బొమ్మల కొలువులో బొమ్మలు ఇలా పేర్చాలి!



మొదటి మెట్టుమీద ( కింద మెట్టు)
చిన్న చిన్న ఇళ్ల బొమ్మలు, గుడులు, గోపురాలు, పొలాలు, చెట్లు, పూలతీగలు... ప్రకృతితో నిండిన బొమ్మలు పేర్చాలి



రెండో మెట్టుపై చేపలు, తాబేలు, నత్త, పీత, శంఖం సహా జలచరాలన్నీ ఈ మెట్టుపై పెట్టొచ్చు
మూడు, నాలుగు మెట్లపై క్రిమికీటకాలు, భ్రమరాలకు సంబంధించిన బొమ్మలు



ఐదో మెట్టుపై జంతువులు, పక్షులకు సంబంధించిన బొమ్మలు పేర్చాలి



ఆరో మెట్టుపై మానవ రూపాలకు సంబంధించిన బొమ్మలు పేర్చాలి



ఏడో మెట్టుపై
ఏడో మెట్టుపై మహనీయుల బొమ్మలు పెట్టాలి



ఎనిమిదో మెట్టుపై అష్టదిక్పాలకులు,నవగ్రహనాయకులు,పంచభూతాలకు సంబంధించిన బొమ్మలు పేర్చాలి



అన్నిటి కన్నా ఉన్నతమైన తొమ్మిదో మెట్టుపై త్రిమూర్తులు, లక్ష్మీ,సరస్వతి, పార్వతి బొమ్మలతో అలంకరించాలి



వినాయకుడితో, కుమారస్వామితో ఉన్న శివపార్వతుల బొమ్మ తప్పకుండా పెడతారు. పిల్లవాడిని ఎత్తుకున్న తల్లి బొమ్మ పెడతారు. భోగినాడు పెట్టి కనుమ రోజు వరకూ కొనసాగిస్తారు.



సంతానభాగ్యం కోసం, పాడిపంటల కోసం, సుఖమయ కుటుంబజీవనం కోసం సంక్రాంతిలో బొమ్మల కొలువు పెడతారు.



Images Credit: Pinterest