అన్వేషించండి

Hathras News: ప్రయాగరాజ్‌ నుంచి హథ్రాస్‌ ప్రాణాలు తీసిన దుర్ఘటనలెన్నో? ఈ జాబితాలో ఏపీ కూడా ఉంది

Stampedes In India: హథ్రాస్‌ తొక్కిసలాటలో వందమందికి పైగా మృతితో దేశం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. గతంలో ఇదే విధంగా జరిగిన ఘటనలు గుర్తు చేసుంటున్నారు.

Stampedes History: ఉత్తరప్రదేశ్‌లోని హథ్రాస్‌( Hathras)లో జరిగిన ఘోర తొక్కిసలాటలో వందమందికిపైగా మృతి చెందారు. వేలాదిమందికి తరలిరావడం..ఒక్కసారిగా తోపులాటకు గురవ్వడంతోనే ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటాయి. గతంలోనూ ఇలాంటి ఘటనలో వందలాది మంది ప్రాణాలు పొగొట్టుకున్నారు.అవి ఒకసారి చూద్దాం...

* మహారాష్ట్ర(Maharastra)లోని ప్రముఖ ఆలయాల్లో ఒకటైన మందర్‌దేవి(Mandhar Devi) ఆలయానికి భారీగా భక్తులు వస్తుంటారు. 2005లో జరిగిన తొక్కిసలాటలో దాదాపు 350 మంది వరకు మరణించారు.

 * రాజస్థాన్‌(Rajasthan)లోని చాముండాదేవీ(Chamunda Devi) ఆలయంలో 2008లో జరిగిన తొక్కిసలాటలో 250 మందికి పైగా మృతిచెందగా...దాదాపు 500 మంది గాయాలపాలయ్యారు

* హిమాచల్‌ప్రదేశ్‌(Himachel Pradesh)లోని వైనాదేవీ ఆలయంలోనూ 2008లో భారీ తొక్కిసలాట జరిగింది. ఈఘటనలో 162 మంది భక్తులు కన్నుమూశారు

*మధ్యప్రదేశ్‌(Madya Pradesh)లోని ఇండోర్‌లో గతేడాది జరిగిన తొక్కిసలాటలో 36 మంది చనిపోయారు

* దేశంలోనే అతిపెద్ద తొక్కిసలాట ప్రమాదం అంటే గుర్తుకొచ్చిది మాత్రం...1954 కుంభమేళా(Khumbhamela) ప్రమాదమే. ఉత్తరప్రదేశ్‌లోని (Uthara pradesh) ప్రయాగరాజ్‌ వద్దకు లక్షలాదిగా భక్తులు తరలిరాగా...ఒక్కసారిగా తొక్కిసలాట చోటుచేసుకుంది. ఈఘటనలో దాదాపు 800 మంది చనిపోగా...2 వేల మంది తీవ్రంగా గాయపడ్డారు.

*1994లో నాగ్‌పూర్‌(Nagpur)లో ఆందోళనకారులపై పోలీసులు లాఠీఛార్జి చేయగా తొక్కిసలాట జరిగింది. ఈఘటనలో 114 మంది చనిపోయారు. సుమారు 500 మంది గాయపడ్డారు.

*1999లో కేరళలోని శబరిమల(Sabharimala)లో మకరజ్యోతి దర్శనానికి వెళ్లిన అయ్యప్ప భక్తులు
తోసుకోవడంతో కిందపడిపోయిన భక్తులు ఊపిరిఆడక 53 మంది చనిపోయారు. 2011లోనూ మరోసారి తొక్కిసలాట చోటుచేసుకుని 106 మంది కన్నుమూశారు. మరో వందమంది భక్తులు గాయపడ్డారు.

*2005లో చెన్నై(Chennai)లో వరద భాదితులకు నిత్యవసరాలు పంపిణీ చేస్తుండగా జరిగిన తొక్కిసలాటలో 42 మంది చనిపోయారు.

* మధ్యప్రదేశ్‌(Madya Pradesh)లో రత్నగడ్‌ ఆలయానికి సమీపంలో 2013లో ఓ పాదచారుల వంతెన కూలిపోయి 115 మంది చనిపోగా..మరో 110 మంది గాయపడ్డారు.

* ముంబయి(Mumbai)లోని రైల్వేస్టేషన్ మెట్లమార్గంలో 2017లో జరిగిన తొక్కిసలాటలో 23 మంది చనిపోగా...39 మంది గాయపడ్డారు

* పంజాబ్‌లోని అమృత్‌సర్‌(Amruthsar)లో 2018లో రావణదహనం ఉత్సవం సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో 61 మంది చనిపోయారు.

* 2022లో జమ్మూలోని వైష్ణోదేవి(Vishno Devi) ఆలయంలో జరిగిన తొక్కిసలాటలో 12 మంది ప్రాణాలు విడిచారు.

* ఏపీలోనూ గోదావరి(Godhavari) పుష్కరాల సందర్భంగా 2015లో జరిగిన తొక్కిసలాటలో 27 మంది మృతి చెందారు.

జాగ్రత్త చర్యలేవి
జనం పిచ్చి మూడనమ్మకాలతో  ప్రాణాలమీదకు తెచ్చుకుంటున్నారు. ఒక్కసారిగా వేలాది మంది గుమిగూడితే ప్రమాదం జరుగుతుందని తెలిసినా...కనీస జాగ్రత్తలు తీసుకోవడం లేదు. ముఖ్యంగా ఉత్తరాధిలో దొంగబాబాలు ప్రజలు భక్తి పేరు చెప్పి ఒకరమైన మత్తులోకి దించుతున్నారు. బాబా పాద ధూళి కోసం అమాయక ప్రజలు ప్రాణాలు పొగొట్టుకున్నారు. ఇప్పుడు ఆ బాబా మాత్రం ఆశ్రమం విడిచి పరారయ్యారు. తొక్కిసలాట ఘటనలో ఎక్కువగా మహిళలు, చిన్నారులే ప్రాణాలు కోల్పోతుంటారు. ఒక్కసారిగా జనం మీదపడటంతో తొక్కిసలాట చోటుచేసుకుని ఊపిరి ఆడక ప్రాణలు విడుస్తున్నవారే ఎక్కువ మంది ఉన్నారు.  వేలాది మంది భక్తులు తరలివస్తారన్న సమాచారం ఉన్నప్పుడు  ప్రభుత్వ యంత్రాంగం గానీ, పోలీసులు కానీ కనీస జాగ్రత్తలు తీసుకున్నట్లు లేరు. రద్దీని నియంత్రించే చర్యలు చేపట్టలేదు. అటు ఆశ్రమ నిర్వాహకులు సైతం చేతులెత్తేయడంతోనే ఈ ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. గత అనుభవాలను ఏమాత్రం పట్టించుకోవడం లేదు 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Andhra Politics: విపక్ష పాత్ర కూడా కూటమిదే - పవన్ కల్యాణ్ మాస్టర్ ప్లాన్ - వైసీపీకి అర్థమవుతోందా ?
విపక్ష పాత్ర కూడా కూటమిదే - పవన్ కల్యాణ్ మాస్టర్ ప్లాన్ - వైసీపీకి అర్థమవుతోందా ?
Telangana Politics: కులగణనతో బీసీల్లో చాంపియన్ అయ్యే వ్యూహం - రేవంత్ రెడ్డి ప్లాన్ అదేనా ?
కులగణనతో బీసీల్లో చాంపియన్ అయ్యే వ్యూహం - రేవంత్ రెడ్డి ప్లాన్ అదేనా ?
Vizianagaram MLC: విజయనగరం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానంలో వైసీపీకే పూర్తి మెజార్టీ - టీడీపీ పోటీ చేస్తుందా ?
విజయనగరం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానంలో వైసీపీకే పూర్తి మెజార్టీ - టీడీపీ పోటీ చేస్తుందా ?
Devara OTT Release Date: అఫీషియల్: ఓటీటీలోకి ఈ వారమే దేవర - ఎన్టీఆర్ బ్లాక్‌బస్టర్ ఫిల్మ్ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్
అఫీషియల్: ఓటీటీలోకి ఈ వారమే దేవర - ఎన్టీఆర్ బ్లాక్‌బస్టర్ ఫిల్మ్ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పవన్ కల్యాణ్ కడుపు మంటతో మాట్లాడి ఉంటారు - హోం మంత్రి స్పందనAndhra Pradesh Assembly on Nov 11th | వైసీపీనే వెంటాడుతూనే ఉన్న 11వ నెంబర్ | ABP DesamKasturi Entry Telangana Politics | జనసేనలో చేరుతున్న నటి కస్తూరీ..? | ABP DesamKasturi Insult Telugu People | తెలుగువాళ్లపై నోరు పారేసుకున్న కస్తూరి | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Politics: విపక్ష పాత్ర కూడా కూటమిదే - పవన్ కల్యాణ్ మాస్టర్ ప్లాన్ - వైసీపీకి అర్థమవుతోందా ?
విపక్ష పాత్ర కూడా కూటమిదే - పవన్ కల్యాణ్ మాస్టర్ ప్లాన్ - వైసీపీకి అర్థమవుతోందా ?
Telangana Politics: కులగణనతో బీసీల్లో చాంపియన్ అయ్యే వ్యూహం - రేవంత్ రెడ్డి ప్లాన్ అదేనా ?
కులగణనతో బీసీల్లో చాంపియన్ అయ్యే వ్యూహం - రేవంత్ రెడ్డి ప్లాన్ అదేనా ?
Vizianagaram MLC: విజయనగరం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానంలో వైసీపీకే పూర్తి మెజార్టీ - టీడీపీ పోటీ చేస్తుందా ?
విజయనగరం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానంలో వైసీపీకే పూర్తి మెజార్టీ - టీడీపీ పోటీ చేస్తుందా ?
Devara OTT Release Date: అఫీషియల్: ఓటీటీలోకి ఈ వారమే దేవర - ఎన్టీఆర్ బ్లాక్‌బస్టర్ ఫిల్మ్ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్
అఫీషియల్: ఓటీటీలోకి ఈ వారమే దేవర - ఎన్టీఆర్ బ్లాక్‌బస్టర్ ఫిల్మ్ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్
Game Changer Teaser Release: హైదరాబాద్, చెన్నై, ముంబైలో కాదు... 'గేమ్ చేంజర్' టీజర్ రిలీజ్‌కు రామ్ చరణ్ నయా ప్లాన్!
హైదరాబాద్, చెన్నై, ముంబైలో కాదు... 'గేమ్ చేంజర్' టీజర్ రిలీజ్‌కు రామ్ చరణ్ నయా ప్లాన్!
US Presidential Election 2024: సాయంత్రం 4.30కి యుఎస్ ఎన్నికల ఓటింగ్ ప్రారంభం- సర్వేలు ఏం చెబుతున్నాయి?
సాయంత్రం 4.30కి యుఎస్ ఎన్నికల ఓటింగ్ ప్రారంభం- సర్వేలు ఏం చెబుతున్నాయి?
Thandel: సేఫ్ జోన్‌లో 'తండేల్' నిర్మాతలు - 80 కోట్ల బడ్జెట్ మూవీ వాయిదా పడినా నష్టం లేదా?
సేఫ్ జోన్‌లో 'తండేల్' నిర్మాతలు - 80 కోట్ల బడ్జెట్ మూవీ వాయిదా పడినా నష్టం లేదా?
Telangana: బీసీ రిజర్వేషన్ల కోసం స్పెషల్ కమిషన్ ఏర్పాటు, తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు
బీసీ రిజర్వేషన్ల కోసం స్పెషల్ కమిషన్ ఏర్పాటు, తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు
Embed widget