ABP Desam


దేవాలయానికి ఖాళీ చేతులతో వెళుతున్నారా!


ABP Desam


దేవాలయం అంటే దేవుడు కొలువైన స్థలం..పవిత్రమైన ప్రదేశం.. అలాంటి ప్రదేశానికి వెళ్లే భక్తులు కొన్ని పద్ధతులు పాటించాలి..అప్పుడే దైవం అనుగ్రహానికి పాత్రులవుతారు


ABP Desam


గుడికి వెళ్ళే ముందు శుచిగా స్నానం చేసి, నుదుటన కుంకుమ ధరించాలి
సంప్రదాయ వస్త్రాలతోనే దేవుడిని దర్శించుకోవాలి


ABP Desam


పెద్దవారి దగ్గరికి, పిల్లల దగ్గరకు, దేవుడి దగ్గరకు వెళ్లినప్పుడు ఒట్టి చేతులతో వెళ్లకూడదు..అందుకే పళ్లు, పూలు తీసుకుని వెళ్లాలి.. గీతలో కృష్ణ పరమాత్ముడు ఏం చెప్పాడంటే....


ABP Desam


'' పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి ...ఎవరైతే నాకు భక్తీతో పత్రం కాని పుష్పం కాని ఫలం కాని ఉదకం కాని సమర్పిస్తారొ వాటిని ప్రీతితో స్వీకరిస్తాను'' అన్నాడు.


ABP Desam


గుడికి చేరుకోగానే కాళ్ళూ చేతులు శుభ్రంగా కడుక్కోవాలి
ఆలయంలోకి ప్రవేశించడానికి ముందు గోపురానికి నమస్కరించి తర్వాత మెట్లకు నమస్కరించాలి


ABP Desam


లోపలకు అడుగుపెట్టాక మనసులో భగవంతుడి ధ్యానం తప్ప..మరో ఆలోచన ఉండకూడదు
ప్రదిక్షిణ చేసిన తర్వాత మొదట మూల విగ్రహం పాదాలను దర్శించుకుని ఆ తర్వాత స్వామివారి రూపం మొత్తాన్ని చూడాలి


ABP Desam


అర్చన చేయించుకునేవారు గోత్రం, ఇంటిపేరు నక్షత్రం చెప్పుకోవాలి.
దర్శనం అయి తీర్థం తీసుకున్నతర్వాత కాసేపు స్వామి అమ్మవారి సన్నిధిలో ప్రశాంతంగా కూర్చోవాలి


ABP Desam


ప్రసాదం తీసుకుని బయటకు వెళ్లేముందు మరోసారి దేవుడిని దర్శించుకుని..గోపురానికి నమస్కరించి బయటకు రావాలి
ఆలయంలో అనవసరంగా మాట్లాడటం, పరుషపదజాలం ఉపయోగించడం చేయరాదు


ABP Desam


ఆవలింతలు, జుట్టు పీక్కోవడం, తల గోక్కోవడం, తాంబూలం వేసుకోవడం చేయరాదు... జనన, మరణానికి సంబంధించిన విషయాలు గుడిలో మాట్లాడకూడదు.. మూలవిరాట్ దగ్గర దీపం లేకుండా దర్శనం చేసుకోరాదు


ABP Desam


ధ్వజస్తంభం, బలిపీఠం, గోపుర స్థలాలను తొక్క కూడదు.. నందీశ్వరుడు, శివలింగానికి మధ్యనుంచి నడిచి వెళ్ళకూడదు .. ఆలయంలో ఎత్తైన ప్రాంతంలో కూర్చోకూడదు, బలిపీఠానికి మొక్కకూడదు
Images Credit: Pinterest