దివంగత సంగీత దర్శకుడు బప్పీ లహరి జీవితం తెరచిన పుస్తకమే. అందులోని కొన్ని ముఖ్యమైన సంగతులు, వివాదాలు...

'కలియోన్ కి చమన్' సాంగ్ కాపీ చేసినందుకు అమెరికన్ ర్యాపర్ డా. డ్రే మీద బప్పీ లహరి కేసు వేశారు. తర్వాత బప్పీకి ఆయన క్రెడిట్ ఇచ్చారు. 

బప్పీ లహరి దగ్గర 754 గ్రాముల బంగారం, 4.6 కేజీల వెండి ఉంది.

ఒక్క ఏడాది (1986)లో 33 సినిమాల్లో 180 పాటలు రికార్డు చేసి గిన్నిస్ బుక్ రికార్డుల్లో చోటు దక్కించుకున్నారు.

ముంబైలో 1996లో జరిగిన తన లైవ్ షోకు బప్పీ లహరిని మైఖేల్ జాన్సన్ ఇన్వైట్ చేశారు. 

బప్పీ లహరికి బంగారం అంటే ఎంత ఇష్టమో తెలిసిందే. ఆయన 8,9 బంగారు గొలుసులు వేసుకుంటారు. 

బీబీసీలో లైవ్ షో చేయమని ఆహ్వానం అందుకున్న ఏకైన సంగీత దర్శకుడు బప్పీ లహరి మాత్రమే (1989లో)

మూడేళ్ళ వయసు నుంచి బప్పీ లహరి సంగీత వాయిద్యాలను ప్లే చేయడం స్టార్ట్ చేశారు. 

బప్పీ లాహిరికి నటుడు, గాయకుడు కిషోర్ కుమార్ మేనమామ. బప్పీని ఇండస్ట్రీకి తీసుకొచ్చింది ఆయనే. 

మేనమామ కిషోర్ కుమార్ దర్శకత్వం వహించిన 'బన్ధతి కా నామ్ దాహి'తో బప్పీ లహరి నటుడిగా పరిచయం అయ్యారు.