చుట్టూ ఎవరూ లేరు, నన్ను ఎవ్వరూ చూడడం లేదు నేను ఏమైనా చేయొచ్చనుకుంటే పొరపాటే. మనిషి ఏ పని చేస్తున్నా నిశితంగా గమనించేవి మూగసాక్షులు పద్దెనిమిది ఉన్నాయి .
నాలుగు వేదాలు ( సామవేదం, ఋగ్వేదం , అథర్వణ వేదం, యజుర్వేదం)
పంచభూతాలు ( భూమి, గాలి, నీరు, అగ్ని, ఆకాశం)
అంతరాత్మ
ధర్మం
యముడు
యముడు ఉభయ సంధ్యలు ( సూర్యోదయం, సూర్యాస్తమయం)
సూర్య చంద్రులు
పగలు, రాత్రి
వీటిని అష్టాదశ మహా పదార్థాలు అంటారు. ఈ మూగసాక్షులు అనుక్షణం నీడలా పర్యవేక్షిస్తుంటాయి. ఏ న్యాయస్థానంలోనూ సాక్ష్యం చెప్పకపోవచ్చు కానీ వీటినుంచి తప్పించుకోవడం ఎవ్వరికీ సాధ్యం కాదు.
ఇవన్నీ జడపదార్థాలే కదా అనే భ్రమలో ఉంటున్నారు. కానీ మన ప్రతి చర్యని అవి నమోదు చేస్తుంటాయని, నిత్యం మన నివేదికల్ని విధికి చేరుస్తాయి..అవే కర్మలుగా మారతాయని మీకు తెలుసా..
మనిషి చేసే పనులు మంచి అయితే సత్కర్మలుగా, చెడ్డవి అయితే దుష్కర్మలుగా విధి నిర్ణయిస్తుంది. వాటికి తగ్గట్టే కర్మ ఫలం ఉంటుంది.
గత జన్మలో పాప పుణ్యాలు ఈ జన్మలో, ఈ జన్మలో చేసే పాప పుణ్యాలు వచ్చే జన్మలో అమలవుతాయనే భ్రమలో ఉండాల్సిన అవసరం లేదు..కలియుగంలో ఈ జన్మలో చేసే పాప పుణ్యాలు వెంటనే ఫలితం చూపించేస్తున్నాయ్. జరిమానాలు అమలైపోతున్నాయ్.
అంతరాత్మ మనం చేసే పని మంచిదా ? చెడ్డదా ? అనే విషయాన్ని ఎప్పటికప్పుడే చెప్పేస్తుంది. కానీ ఆవేశం, కోపంతో విచక్షణ కోల్పోయిన వ్యక్తి అంతరాత్మ సలహాను పక్కన పెట్టడమే ఎన్నో అనర్థాలకు కారణం అవుతోంది.
నలుగురికీ తెలిసేలా దానధర్మాలు, క్రతువులు, పూజలు నిర్వహించాలన్న కుతూహలం అవివేకం .
అష్టాదశ సాక్షులు ఎల్లవేళలా గమనిస్తున్నాయంటే, ఎవరు చూడాలో వాళ్ళు చూస్తున్నట్లేగా అర్థం .ఈ స్పృహ మీలో ఉన్నప్పుడు తప్పొప్పులు ఏం చేసినా అందుకు తగిన ఫలితం పొందేందుకు సిద్ధంగా ఉండండి.
కోరి కొని తెచ్చుకోమాకు కర్మ దాన్ని విడిపించుకోలేదు జన్మ