సంక్రాంతి పెద్దపండుగ ఎందుకైంది!



సూర్యుడు ఒక రాశి నుంచి మరో రాశికి మారే సమయాన్ని సంక్రమణం అంటారు. ఏడాదిలో 12 రాశుల్లో సంచరిస్తాడు..కానీ ధనస్సు నుంచి మకరంలో అడుగుపెట్టినప్పుడే ఎందుకు ప్రత్యేకం..



12 రాశుల్లో సంచరించే సూర్యుడు పుష్యమాసంలో, మకర రాశిలోకి అడుగుపెడతాడు. మకర సంక్రాంతితో ఉత్తరాయణం మొదలవుతుంది. ఈ రోజు నుంచి స్వర్గ ద్వారాలు తెరిచి ఉంటాయని పురాణాలు చెబుతున్నాయి.



రైతుల కళ్లలో ఆనందం నింపే పండుగ
సంక్రాంతి సమయానికి పొలాల నుంచి వచ్చే ధాన్యంతో గాదెలతో పాటూ రైతులు మనసు నిండుగా ఉంటుంది.



నువ్వులతో పిండి వంటలెందుకు
సంక్రాంతి రోజు చేసే పిండివంటలన్నింటిలో నువ్వులు ఎక్కువగా వినియోగిస్తారు. చాలా రాష్ట్రాల్లో నువ్వులతోనే పిండివంటలు చేసి పంచుకుంటారు. సంక్రాంతి సమయంలో నువ్వులు వాడకం వెనుక ఆరోగ్యరహస్యాలెన్నో ఉన్నాయి.



పెద్ద పండుగే కాదు పెద్దల పండుగ కూడా
మోక్షాన్ని ప్రసాదించే ఉత్తరాయణ పుణ్యకాలంలో పెద్దలకు సద్గతులు కలగాలని కోరుకుంటూ తర్పణాలను విడుస్తారు. అందుకే సంక్రాంతి పెద్ద పండుగ మాత్రమే కాదు, పెద్దల పండుగగా కూడా నిలుస్తుంది.



స్నేహభావం
ఎప్పుడూ మనమే అనే భావన కన్నా..నలుగురితో మనం అనే భావన మరింత ఆనందాన్నిస్తుంది. సంక్రాంతి పరమార్థం కూడా అదే. మన దగ్గర ఉన్నదాన్ని నలుగురితో పంచుకోవడమే అసలైన పండుగ అని చెబుతోంది.



సృజనాత్మకతని వెలికితీసే సంక్రాంతి ముగ్గులు,బొమ్మల కొలువులు, గాలిపటాలు...ఇలా సంక్రాంతి చుట్టూ ఎన్నో ఆచారాలు అద్భుతంగా అనిపిస్తాయి.



సంక్రాంతిని సౌరమానం ప్రకారం జరుపుకుంటాం కాబట్టి పండుగ తేదీల్లో పెద్దగా మార్పులుండవు.



Images Credit: Pinterest