ABP Desam


సంక్రాంతి వెనుకున్న ఐదు కథలివే!


ABP Desam


గంగమ్మ అవతరించిన రోజు
పూర్వం సగరుడు అనే రాజు ఉండేవాడు. ఆయనకు అరవైవేల మంది కొడుకులు. వీళ్లంతా ఓసారి కపిలముని ఆశ్రమంలోకి ప్రవేశించి తపస్సుని భంగం చేశారు. దాంతో కపిలముని వాళ్లందరినీ బూడిదగామార్చేశాడు. ఆ బూడిద కుప్పల మీద గంగ ప్రవహిస్తే కానీ వారి ఆత్మశాంతించదని తెలుస్తుంది.


ABP Desam


ఆకాశంలో ఉండే గంగని ఎవరూ నేల మీదకి తేలేకపోయారు. సగరుడి వంశంలో పుట్టిన భగీరధుడు ఈ పని చేయగలిగాడు. ఆయన తపస్సుకి మెచ్చి సంక్రాంతి రోజునే గంగమ్మ నేల మీదకు వచ్చిందని చెబుతారు.


ABP Desam


గంగిరెద్దుల వెనుక కథ
పూర్వం గజాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు. శివుడు తన కడుపులో ఉండేలా వరాన్ని కోరుకున్నాడు.శివుని బయటకు రప్పించేందుకు విష్ణుమూర్తి ఓ ఉపాయం ఆలోచించాడు. దేవతలంతా తలా ఓ వాయిద్యాన్నీ పట్టుకుని, నందికితో కలిసి గజాసురుడి దగ్గరకు బయల్దేరారు.


ABP Desam


వీళ్ల ప్రదర్శనకు మెచ్చుకున్న గజాసురుడు ఏదన్నా వరాన్ని కోరుకోమని అడిగాడు. తన పొట్టలో ఉన్న శివుడిని బయటకు పంపమని వరాన్ని అడిగాడు శ్రీ మహావిష్ణువు. అలా ఆనాడు శివుని పొందేందుకు చేసిన హడావుడే, ఇప్పటి గంగిరెద్దుల సంప్రదాయానికి నాంది అని చెబుతారు.


ABP Desam


పశువుల పూజ ఎందుకు
ఒకసారి శివుడు నందిని పిలిచి ‘భూలోకంలో అందరూ రోజూ ఒంటికి నూనె పట్టించి తలకు స్నానం చేయాలి, నెలకి ఓసారే ఆహారం తీసుకోవాలి’ అని చెప్పి రమ్మన్నాడు. కానీ నంది అయోమయంలో ‘రోజూ ఆహారం తీసుకోవాలి, నెలకి ఓసారి నూనె పట్టించి స్నానం చేయాలి’ అని చెప్పాడు.


ABP Desam


కోపం వచ్చిన శివుడు. ‘ప్రజలు రోజూ తినాలంటే చాలా ఆహారం కావాలి. ఆ ఆహారాన్ని పండించేందుకు నువ్వే సాయపడాలి’ అన్నాడు. అప్పటి నుంచి ఎద్దులు, వ్వవసాయంలో సాయపడుతున్నాయట. కనుమ రోజు పశువులని సాక్షాత్తు నందీశ్వరులుగా భావించి పూజిస్తుంటారు.


ABP Desam


గాలిపటాల వెనుకున్న కథ
సంక్రాంతితో ఉత్తరాయణ పుణ్యకాలం మొదలవుతుందట. ఇది దేవతలకు పగలు అని చెబుతారు. ఈ సమయంలో దేవతలంతా ఆకాశంలో విహరిస్తారట. దేవతలకి స్వాగతం పలికేందుకు గాలిపటాలు ఎగరేయాలని చెబుతారు.


ABP Desam


హరిదాసు అంటే శ్రీ మహావిష్ణువే
సంక్రాంతికి సాక్షాత్తు ఆ శ్రీకృష్ణుడే, హరిదాసు రూపంలో మన ఇంటికి వస్తాడట. ఆయన తల మీద ఉండే పాత్ర, ఈ భూమికి చిహ్నమని చెబుతారు. అందుకే ఆ పాత్రని హరిదాసులు నేల మీద పెట్టరు. భిక్ష పూర్తై ఇంటికి చేరుకున్నాకే దాన్ని కిందకి దించుతారు.



ఇంకా చెప్పుకుంటూ పోతే బసవన్నలు, గొబ్బెమ్మల నుంచి భోగిపళ్లు, బొమ్మల కొలువు వరకూ సంక్రాంతి సందర్భంగా పాటించే ప్రతి ఆచారానికి, సంప్రదాయానికి ఓ కథ ఉంది.



Images Credit: Pinterest