క్యాలెండర్ అనేది ఒక వ్యక్తి రోజువారీ పురోగతిని సూచిస్తుంది. క్యాలెండర్ ని ఇంట్లో ఎక్కడంటే అక్కడ తగిలించకూడదంటారు వాస్తు నిపుణులు. గడియారానికి ఎలాంటి నియమాలు వర్తిస్తాయో క్యాలెండర్ కి కూడా అలాంటి నియమాలే పాటించాలంటారు.
దక్షిణ దిక్కున వాల్ క్లాక్ పెడితే ఆ ఇంట్లో ఎవరో ఒకరు నిత్యం అనారోగ్యంతో బాధపడతారని చెబుతారు వాస్తునిపుణులు. అలాగే దక్షిణం వైపు క్యాలెండర్ పెడితే వ్యతిరేక శక్తులను ఆకర్షిస్తుంది , ఇంట్లో వారి పురోగతిని అడ్డుకుంటుంది
తూర్పు దిశగా క్యాలెండర్ పెడితే సంపద పెరుగుతుంది. ఈ దిశలో పెడితే ఆ ఇంట్లో వ్యక్తి కెరీర్ పరంగా వెలుగుతారు. ఈ దిశలో గులాబీ, ఎరుపు రంగుల క్యాలెండర్‌ను వేలాడదీయండి.
ఇంట్లో పశ్చిమ దిశగా క్యాలెండర్ పెడితే అనుకున్న పనుల్లో అడ్డంకులు తొలగిపోతాయి. మీరు పనిచేసే రంగంలో పురోగతి ఉంటుంది
ఉత్తర దిశగా క్యాలెండర్ పెట్టిన ఇంట్లో ఆనందం ఉంటుంది. జలపాతాలు, ఫౌంటెన్ వాంటి ఫొటోస్ ఉన్న క్యాలెండర్లు ఉత్తరం వైపు గోడకు తగిలించాలి
క్యాలెండర్ మీద అడవులు, మొక్కలు, పూలు ఉంటే దానిని తూర్పు దిశగా ఉంచడం మంచిది ఓంకారం, స్వస్తిక్, ఇంద్రధనస్సు, ఉదయించే సూర్యుడి ఫొటోలున్న క్యాలెండర్లు తూర్పు గోడకు పెట్టాలి
క్యాలెండర్‌ను ఎల్లప్పుడూ ఇంటి ప్రధాన ద్వారం ముందు వేలాడదీయకూడదు..ఇది ప్రతికూల శక్తులను ఆహ్వానిస్తుంది కొందరు తలుపుల వెనుక పెడతారు..ఇది కూడా సరికాదంటారు వాస్తు నిపుణులు
క్యాలెండర్‌లో యుద్ధం,ఎండిన చెట్టు, విచారకరమైన ఫొటోలు, క్రూర మృగాల ఫొటోలు ఉండకూడుదు.. ఇవి ఉండడం వల్ల కుటుంబంలో కలహవాతావరణం నెలకొంటుంది
చిరిగిన క్యాలెండర్ ఇంట్లో వాస్తు దోషాన్ని పెంచుతుంది Images Credit: Pinterest