాంతి, కనుమ, ముక్కనుమ... పండుగలో ఈ నాలుగు రోజుల్లో నిత్యం ఇంటి ముందు సందడి చేస్తారు హరిదాసు, డూడూ బసపన్న.



అయ్యగారికి దణ్ణం పెట్టు..అమ్మగారికి దణ్ణం పెట్టూ అంటూ ఇంటింటికి వచ్చే గంగిరెద్దులు పల్లెకి మరో కళ.



శివ లింగాకృతికిని గుర్తుచేసే ఎత్తైన మూపురంతో శివునిడో కలసి సంక్రాంతి సంబరాలకు వచ్చానని చెప్పే సంకేతం బసవన్న.



ఇంటి ముందు ముగ్గులో బసవన్న నిల్చుంటే ఆనేల ధర్మభద్దమైనది అని చెబుతారు.







పిల్లల్లో సరదాని రెట్టింపు చేసే హరిదాసుల సందడే వేరు. తలపై పాత్ర పెట్టుకుని భక్తుల కోసం నేరుగా శ్రీహరే హరిదాసుగా మారి వస్తాడని నమ్మకం.



తలమీద గుమ్మడికాయ ఆకారంలో ఉండే పాత్ర భూమికి సంకేతం.



ఆ పాత్రను తలమీద పెట్టుకోవడం అంటే....శ్రీ హరి అయిన తానే భూమిని ఉద్దరిస్తున్నానని చెప్పటం. భక్తులంతా సమానమంటూ తరతమ భేదాల్లేకుండా ఇంటిఇంటికీ తిరుగుతాడు.