ABP Desam


ఆ వైపు తిరిగి భోజనం చేస్తే కష్టాలు వెంటాడుతాయ్ జాగ్రత్త!


ABP Desam


భోజనం చేసేందుకు ఎప్పుడూ తూర్పు లేదా ఉత్తరాభిముఖంగా కూర్చోవాలి. దక్షిణాభిముఖంగా కూర్చొని ఎప్పుడూ భోజనం చెయ్యకూడదు.


ABP Desam


దక్షిణం యమస్థానం. ఇది మృత్యువుకు సంకేతం. కనుక అటువైపు తిరిగి తీసుకునే ఆహారం ఆరోగ్యానికి మంచిది కాదు.


ABP Desam


భోజనం వడ్డించుకున్న తర్వాత మొదటి ముద్దను దైవ ప్రార్థన చేసి పక్కన పెట్టాలి. భోజనం ముగించిన తర్వాత పశువులకు లేదా పక్షులకు లేదా చీమలు వంటి కీటకాలకు పెట్టాలి.


ABP Desam


భోజన సమయంలో గ్లాసులో నీళ్లు ఎప్పుడూ కుడి వైపు పెట్టుకోవాలి. ఇలా చేస్తే సదా శుభాలు కలుగుతాయి. జీవితం ఆనందంగా ఉంటుంది.


ABP Desam


భోజనం తర్వాత ప్లేట్ లో ఎప్పుడూ చేతులు కడగకూడదు. ఇలా చెయ్యడమంటే దరిద్రానికి ఆహ్వానం పలికినట్టే. సంపద నశిస్తుంది. ఇంట్లోని ఆనందం, శాంతి పోతాయి.


ABP Desam


భోజనం ఎప్పుడూ శుభ్రమైన ప్రదేశంలో, శుభ్రమైన పళ్లెంలోనే చెయ్యాలి.


ABP Desam


వెండి పళ్లెం భోజనానికి ఉపయోగించేట్టయితే తప్పనిసరిగా పళ్లెం మధ్యలో బంగారంతో చేసిన బొట్టు ఉండాలి. అలా లేని వెండి పళ్లెం భోజనానికి పనికిరాదు.


ABP Desam


భోజనం తర్వాత వెంటనే నిద్రించకూడదు. ఇది కూడా దరిద్రానికి చిహ్నం.



నోట్: కొన్ని పుస్తకాల నుంచి సేకరించి రాసిన సమాచారం ఇది...ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం



Images Credit: Pinterest