అన్వేషించండి

Ramam Raghavam OTT Release: తండ్రిని కొడుకు ఎందుకు హత్య చేయాలనుకున్నాడు? - ఓటీటీలోకి వచ్చేస్తోన్న 'రామం రాఘవం', ఎందులోనో తెలుసా!

Ramam Raghavam OTT Platform: కమెడియన్ ధన్ రాజ్, దర్శకుడు సముద్రఖని తండ్రీ కొడుకులుగా నటించి మెప్పించిన సినిమా 'రామం రాఘవం'. ఈ మూవీ త్వరలోనే 'ఈటీవీ విన్' ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.

Dhanraj's Ramam Raghavam OTT Release On ETV Win: జబర్దస్త్ కమెడియన్ ధన్ రాజ్ (Dhan Raj) స్వీయ దర్శకత్వంలో ప్రముఖ దర్శకుడు సముద్రఖని (Samuthirakhani) కీలక పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ 'రామం రాఘవం' (Ramam Raghavam). ఈ మూవీలో వీరిద్దరూ తండ్రీ కొడుకులుగా నటించారు. ఫిబ్రవరి 21న విడుదలైన ఈ సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. తాజాగా, ఓటీటీలోనూ రిలీజ్ అయ్యేందుకు సిద్ధమవుతోంది. త్వరలోనే 'ఈటీవీ విన్' (ETV Win) ఓటీటీలోకి స్ట్రీమింగ్ కానుంది. 'కొన్ని పోరాటాలు కుటుంబాల్లోనే ఉంటాయి. కానీ ఇది పెద్ద తెరపై తుపానులా మారింది. త్వరలో వస్తోన్న బ్లాక్ బస్టర్ 'రామం రాఘవం'కు సిద్దంగా ఉండండి.' అంటూ సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. ఈ సినిమాలో మోక్ష, హరీష్ ఉత్తమన్, వాసు ఇంటూరి, సత్య, పృథ్వి, శ్రీనివాసరెడ్డి, చిత్రం శ్రీను, ప్రమోదిని, సునీల్, రాకెట్ రాఘవ, రచ్చ రవి కీలక పాత్రలు పోషించారు. 'విమానం' సినిమా దర్శకుడు శివప్రసాద్ యానాల స్టోరీ అందించగా.. అరుణ్ చిలువేరు మ్యూజిక్ అందించారు.

కథేంటంటే..?

కమెడియన్‌గా పలు చిత్రాలతో మెప్పించిన ధన్ రాజ్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన మూవీ 'రామం రాఘవం'. తండ్రీ కొడుకుల మధ్య సాగే అంశాలనే ప్రధాన కథాంశంగా ఆయన రూపొందించారు. ఇక కథ విషయానికొస్తే.. తండ్రి దశరథ రామం (సముద్రఖని) ఓ రిజిస్టార్ ఆఫీస్‌లో ఉద్యోగి. ఒక్క రూపాయి లంచం తీసుకోకుండా నీతి, నిజాయితీగా తన బాధ్యతలు నిర్వర్తిస్తుంటాడు. ఆ తండ్రికి కొడుకు రాఘవ (ధన్ రాజ్). తన కొడుకుని డాక్టర్‌ను చేయాలని రామం కలలు కంటాడు. అయితే, తండ్రిని పట్టించుకోకుండా చదువు మానేసి చిన్నప్పటి నుంచే వ్యసనాలకు బానిపై జులాయిగా తిరుగుతుంటాడు రాఘవ. కొడుకుని చూసి బాధ పడినా అతన్ని మార్చాలని ప్రయత్నించి విఫలమవుతాడు తండ్రి. చివరకు విసిగిపోయి కొడుకును అసహ్యించుకుంటాడు. వేగంగా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో బెట్టింగ్‌లకు పాల్పడుతూ ఊరంతా అప్పులు చేస్తాడు రాఘవ. 

Also Read: 'రష్మికకు సరైన గుణపాఠం నేర్పించాల్సిన అవసరం లేదా?' - నటిపై కాంగ్రెస్ ఎమ్మెల్యే ఫైర్ 

అయితే, ఈ క్రమంలోనే తండ్రి సంతకాన్ని ఫోర్జరీ చేసి దొరికిపోతాడు. దీంతో రామంపై అవినీతిపరుడు అనే ముద్ర పడుతుంది. ఈ క్రమంలో కొడుకును ఇంట్లో నుంచి గెంటేస్తాడు. చివరకు ఆస్తి, ఉద్యోగం, ఇన్సూరెన్స్ డబ్బుల కోసం తండ్రినే చంపాలనుకుంటాడు రాఘవ. దీని కోసం రాఘవ ఏం చేశాడు.? తండ్రి గొప్పతనం తెలుసుకుంటాడా.? ఈ తండ్రీ కొడుకుల కథ తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ప్రతి ఇంట్లో జరిగే తండ్రీ కొడుకుల మధ్య ఎమోషన్‌ను ధన్‌రాజ్ చాలా బాగా చూపించారు.

Also Read: రామ్ చరణ్ ‘మగధీర’, వైష్ణవ్ తేజ్ ‘ఉప్పెన’ టు మోహన్ బాబు ‘బ్రహ్మ’, శ్రీహరి ‘సాంబయ్య’ వరకు- ఈ మంగళవారం (మార్చి 4) టీవీలలో వచ్చే సినిమాలివే..

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Agadha Trailer Review : అగధ అంటే ఏంటో తెలుసా? - ట్రైలర్ చూస్తే గూస్ బంప్స్ గ్యారెంటీ
అగధ అంటే ఏంటో తెలుసా? - ట్రైలర్ చూస్తే గూస్ బంప్స్ గ్యారెంటీ
Nithiin Nani : హీరో నితిన్... ప్రొడ్యూసర్ నాని - రోహిణి వైఫ్ ఆఫ్ కృష్ణ... వి'చిత్ర' ప్రేమ కథ
హీరో నితిన్... ప్రొడ్యూసర్ నాని - రోహిణి వైఫ్ ఆఫ్ కృష్ణ... వి'చిత్ర' ప్రేమ కథ
This Week OTT Movies : లెనిన్ To క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్స్ - ఈ వారం ఓటీటీ మూవీస్ కంప్లీట్ లిస్ట్
లెనిన్ To క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్స్ - ఈ వారం ఓటీటీ మూవీస్ కంప్లీట్ లిస్ట్
This Week Theatrical Movies : ఈ వారం థియేట్రికల్ రిలీజెస్ - మెగా ప్రిన్స్ మూవీతో పాటు రొమాంటిక్ డ్రామా... ఒక్క రోజే 8 సినిమాలు
ఈ వారం థియేట్రికల్ రిలీజెస్ - మెగా ప్రిన్స్ మూవీతో పాటు రొమాంటిక్ డ్రామా... ఒక్క రోజే 8 సినిమాలు

వీడియోలు

Bumrah Ruled Out Of Test Series | శ్రీలంక టెస్ట్ సిరీస్‌ నుంచి బుమ్రా అవుట్
Hardik Pandya Trade to CSK IPL 2027 | రూమర్స్ పై క్లారిటీ ఇచ్చిన ముంబై ఇండియన్స్
Zaheer Abbas About Rohit Sharma & Virat | రో, కోపై పాక్ లెజెండ్ సంచలన వ్యాఖ్యలు
Ujjaini Mahankali Bonalu 2026 | అమ్మవారికి తొలి బోనం సమర్పించిన పొన్నం
HYDRAA Restores Uppal Nalla Cheruvu Lake | ఉప్పల్ నల్లచెరువుకు కొత్త జలకళ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Brij Bhushan Sharan Singh: రెజ్లర్ లైంగిక వేధింపుల కేసులో నిర్దోషిగా బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్ విడుదల! 
రెజ్లర్ లైంగిక వేధింపుల కేసులో నిర్దోషిగా బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్ విడుదల! 
Uday Krishna Reddy: ట్రైనీ ఐపీఎస్‌ ఉదయ్‌ కృష్ణారెడ్డి కేసులో మరో ట్విస్ట్‌! మరో మహిళతో ప్రేమాయణం! లవ్‌లెటర్స్‌, కత్తీ స్వాధీనం!
ట్రైనీ ఐపీఎస్‌ ఉదయ్‌ కృష్ణారెడ్డి కేసులో మరో ట్విస్ట్‌! మరో మహిళతో ప్రేమాయణం! లవ్‌లెటర్స్‌, కత్తీ స్వాధీనం!
AP Voter List Deletions: ఏపీలో 44 లక్షల ఓట్లు గల్లంతు - నెల్లూరు, తిరుపతి, కడపలోనే ఎక్కువ.. ఏ పార్టీకి నష్టం?
ఏపీలో 44 లక్షల ఓట్లు గల్లంతు - నెల్లూరు, తిరుపతి, కడపలోనే ఎక్కువ.. ఏ పార్టీకి నష్టం?
CWG India Analysis: గ్లాస్గో కామన్వెల్త్ లో తగ్గిన పతకాలు.. అయినా టాప్ 4 స్థానంలో ఇండియా సంచలనం
గ్లాస్గో కామన్వెల్త్ లో తగ్గిన పతకాలు.. అయినా టాప్ 4 స్థానంలో ఇండియా సంచలనం
HYDRA Commissioner Ranganath Removal Order: హైడ్రా చుట్టూ న్యాయపరమైన సంక్షోభం - రంగనాథ్ బదిలీకి హైకోర్టు ఆదేశం.. రేవంత్ ప్రభుత్వ వ్యూహం ఏమిటి?
హైడ్రా చుట్టూ న్యాయపరమైన సంక్షోభం - రంగనాథ్ బదిలీకి హైకోర్టు ఆదేశం.. రేవంత్ ప్రభుత్వ వ్యూహం ఏమిటి?
West Bengal Industrial Revival: పశ్చిమ బెంగాల్ పారిశ్రామిక రీ-ఎంట్రీ - సువేందు భవ్య రసాయన్ విజన్.. గుజరాత్, మహారాష్ట్రలకు పోటీగా నిలబడగలదా?
పశ్చిమ బెంగాల్ పారిశ్రామిక రీ-ఎంట్రీ - సువేందు భవ్య రసాయన్ విజన్.. గుజరాత్, మహారాష్ట్రలకు పోటీగా నిలబడగలదా?
Nithiin Nani : హీరో నితిన్... ప్రొడ్యూసర్ నాని - రోహిణి వైఫ్ ఆఫ్ కృష్ణ... వి'చిత్ర' ప్రేమ కథ
హీరో నితిన్... ప్రొడ్యూసర్ నాని - రోహిణి వైఫ్ ఆఫ్ కృష్ణ... వి'చిత్ర' ప్రేమ కథ
Breaking News: కుత్బుల్లాపూర్‌లో భారీ బందోబస్తు మధ్య అక్రమ కట్టడాలు కూల్చివేత!
కుత్బుల్లాపూర్‌లో భారీ బందోబస్తు మధ్య అక్రమ కట్టడాలు కూల్చివేత!
Embed widget