అన్వేషించండి

Telangana LRS Scheme: ఆ ప్లాట్లు మాత్రమే క్రమబద్ధీకరణకు ఛాన్స్, LRSపై తెలంగాణ ప్రభుత్వం కీలక అప్‌డేట్

Land Regularisation Scheme | అక్రమ లేఅవుట్లు, పర్మిషన లేని లే ఔట్లలో ప్లాట్లు కొనుగోలు చేసి ఇబ్బంది పడుతున్న వారికి ఎల్ఆర్ఎస్ కింద రెగ్యూలరైజేషన్ చేసుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.

LRS in Telangana | హైదరాబాద్: అనుమతి లేని లేఅవుట్ ప్లాట్ల క్రమబద్ధీకరణకు తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఈ మేరకు ఇటీవల కీలక ప్రకటన చేసింది. దాని ప్రకారం ఎల్ఆర్ఎస్ (Land Regularisation Scheme) కింద ప్లాట్ల రెగ్యులరైజేషన్ను సోమవారం నుంచి మొదలుపెట్టింది. నిషేధిత జాబితాలో లేని, హైడ్రా నిబంధనలకు విరుద్ధంగా లేని సర్వే నెంబర్లలోని ప్లాట్ లకు ఆటోమేటిక్ ఫీజు చెల్లింపు పత్రాలు జారీ చేస్తున్నారు. ఎల్‌ఆర్ఎస్ (LRS) కింద రాష్ట్రవ్యాప్తంగా 25 లక్షల 70 వేల ప్లాట్లను క్రమబద్ధీకరణ చేయనున్నారు. దాంతో గత నాలుగేళ్ల నుంచి ప్లాట్ల రెగ్యులరైజేషన్ కోసం ఎదురుచూస్తున్న వారికి భారీ ఊరట కలగనుంది. చెరువులకు 200 మీటర్లలోపు ఉన్న ప్లాట్లకు రిజిస్ట్రేషన్ కు అవకాశం కల్పించడం లేదు.

అక్రమ లేఅవుట్ల ప్లాట్ల రిజిస్ట్రేషన్
అనధికారిక లేవట్లను క్రమబద్ధీకరణ చేసే ఎల్ఆర్ఎస్ ప్రక్రియలో ప్రభుత్వం వేగం పెంచుతుంది. 2020 ఆగస్టు 26 తేదీ నాటికి ఏదైనా లేఔట్లలో 10 శాతం ప్లాట్లు రిజిస్ట్రేషన్ అయినట్లయితే, అలాంటి లేఅవుట్లలో మిగతా ప్లాట్లను క్రమబద్ధీకరణ చేసుకునేందుకు అవకాశం కల్పించింది. మార్చి 31వ తేదీలోగా ఓపెన్ స్పేస్ చార్జీలు క్రమబద్ధీకరణ ఫీజు కల్పి చెల్లించే వారికి 25% రాయితీ ఇవ్వనున్నట్లు తెలంగాణ ప్రభుత్వం ఇటీవల ప్రకటించింది. ఒకవేళ ఎల్లారీస్ ఫీజు చెల్లించాక వారి అప్లికేషన్ కనుక రిజెక్ట్ అయితే పది శాతం ప్రాసెసింగ్ చార్జీలు తీసుకొని మిగతా మొత్తాన్ని దరఖాస్తుదారులకి వెనక్కి ఇవ్వనున్నారు.

మార్చి 31 వరకు అవకాశం

పర్మిషన్ లేని లే ఔట్లలో ప్లాట్లు ఉన్నవారు ఎల్ఆర్ఎస్ ద్వారా రెగ్యులరైజేషన్ చేసుకోవచ్చు. ఏ మేరకు సోమవారం నుంచి ఆ ఫ్లాట్లకు ఆటోమేటిక్ ఫీజు చెల్లింపు పత్రాలు జారీ మొదలైంది. గత నాలుగేళ్లుగా ప్లాట్లు రెగ్యులరైజేషన్ కోసం ఎదురుచూస్తున్న వారికి కాంగ్రెస్ ప్రభుత్వం పోరాట కలిగించింది. రెవెన్యూ రిజిస్ట్రేషన్లు నీటిపారుదల శాఖ అధికారులు సమన్వయం చేసుకొని అక్రమ లేఔట్ లో జాబితా ఇలాంటి వివరాలను సాఫ్ట్వేర్ లో అనుసంధానం చేశారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం అర్హులైన వారు వెంటనే ఫీజు చెల్లించి తమ ఫ్లాట్లను మార్చి 31 తేదీలోగా క్రమబద్ధీకరణ చేసుకోవాలని పురపాలక శాఖ సూచించింది.

2020లో తొలిసారి గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎల్‌ఆర్‌ఎస్‌ పథకాన్ని ప్రకటించింది. ఆగస్టు 31 నుంచి అక్టోబర్ 31, 2020 వరకు అక్రమ లేఅవుట్ల క్రమబద్ధీకరణ కోసం దరఖాస్తులను    సీకరించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఎల్‌ఆర్ఎస్ కోసం ఏకంగా 25.70 లక్షల దరఖాస్తులు వచ్చాయి. 

సందేహాలు ఉంటే కాల్ సెంటర్ నెంబర్ ఇదే..

జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ పరిధిలో ప్లాట్ల ఎల్‌ఆర్‌ఎస్‌ రెగ్యులరైజేషన్ కోసం ఏమైనా సందేశాలు ఉంటే స్పెషల్ కాల్ సెంటర్‌ నంబర్ 1800 599 8838 లో సంప్రదించాలని దరఖాస్తుదారులకు సూచించారు. ఎల్‌ఆర్ఎస్ ఫీజు చెల్లించిన వారి సమస్యను 10 రోజుల్లో పరిష్కరించనున్నట్లు అధికారులు చెబుతున్నారు.  నిషేధిత జాబితాలో లేని, చెరువులు, కాలువలకు 200 మీటర్ల పరిధిలోకి రాని సర్వే నంబర్లలోని ప్లాట్లకు ఎల్‌ఆర్‌ఎస్‌ ఫీజు చెల్లించి రెగ్యులరైజేషన్ చేసుకోవచ్చు. ఈ పరిధిలోకి వచ్చే ప్లాట్లకు ఆటోమేటిక్‌గా ఎల్‌ఆర్‌ఎస్‌ ఫీజు నోటీసులు జనరేట్ అవుతాయి. మార్చి 31 తేదీలోగా ఎల్ఆర్ఎస్ సహా సంబంధిత ఫీజులు చెల్లించే వారికి 25 శాతం మేర రాయితీ కల్పిస్తామని సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు ఇదివరకే స్పష్టం చేశారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Lafoot Gang Producer : 2 కోట్ల గోల్డ్ స్కామ్ - టాలీవుడ్ నిర్మాత అరెస్ట్... 14 రోజుల రిమాండ్
2 కోట్ల గోల్డ్ స్కామ్ - టాలీవుడ్ నిర్మాత అరెస్ట్... 14 రోజుల రిమాండ్
Inter Student Commits Suicide: నువ్వేమైనా మంత్రి కొడుకువా? మహిళా లెక్చరర్ అవమానించడంతో ఇంటర్ టాపర్ ఆత్మహత్య- గద్వాలలో ఘటన
నువ్వేమైనా మంత్రి కొడుకువా? మహిళా లెక్చరర్ అవమానించడంతో ఇంటర్ టాపర్ ఆత్మహత్య- గద్వాలలో ఘటన
Hyderabad Crime News: మియాపూర్‌లో మ్యాన్‌హోల్‌లో పడి వ్యక్తి గల్లంతు.. ఘటనాస్థలానికి వెళ్లిన ఎమ్మెల్యే గాంధీ
మియాపూర్‌లో మ్యాన్‌హోల్‌లో పడి వ్యక్తి గల్లంతు.. ఘటనాస్థలానికి వెళ్లిన ఎమ్మెల్యే గాంధీ
Jubilee Hills CI Suspension: ఫిర్యాదు చేయడానికి వచ్చిన మహిళను వీడియోలతో బ్లాక్ మెయిల్! జూబ్లీహిల్స్ సీఐపై సస్పెన్షన్‌ వేటు
ఫిర్యాదు చేయడానికి వచ్చిన మహిళను వీడియోలతో బ్లాక్ మెయిల్! జూబ్లీహిల్స్ సీఐపై సస్పెన్షన్‌ వేటు

వీడియోలు

India Test Squad For Sri Lanka Tour | శ్రీలంక టూర్‌కి భారత టెస్ట్ టీమ్ ప్రకటన
Ryan Ten Doeschate & T Dilip Out From Team India | వరుస ఓటములతో BCCI సంచలన నిర్ణయం
Aishwarya Varma Unknown Facts | సీరియల్ యాక్టర్ ఐశ్వర్య వర్మ రియల్ లైఫ్ స్టోరీ
Gundenininda Gudigantalu Serial July 29 | రవి-శృతి గొడవ.. రోహిణికి చిక్కిన విల్లా విజయ్
Sanju Reveals Virat Kohli's Fitness Diet | విరాట్ ఫిట్‌నెస్ సీక్రెట్ చెప్పిన సంజూ శాంసన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
West Bengal Birbhum Police Raid: బెంగాల్‌లో షాకింగ్ రైడ్ - బస్సు డ్రైవర్ ఇంట్లో రూ.20 కోట్ల నగదు, 15 కిలోల బంగారం స్వాధీనం!
బెంగాల్‌లో షాకింగ్ రైడ్ - బస్సు డ్రైవర్ ఇంట్లో రూ.20 కోట్ల నగదు, 15 కిలోల బంగారం స్వాధీనం!
Tamil Nadu Head Shaving Scam: ప్రభుత్వ పథకం పేరిట వింత మోసం - గుండు గీయించుకుంటే రూ.15 వేలంటూ మహిళలకు బురిడీ!
ప్రభుత్వ పథకం పేరిట వింత మోసం - గుండు గీయించుకుంటే రూ.15 వేలంటూ మహిళలకు బురిడీ!
Ram Charan : ఆస్పత్రి నుంచి రామ్ చరణ్ డిశ్చార్జ్ - ఉపాసనతో కలిసి అయ్యప్ప ఆలయానికి మెగా పవర్ స్టార్
ఆస్పత్రి నుంచి రామ్ చరణ్ డిశ్చార్జ్ - ఉపాసనతో కలిసి అయ్యప్ప ఆలయానికి మెగా పవర్ స్టార్
Vaibhav Sooryavanshi News: వైభవ్ సూర్యవంశీకి ప్ర‌మోష‌న్.. ఆజ‌ట్టుకు  వైస్ కెప్టెన్ గా వ్య‌వ‌హ‌రించ‌నున్న 15 ఇయ‌ర్స్ కిడ్
వైభవ్ సూర్యవంశీకి ప్ర‌మోష‌న్.. ఆ జ‌ట్టుకు  వైస్ కెప్టెన్ గా వ్య‌వ‌హ‌రించ‌నున్న 15 ఇయ‌ర్స్ కిడ్
Maruti Suzuki Victoris EMI calculator: హైదరాబాద్‌లో మారుతి విక్టోరిస్‌ కొనాలి అంటే నెలకు చెల్లించాల్సిన EMI ఎంత?
హైదరాబాద్‌లో మారుతి విక్టోరిస్‌ కొనాలి అంటే నెలకు చెల్లించాల్సిన EMI ఎంత?
Inter Student Commits Suicide: నువ్వేమైనా మంత్రి కొడుకువా? మహిళా లెక్చరర్ అవమానించడంతో ఇంటర్ టాపర్ ఆత్మహత్య- గద్వాలలో ఘటన
నువ్వేమైనా మంత్రి కొడుకువా? మహిళా లెక్చరర్ అవమానించడంతో ఇంటర్ టాపర్ ఆత్మహత్య- గద్వాలలో ఘటన
Korean Horror Thriller OTT : దెయ్యాల కోసం వేట... వెంటాడే మృత్యువు - ఓటీటీలోకి సెన్సేషనల్ హారర్ థ్రిల్లర్... తెలుగులోనూ స్ట్రీమింగ్
దెయ్యాల కోసం వేట... వెంటాడే మృత్యువు - ఓటీటీలోకి సెన్సేషనల్ హారర్ థ్రిల్లర్... తెలుగులోనూ స్ట్రీమింగ్
GHMC Indiramma Housing Scheme: KCR డబుల్ బెడ్‌రూం ఇళ్ల ఫార్ములాతోనే కాంగ్రెస్ ఇందిరమ్మ బెట్ - దరఖాస్తులతో ఓట్లు రాలుతాయా?
డబుల్ బెడ్‌రూం ఇళ్ల ఫార్ములాతోనే కాంగ్రెస్ ఇందిరమ్మ బెట్ - దరఖాస్తులతో ఓట్లు రాలుతాయా?
Embed widget