కలియుగం చివర్లో మనిషి ఆయుష్షు ఎంతో తెలుసా!



వేదాలను అనుసరించి మొత్తం నాలుగు యుగాలు. సత్యయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం. నాలుగో యుగమైన కలియుగం కాలపరిమితి 4 లక్షల 32 వేల సంవత్సరాలు. అందులో సుమారుగా ఐదు వేల సంవత్సరాలు గడిచిపోయాయి.



హిందూ , బౌద్ధ కాలమానాలకు ఆధార గ్రంధమైన సూర్య సిద్ధాంతం ప్రకారం పూర్వ శఖం 3102 ఫిబ్రవరి 18 అర్ధరాత్రి కలియుగం ప్రారంభమైంది. కృష్ణుడు సరిగ్గా అదే సమయానికి అవతారమును చాలించాడని చెబుతారు.



కలియుగానికి రాజు శని. మంత్రులు రాహు-కేతువులు. మంత్రులిద్దరికీ ఒకరకంటే ఒకరికి పడదు. కలియుగం ఆరంభంలో ధర్మ శాస్త్రాలను రక్షించే బ్రాహ్మణులను, అగ్రహారాలను , రాజులను నశింపచేస్తూ వచ్చారు. అప్పటి నుంచి క్రూరత్వం, అసత్యం, అధర్మం, అన్యాయం తలెత్తాయి.



ఈ యుగంలో వావి-వరుసలు తప్పి, వర్ణ సంకరాలు మొదలై దొరలే దొంగలవుతారు. దైవభక్తి తగ్గి హింసా సిద్ధాంతాలు పెరుగుతాయి. పాపం వల్ల దుంఖం అనుభవిస్తాం అనే భయంపోయి.. స్త్రీని, ధనాన్ని పొందినవాడే గొప్పవాడని అనుకునే రోజులొస్తాయి.



అధర్మం పెరుగుతుంది, వర్ణద్వేషాలు, మత విద్వేషాలు పెరుగుతారు. ఒక్క మాటలో చెప్పాలంటే కలియుగంలో మంచి అనే మాటకి చోటు లేకుండా అధర్మానికే మొగ్గు చూపుతారు.



ప్రస్తుతం కలియుగం 5000 సంవత్సరాలు గడిచిపోయింది. ఈ యుగంలో మానవుడి సగటు ఆయుష్షు వందేళ్ల కన్నా తక్కువే.



ఈ యుగం అంతమయ్యే నాటికి ఆయు:ప్రమాణం 12 ఏళ్లకు కుచించుకుపోతుందని భగవద్గీతలో ఓ శ్లోకంలో ప్రస్తావించారు



కలియుగాంతంలో కల్కి రూపంలో భగవంతుడు అవతరించి తిరిగి సత్య యుగ స్థాపనకు మార్గం సుగమం చేస్తాడని శివపురాణం చెబుతోంది.



(Images Credit: Pinterest)