జూలై 2 రాశిఫలాలు: ఈ రాశులవారు ఇతరుల గురించి ఎక్కువ ఆలోచించి టైమ్ వేస్ట్ చేసుకుంటారు!
Horoscope Prediction 2 july 2024: గ్రహాల కదలిక, నక్షత్రాల ఆధారంగా జ్యోతిష్యులు రాశి ఫలితాలను అంచనా వేస్తారు. ఈ రోజు రాశి ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.
Daily Horoscope Predictions in Telugu
మేష రాశి
ఈ రోజు మీకు పదోన్నతి లభించవచ్చు. మీ ఆలోచనలకు మీ సన్నిహితులు త్వరగా ప్రభావితం అవుతారు. ప్రభుత్వానికి సంబంధించిన వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. వివాహానికి వచ్చే అడ్డంకులు తొలగిపోతాయి. మీరు సహోద్యోగుల నుంచి గౌరవం పొందుతారు
వృషభ రాశి
ఈ రోజు మీ ఆరోగ్యం బలహీనంగా ఉంటుంది. ఉద్యోగులు తమ లక్ష్యాన్ని సాధించాలనే పట్టుదలతో ఉంటారు. మీ పనితీరులో ఉన్నతాధికారుల మెప్పు పొందుతారు. వ్యాపారంలో లాభాలొస్తాయి. విద్యార్థులు పోటీ పరీక్షలలో మంచి ఫలితాలు సాధిస్తారు.
మిథున రాశి
ఈ రోజు మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. వ్యక్తిగత సమస్యలు పరిష్కారమవుతాయి. కొన్ని కష్టమైన పనిని పూర్తి చేసిన తర్వాత మనస్సు సంతోషంగా ఉంటుంది. మీ తీరుతో ప్రశంసలు అందుకుంటారు. వ్యాపారులు, విద్యార్థులకు శుభసమయం.
కర్కాట రాశి
ఈ రోజు మీ మనోబలం పెరుగుతుంది. వ్యాపారంలో పరిస్థితులు మీకు అనుకూలంగా ఉంటాయి. మీ కోరికలు నెరవేరుతాయి. ఏదైనా పెద్ద పనిని ప్రారంభించే ముందు పెద్దల సలహా తీసుకోండి.
సింహ రాశి
ఈ రోజు కుటుంబ కార్యక్రమాలు వాయిదా వేయాల్సి వస్తుంది. జీవిత భాగస్వామి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. ఎవరినీ రెచ్చగొట్టేలా ప్రవర్తించవద్దు. ఈ రోజు మీకు గ్రహాల అనుగ్రహం లేదు. వివాదాలకు దూరంగా ఉండండి.
కన్యా రాశి
తొందరగా కోపం తెచ్చుకుంటారు..గాసిప్ లకు బాధితులవుతారు. మీ వ్యక్తిత్వంలో ఉండే ఆకర్షణ మిమ్మల్ని ప్రత్యేకంగా నిలబెడుతుంది. ప్రజాదరణ పొందుతారు. ఖర్చులు చేయడానికి ముందు ఆదాయాన్ని పరిగణలోకి తీసుకోవాలి. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు.
Also Read: మహాభారత యుద్ధం జరిగిన కురుక్షేత్ర ఎక్కడుంది..ఎలా వెళ్లాలి..అక్కడ చూసేందుకు ఏమున్నాయ్?
తులా రాశి
ఈ రోజు మీరు కొత్త పనులపై ఆసక్తి చూపుతారు, లక్ష్యసాధనలో భాగంగా నూతన ప్రణాళికలు అమలుచేస్తారు. సహోద్యోగులతో సత్సంబంధాలుంటాయి. మీ సలహాలు,సూచనలు మీ సన్నిహితులకు ఉపయోగపడతాయి. తెలివైన వ్యక్తులను కలుస్తారు. ఉద్యోగులు, వ్యాపారులకు సమయం అనుకూలం.
వృశ్చిక రాశి
ఈ రాశివారు వ్యాపార పర్యటనల నుంచి లాభపడతారు. ఇతర గురించి ఎక్కువ ఆలోచిస్తూ టైమ్ వేస్ట్ చేసుకోవద్దు. సృజనాత్మక కార్యకలాపాలలో మీకు ఆహ్లాదకరమైన సమయం ఉంటుంది. దాంపత్య జీవితంలో మాధుర్యం ఉంటుంది. కుటుంబంలో మీ ఆధిపత్యం పెరుగుతుంది.
ధనుస్సు రాశి
ఈ రోజు మీ మానసిక స్థితి ప్రతికూలంగా ఉంటుంది. మీ శ్రేయోభిలాషులను అనవసరంగా అనుమానించకండి. అధిక ఒత్తిడి తీసుకోవద్దు. ఆర్థిక సంబంధిత విషయాల్లో సమస్యలు తలెత్తవచ్చు. సోమరితనం పెరుగుతుంది. ఉద్యోగంలో ఉన్నతి మీరు ఆశించిన స్థాయిలో ఉండకపోవడంతో బాధపడతారు.
Also Read: మహాభారత విషాద వీరుడు సూర్య పుత్ర కర్ణుడిని ముంచేసిన మూడు శాపాలు ఇవే!
మకర రాశి
మీ ప్రవర్తన ఆకర్షణీయంగా ఉంటుంది. నిరుద్యోగులు మంచి ఉద్యోగంలో స్థిరపడతారు. వ్యాపారులు నూతన పెట్టుబడులు పెట్టేందుకు మంచి సమయం. ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దు. బంధువులను కలుస్తారు. నూతన పరిచయాలు ప్రయోజనకరంగా ఉంటాయి.
కుంభ రాశి
ఈ రోజు మీరు వేడుకలలో పాల్గొంటారు. వ్యాపారంలో పెట్టుబడులు పెట్టేందుకు ఇదే మంచి సమయం. ఆగిపోయిన పనులు మళ్లీ ప్రారంభమవుతాయి. విద్యార్థులు చదువులో రాణిస్తారు. నూతన ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నవారి నిరీక్షణ ఫలిస్తుంది.
మీన రాశి
ఈ రోజు మీరు ఓర్పు , సంయమనంతో పనిచేయాల్సి ఉంటుంది. ఇతరుల సలహాలను ఎక్కువగా పరిగణలోకి తీసుకోవద్దు. రోజంతా బిజీగా ఉంటారు కానీ ఒత్తిడికి లోనవరు. ఆరోగ్యం బావుంటుంది..ఆర్థిక లాభం ఉంది. వ్యాపారులు లాభపడతారు..అనుకోని ప్రయాణం చేయాల్సి రావొచ్చు..
ALSO READ: ఈ రాశులవారు ఒంటరితనాన్ని సౌకర్యవంతంగా ఫీలవుతారు..ఇందులో మీరున్నారా!
Note: ఓక రాశిలోని ఫలితాలు మొత్తం ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు..మీ జాతకంలో గ్రహస్థితి ఆధారంగా కూడా ఫలితాల్లో మార్పులుంటాయి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం.