ABP Desam


ఈ సంక్రాంతికి ఈ పనులు తప్పకుండా చేయండి!


ABP Desam


నదీస్నానం ఉత్తమం
మకర సంక్రాంతి రోజున గలగలపారే నీటిలో స్నానం చేయడం చాలామంచిదంటారు. దేశంలో వివిధ ప్రాంతాల ప్రజలు ఈరోజు గంగా నదిలో కానీ, తమకు సమీపంలో ఉన్న నదిలో కానీ స్నానం చేస్తారు.


ABP Desam


ఈ అవకాశం లేనివారు... గతంలో నదీస్నానానికి వెళ్లినప్పుడు బాటిల్స్ లో తీసుకొచ్చిన నీటిని ట్యాంక్ లో మిక్స్ చేసి చేసినా కొంత ఫలితం ఉంటుంది.


ABP Desam


సూర్యుడికి నమస్కారం చేయండి
ఈ మూడు రోజులైనా తెల్లవారుజామునే లేచి స్నానమాచరించి..సూర్యుడికి అర్ఘ్యం( దోసిలితో నీరు) అర్పించండి.


ABP Desam


మకర రాశిలోకి ప్రవేశించిన సూర్య భగవానుని ఆరాధించడం వల్ల ఇప్పటి వరకూ జీవితంలో ముసురుకున్న చీకట్లు మాయమై వెలుగులు విరజిమ్ముతాయని విశ్వాసం.


ABP Desam


మీ శక్తి మేరకు దానం చేయండి
పండుగ అంటేనే అంతా సంతోషంగా ఉండడం. అందుకే ఈ రోజున పేదలకు అన్నదానం చేయండి. వస్త్రదానం మరీ మంచిది. ఇంటింటా సందడి చేసే డూడూ బసవన్నకి ఆహారం అందించండి.


ABP Desam


పిండి వంటలు పంచుకోండి
సంక్రాంతికి దాదాపు పది రోజుల ముందు నుంచీ పిండివంటలు ఘుమఘుమలాడిపోతుంటాయి. ఏ ఇంట చూసినా పిండి వంటలు తయారీనే...సరదాగా చుట్టుపక్కల వారితో మీరు చేసిన వంటకాలు పంచుకోండి.


ABP Desam


ఆకలితో ఉన్నవారు కనిపించకూడదు
పండుగ రోజుల్లో మధ్యాహ్నం భోజనం తర్వాత భుక్తాయాసం తీర్చుకునేందుకు మీ చుట్టుపక్కల ప్రాంతాన్ని అలా చుట్టేసి రండి. ఎక్కడైనా ఎవరైనా ఆకలితో ఉంటే ఆ రోజు వారికి మీకు తోచిన సాయం చేయండి.


ABP Desam


పండుగ రోజు మనం పది రకాల వంటకాలతో భోజనం చేయడం కాదు.. పస్తులున్న వారికి గుప్పెడు మెతుకులు ఇవ్వడం కన్నా పెద్ద పండుగ ఏముంది.


ABP Desam


Images Credit: Pinterest