ABP Desam


ఉత్తరాయణమే పుణ్యకాలం అని ఎందుకంటారు!


ABP Desam


'సరతి చరతీతి సూర్యః'
అంటే సంచరించేవాడని అర్థం. సూర్యుడి సంచారం రెండు విధాలుగా ఉంటుంది ఒకటి ఉత్తరాయణం , రెండోది దక్షిణాయణం. మనకు ఏడాది కాలం దేవతలకు ఒక్కరోజుతో సమానం.


ABP Desam


'ఆయనే దక్షిణే రాత్రిః ఉత్తరేతు దివా భవేత'
అంటే ఆరుమాసాల ఉత్తరాయణ కాలం దేవతలకు పగలు. ఆరుమాసాల కాలమైన దక్షిణాయణం రాత్రి


ABP Desam


సంక్రాంతి - సంక్రమణం అంటే చేరడం లేదా మారడంఅని అర్థం. సూర్యుడు మేషాది ద్వాదశ రాశుల్లో మారుతూ పూర్వరాశి నుంచి ఉత్తర రాశిలోకి ప్రవేశించడమే సంక్రాంతి.


ABP Desam


సూర్యుడు మకర రాశిలో ప్రవేశించినపుడు ఎవరైతే భక్తి శ్రద్ధలతో తెల్లవారుజామునే స్నానమాచరిస్తారో వారికున్న అనారోగ్య సమస్యలు తీరిపోతాయని.. ఎవరైతే స్నానమాచరించరో అలాంటి వారు ఏడు జన్మలు రోగిగా, దరిద్రుడిగా పుడతారని పండితులు చెబుతారు


ABP Desam


ఉత్తరాయణం పుణ్యకాలం అంటారు కాబట్టి దక్షిణాయణం పాపకాలం అని అర్ధం చేసుకోకూడదు. దక్షిణాయణం కూడా పుణ్య కాలమే.. అయితే ఉత్తరాయణం విశిష్టత వేరు.


ABP Desam


ఉత్తరాయణంలో దేవతలకు పగలు కాబట్టి ఈ ఆరునెలల మేల్కొని ఉంటారు. ఈ కాలంలో కాలంలో వాతావరణం ఆహ్లాదకరంగా ఉండడం వలన పుణ్య క్షేత్రాలు , తీర్ధ యాత్రలకు అనువుగా ఉంటుంది.


ABP Desam


సాధారణంగా దక్షిణ దిక్కు కన్నా ఉత్తర దిక్కుని పవిత్రంగా భావిస్తారు. ఉత్తర దిక్కును , ఉత్తర భూములనూ పవిత్రంగా భావించడం, వేద జననం ఉత్తర భూముల్లో జరగడం , హైందవ సంస్కృతి , జ్ఞాన విజ్ఞానం , భాష , నాగరికత ఉత్తరాది నుంచి దక్షిణాది వైపు రావడం......


ABP Desam


సమస్త భాషలకూ తల్లి అయిన సంస్కృతం ఉత్తరాదిన పుట్టడం , సమస్త ఋషులకూ , దేవతలకూ , పండితులకూ ఉత్తర భూములే నివాస స్థానాలు కావటం వీటితో పాటూ ప్రత్యక్ష నారాయణుడు సూర్య భగవానుడు ఉత్తర పధ చలనం చేయడం వల్ల ఉత్తరాయణ కాలాన్ని పుణ్యకాలంగా భావిస్తారు.


ABP Desam


మానవులు రాత్రులు నిద్రపోయి పగలు ఏ విధంగా మేలుకుంటారో అలాగే దేవతలు కూడా ఉత్తరాయణంలో మేల్కొని ఉంటారని ఈ సమయంలో భక్తితో ఏం కోరుకున్నా దేవతలు తీరుస్తారని పండితులు చెబుతారు.


ABP Desam


ఈ విషయం అందరికీ తెలియజేయడం కోసం పెద్దలు ఈ పండుగను పెద్ద పండుగగా జరపడం మొదలెట్టారట.
Images Credit: Pinterest