చాణక్య నీతి: ఆ సమయంలో డబ్బు, భార్యని కూడా వదిలేయాలన్న చాణక్యుడు
ఆపదర్థే ధనం రక్షేద్ దారాన్ రక్షేద్ధనైరపి । ఆత్మానం సతతం రక్షేద్దారైరపి ధనైరపి॥
కష్టసమయంలో పనికొచ్చేట్టు ధనాన్ని రక్షించుకోవాలి. దనం కన్నా ఎక్కువగా భార్యను రక్షించుకోవాలి. అంటే డబ్బుకున్నా భార్యకు ఎక్కువ ప్రయార్టీ ఇవ్వాలి..కానీ...
తనను తాను రక్షించుకోవాల్సి వచ్చినప్పుడు ధనం, భార్య ని కూడా వదులుకునేందుకు సిద్ధంగా ఉండాలి. ఎందుకంటే తనని తాను రక్షించుకున్నప్పుడే కదా ఇతరులకు సహాయపడగలడు
ఇబ్బందుల్లో, బాధల్లో ఉన్నప్పుడు ధనమే పనికొస్తుంది కాబట్టి డబ్బు దాచుకోవడం అవసరం...
అయితే డబ్బుని మించినది భార్య.. అందుకే డబ్బుకన్నా ముందుగా ఆమెకి రక్షణ ఇవ్వాలి...
కానీ భార్య కన్నా ముందు తనని తాను రక్షించుకోవాలంటాడు చాణక్యుడు. అప్పుడే సంపదను అనుభవించగలడు, జీవితాన్ని కొనసాగించగలడు..
ఈ లెక్కన ఆచార్య చాణక్యుడు ధనానికి తక్కువ ప్రయార్టీ ఇచ్చాడనుకుంటే పొరపాటే. ఎందుకంటే ఓ వ్యక్తికి డబ్బు ఎంత అవసరమో, ఎలా సంపాదించాలి, ఎలా నిలుపుకోవాలో ప్రత్యేకంగా ఎన్నో సూచనలు చేశాడు చాణక్యుడు
కేవలం ఆపదల సమయంలో మాత్రమే...ఇలాంటి నిర్ణయం తీసుకోవాలని స్పష్టం చేశాడు చాణక్యుడు
క్షత్రియ స్త్రీలు తమ రాజ్యాన్ని పరిరక్షించుకోవడం అసంభవం అన్న పరిస్థితి వస్తే వారు 'జౌహారు' వ్రతాన్ని ఆచరించి అగ్నికి ఆహుతయ్యేవారు.. ఇదే జీవిత ధర్మం అంటాడు చాణక్యుడు