భూమి కొనే ముందే అన్ని కోణాల్లో భూమి పరీక్ష చేయించాలి. ఎందుకంటే లూజ్ సాయిల్ అయితే అక్కడ కట్టిన ఇల్లు బలంగా ఉండదు. అలాగే నేల అడుగున దేవాలయాలు, శల్యాలు, దుష్ట శక్తుల ఆవాహన ఉన్న ప్రదేశంలో ఇల్లు కట్టినా ఆ ఇంట్లో మనశ్సాంతి ఉండదు.
యజమాని నామ నక్షత్రాన్ని బట్టి ఇంటికి సింహ ద్వారాలు ఎక్కడ వుండాలి, ఎన్ని గుమ్మాలు వుండాలి, ఎక్కడెక్కడ వుండాలి, కిటికీలు ఎక్కడ వుండాలో ముందే నిర్ణయించుకోవాలి.
అన్నీ చూసుకుని ఇల్లుకట్టుకున్న తర్వాత కూడా ఏదో తేడాఉంది అనిపిస్తే.. ఆ ఇంట్లో ఉన్నవారు పాటించే పద్ధతులు, ప్రవర్తన విధానంలో ఏదో తేడా ఉందని అర్థంచేసుకోవాలి.
కొన్ని ఇల్లు చూస్తే వాస్తుశాస్త్రం ప్రకారం ఏ దోషం కనబడదు. కానీ ఆ ఇంట్లో నివాసం ఉన్నప్పటి నుంచీ అకారణంగా వివాదాలు, చికాకులు, ఆనారోగ్యం, రోడ్డు ప్రమాదాలు జరుగుతుంటాయి.
కొన్నిసార్లు ఆ వ్యక్తి జాతకంలో దోషాల వల్ల కూడా జరిగి ఉండొచ్చు. కానీ జాతకంలో ఎలాంటి దోషం లేకపోయినా ఇలా జరుగుతోందంటే ఈ ఇంట్లో వాస్తుదోషం ఉన్నట్టే.
మన శరీరంలో అయస్కాంత శక్తి వుంటుంది. కొన్ని కొత్త ప్రదేశాలకు వెళ్లినప్పుడు ఆ ప్రభావం మన శరీరం మీద పడి తల తిరగటం, తలనొప్పి, చికాకుగా అనిపిస్తుంది.
పెంపుడు కుక్క పదే పదే ఒకే దిశకి తిరిగి అరవటం కూడా ఒక సూచనే. ఇంట్లోకి పాములు, గబ్బిలాలు రావటం, కాకులు ఎక్కువగా వాలటం, ఆ ఇంటి చట్టూ మాత్రమే కాకులు ప్రదక్షిణ చేయటం వల్ల కూడా కనపడిని వాస్తు లోపాలున్నాయని సూచనలు.
కొన్నిచోట్లకి వెళ్ళగానే అకారణంగా భయం వేస్తుంది. అంటే ఆ ఇళ్లలో గతంలో ఆత్మహత్యలో, హత్యలో జరిగి వుండొచ్చు. అంటే పిశాచాలు అక్కడే తిరుగుతున్నాయని కాదు కానీ కొన్ని చికాకులు మాత్రం ఉండిపోతాయి.
వంశపారంపర్యంగా వచ్చిన ఇళ్లని కొన్ని చికాకుల కారణంగా వదిలివెళ్లలేం. అలాంటప్పుడు దోషం ఏంటో తెలుసుకుని తగిన పరిష్కారం చేయిస్తే సరిపోతుంది.
మన దశ బాగా లేనప్పుడు ఎంత మంచి ఇంట్లోవున్నా మన జాతక దోషాలవల్ల వచ్చే చికాకుల నుంచి తప్పించుకోలేం.
కొన్నిసార్లు ఎన్ని చికాకులున్నా మీరు స్ట్రాంగ్ గా ఉంటే ఏ దోషమూ మిమ్మల్ని ఏం చేయలేదు.