News
News
X

Horoscope Today 29 August 2022: ఈ రాశులవారు అనవసర చర్చలకు దూరంగా ఉండడం మంచిది, ఆగస్టు 29 రాశిఫలాలు

Horoscope 29th August :ఆయా రాశిలో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. పూర్తి వ్యక్తిగత వివరాల కోసం అనుభవజ్ఞులైన జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు

FOLLOW US: 

Horoscope Today 29th August 2022

మేషం 
ఈ రోజు మీ వ్యాపారంలో మందగమనం కారణంగా కొంత ఆందోళన చెందుతారు. ఆర్థిక పరిస్థితి పర్వాలేదు. ప్రయాణం చేయాలనే ఆలోచనను విరమించుకోవడం మంచిది...ఎందుకంటే మీకు వాహనప్రమాదం సూచనలున్నాయి. విలువైన వస్తువులను జాగ్రత్త చేయండి. 

వృషభం
ఈ రోజు మీ చుట్టూ ఉన్న వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలపై మీకు ఆసక్తి  పెరుగుతుంది. కొత్తగా తలపెట్టిన పనుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి లేదంటే కొన్ని ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు. ఖర్చులు అదుపుచేయాలి.  విదేశాల్లో విద్యను అభ్యసించాలనుకునే విద్యార్థులు ప్రయత్నించేందుకు ఇదే మంచి అవకాశం.

మిథునం
ఈ రోజంతా మీరు చాలా బిజీగా ఉంటారు. వ్యాపారులు కొత్త ప్రణాళికలు వేసుకుంటారు. మీ పనితో పాటూ ఇతరుల పనిపైనా ఎక్కువ శ్రద్ధ పెట్టడం వల్ల కుటుంబానికి సమయం కేటాయించలేరు.  పనికి-కుటుంబ సభ్యులకు మధ్య సమతుల్యత కాపాడుకోండి. మీ రంగంలో వస్తున్న అడ్డంకులను అధిగమించడానికి మీరు సీనియర్ల నుంచి సహాయం పొందవచ్చు. 

కర్కాటకం
ఈ రోజు మీకు ఆందోళనకరమైన రోజు. కార్యాలయంలో మీ ప్రత్యర్థుల గురించి మీరు ఆందోళన చెందుతారు..ఎందుకంటే వారు మీకు కొత్త సమస్యలు సృష్టిస్తారు. మీ తెలివితేటల ద్వారా వాటిని పరిష్కరించుకోగలుగుతారు. ఆర్థిక పరిస్థితి మునుపటి కంటే బలంగా ఉంటుంది. ఎక్కడికైనా వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటే..ఒత్తిడి నుంచి కాస్త ఉపశమనం లభిస్తుంది. సామాజిక కార్యక్రమాలపై ఆసక్తి చూపిస్తారు. ఎవరైనా కార్యాలయంలో మీ ప్రతిష్టను దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తారు.

Also Read: ఇలాంటి వినాయక విగ్రహాన్ని తీసుకొచ్చి పూజిస్తే ఇంట్లో వాస్తుదోషాలుండవ్, అన్నింటా సక్సెస్ అవుతారు!

సింహం
ఈ రోజు మీకు మిశ్రమ ఫలితాలున్నాయి. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. వృత్తిపరమైన కార్యకలాపాల్లో మీ కష్టానికి తగిన ఫలితం పొందుతారు. సోదరులతో ఏదైనా వివాదం ఉంటే దానిని పరిష్కరించుకునేందుకు ప్రయత్నించండి.  పిల్లల చదువుల కోసం ఖర్చు చేస్తారు. ఉద్యోగులు, వ్యాపారులకు మంచి సమయం.

కన్య
కెరీర్లో సెటిలయ్యేందుకు ఎదురు చూస్తున్నవారికి ఇదో సువర్ణావకాశం. మంచి ఉద్యోగం పొందుతారు. కుటుంబ వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. పనిచేసే ప్రదేశంలో కొన్ని సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంది..జాగ్రత్తగా వ్యవహరించండి.  ఆస్తికి సంబంధించిన సమస్య సీనియర్ సభ్యుల సహాయంతో పరిష్కారమవుతుంది. మీరు ఈరోజు మీ జీవిత భాగస్వామికి సమయం కేటాయిస్తారు.

తుల 
ఈ రోజు మీరు ఆదాయ వ్యయాల మధ్య సమతుల్యతను కాపాడుకోండి. పెరిగిన ఖర్చుల కారణంగా మీరు కూడబెట్టిన డబ్బును కూడా ఖర్చు చేస్తారు..ఈ ఖర్చులు నియంత్రించకపోతే ఆర్థిక ఇబ్బందులు తప్పవు. విద్యార్థులకు చదువుకు సంబంధించి కొన్ని సమస్యలు ఎదురుకావచ్చు. భాగస్వామ్య వ్యాపారం చేసే వ్యక్తులు జాగ్రత్తగా వ్యవహరించాలి.

వృశ్చికం
వ్యాపారం చేసే వారికి ఈ రోజు మంచి రోజు అవుతుంది. వ్యాపారానికి సంబంధించిన కొన్ని చిన్న సమస్యలను పరిష్కరించడంలో నిమగ్నమై ఉంటారు. ప్రభుత్వ ఉద్యోగులు చిన్న చిన్న సమస్యలు ఎదుర్కొన్నప్పటికీ...తొందరపాటు నిర్ణయం తీసుకోపోవడమే మంచిది. కుటుంబ సభ్యులతో కలిసి కూర్చుని సమస్యలకు పరిష్కార మార్గాలు ఆలోచించండి.

ధనుస్సు 
ఈ రోజు కొంత గందరగోళంగా ఉంటారు. మీ కుటుంబ సభ్యులు ఒకరితో ఒకరు గొడవ పడితే మధ్యలో మీరు మాట్లాడకుండా ఉండడం మంచిది. పని ఒత్తిడి పెరుగుతుంది. ఆరోగ్యం పట్ల అజాగ్రత్తగా ఉండకండి. 

మకరం
ఈ రోజు మీరు చట్టపరమైన విషయాలపై ఆసక్తి కలిగి ఉండాలి లేదంటే..మీ ప్రత్యర్థులదే పైచేయి అవుతుంది. కుటుంబం, వృత్తి జీవితంలో సామరస్యాన్ని కొనసాగించవలసి ఉంటుంది. చిరు వ్యాపారులు బాగా సక్సెస్ అవుతారు. ప్రభుత్వ ఉద్యోగులు వివాదాలకు దూరంగా ఉండాలి.

Also Read: రంగులుమార్చే వినాయకుడిని దర్శించుకున్నారా! గుప్పెడు బియ్యం - కొబ్బరికాయ ముడుపుకడితే చాలు

కుంభం 
డబ్బుకు సంబంధించిన విషయాలలో ఈరోజు మీకు కొంత ఇబ్బంది కలిగిస్తుంది. మీరు ఎవరికైనా అప్పుగా ఇస్తే, అది తిరిగి వచ్చే అవకాశాలు చాలా తక్కువ. వ్యాపారానికి సంబంధించి ఏదైనా నిర్ణయం తీసుకుంటే ఖచ్చితంగా ఇంట్లోని సీనియర్ సభ్యుల  సలహాలు తీసుకోండి. ఏదైనా ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటున్నట్లయితే మీ కుటుంబ సభ్యుల నుంచి సహాయం పొందవచ్చు. విద్యార్థులు శ్రమకు తగ్గ ఫలితాలు పొందుతారు.

మీనం
ఈ రోజు మీరు అనవసర చర్చలకు దూరంగా ఉండాలి.రాజకీయాల్లో పని చేసే వ్యక్తులు ఈరోజు తప్పుడు ఆరోపణలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఏ వ్యక్తి సూచన మేరకు స్టాక్ మార్కెట్ లేదా మ్యూచువల్ ఫండ్ లో పెట్టుబడులు పెట్టొద్దు. కుటుంబ సమస్యల పట్ల అజాగ్రత్తగా ఉండకండి. 

Published at : 29 Aug 2022 06:17 AM (IST) Tags: astrology in telugu horoscope today Zodiac Signs astrological prediction for 29 August 2022 aaj ka rashifal 29th August 2022 aaj ka rashifal 29August 2022

సంబంధిత కథనాలు

Solar Eclipse and Lunar Eclipse 2022: అక్టోబరు 25న సూర్యగ్రహణం, ఈ రాశుల వారు జాగ్రత్తగా ఉండాలి

Solar Eclipse and Lunar Eclipse 2022: అక్టోబరు 25న సూర్యగ్రహణం, ఈ రాశుల వారు జాగ్రత్తగా ఉండాలి

Horoscope Today 6th October 2022: ఈ రోజు ఈ రాశివారి జీవితంలో ఒక ప్రత్యేక స్నేహితుడు వస్తాడు, అక్టోబరు 6 రాశిఫలాలు

Horoscope Today 6th  October 2022:  ఈ రోజు ఈ రాశివారి జీవితంలో ఒక ప్రత్యేక స్నేహితుడు వస్తాడు, అక్టోబరు 6 రాశిఫలాలు

మ‌తం ఎదైనా పూజ‌లు ఒక్కటే-బెజ‌వాడ‌ గుణ‌ద‌ల చాలా స్పెషల్

మ‌తం ఎదైనా పూజ‌లు ఒక్కటే-బెజ‌వాడ‌ గుణ‌ద‌ల చాలా స్పెషల్

కర్రల సమరం కాదు- కర్రల సంస్కృతి అంటున్న దేవరగట్టు ప్రజలు

కర్రల సమరం కాదు- కర్రల సంస్కృతి అంటున్న దేవరగట్టు ప్రజలు

Dussehra2022: దసరా రోజు జమ్మిచెట్టుని ఎందుకు పూజిస్తారు,పాలపిట్టను ఎందుకు చూడాలంటారు!

Dussehra2022: దసరా రోజు జమ్మిచెట్టుని ఎందుకు పూజిస్తారు,పాలపిట్టను ఎందుకు చూడాలంటారు!

టాప్ స్టోరీస్

ఉన్న ప్రతిపక్షాలకే ఆదరణ లేదు- వచ్చే బీఆర్‌ఎస్‌ ఏం చేస్తుంది: ఏపీ మంత్రులు

ఉన్న ప్రతిపక్షాలకే ఆదరణ లేదు- వచ్చే బీఆర్‌ఎస్‌ ఏం చేస్తుంది: ఏపీ మంత్రులు

RRR For Oscars : ఆస్కార్స్‌కు 'ఆర్ఆర్ఆర్' - తొలి అడుగు పడింది!

RRR For Oscars : ఆస్కార్స్‌కు 'ఆర్ఆర్ఆర్' - తొలి అడుగు పడింది!

Weather Latest Update: నేడు ఈ జిల్లాలకు వర్షం ఎలర్ట్! ఈ రెండ్రోజులు దంచికొట్టనున్న వానలు

Weather Latest Update: నేడు ఈ జిల్లాలకు వర్షం ఎలర్ట్! ఈ రెండ్రోజులు దంచికొట్టనున్న వానలు

Bigg Boss 6 Telugu Episode 32: సూర్య అంటే ఇష్టం, తన క్రష్ అని చెప్పేసిన ఇనయా, మరి సూర్యకు?

Bigg Boss 6 Telugu Episode 32: సూర్య అంటే ఇష్టం, తన క్రష్ అని చెప్పేసిన ఇనయా, మరి సూర్యకు?