గుడిలో తీర్థం తీసుకున్నాక చేయి తలకు రాసుకుంటున్నారా!
సాధారణంగా దేవాలయాలకు వెళ్ళినప్పుడు పురోహితులు అకాల మృత్యు హరణం సర్వవ్యాధి నివారణం సమస్త పాపక్షయకరం పాదోదకం పావనం అనే మంత్రాన్ని చెబుతూ తీర్ధం ఇస్తారు
అకాల మరణాన్ని తప్పించే శక్తి, రోగాల నివారణ, పాపక్షయం అయిన తీర్థాన్ని... భక్తుడు స్వచ్ఛమైన మనసుతో స్వీకరించాలని దీని అర్థం. అయితే తీర్థం తీసుకున్నాక చేయి తలకు రాసుకోవడమే సరికాదంటున్నాయి శాస్త్రాలు.
తీర్థం తీసుకున్నప్పుడు చేయి ఎంగిలి అవుతుంది. ఆ ఎంగిలి చేతిని కడుక్కోవాలి కానీ తలకు రాసుకోరాదు.
తీర్థం తీసుకున్నాక స్వామి వారి శఠకోపం తలపై పెడతారు. ఎంగిలి చేయి తలపై రాసుకుంటే స్వామివారి పాదాలుగా భావించే శఠకోపం అపవిత్రం అవుతుందని చెబుతారు.
తీర్ధం తీసుకున్న తర్వాత ఆ చేతిని కళ్ళకు అడ్డుకోవడం ఎంతో మంచిదని చెబుతారు పండితులు.
మొదటి సారి తీర్థం తీసుకోవడం వల్ల మానసిక, శారీరక శుద్ధి జరుగుతుంది.
రెండోసారి తీర్థం తీసుకోవడం వల్లన్యాయ, ధర్మప్రవర్తనలు చక్కదిద్దుకుంటాయి