Kalki 2898 AD Karna: మహాభారత విషాద వీరుడు సూర్య పుత్ర కర్ణుడిని ముంచేసిన మూడు శాపాలు ఇవే!
The Story Of Karna: వరప్రభావంతో జన్మించిన కర్ణుడి జీవితం మొత్తం శాపాలమయమేనా? ఈ శాపాలే మరణానికి దారితీశాయా? ఇంతకీ కర్ణుడి ఏ ఏ సందర్భాల్లో ఎలాంటి శాపాలకుగురయ్యాడు?
The Curse of Karna: మహాభారతంలో ప్రతి పాత్రా తెలుసుకోదగినదే. అయితే ఎన్నిసార్లు చదివినా, విన్నా ఆసక్తికరం అనిపించే క్యారెక్టర్...అయ్యో అనిపించే క్యారెక్టర్ ఏదైనా ఉందంటే అది కర్ణుడనే చెప్పుకోవాలి. అసలు కర్ణుడి పుట్టుక నుంచి మరణం వరకూ అడుగడుగూ పరీక్షా సమయమే..వీటికి తోడు అధర్మపరులు, దుర్మార్గులతో స్నేహం ఆ శాపాల ప్రభావాన్ని మరింత పెంచింది. ఇంతకీ కర్ణుడి ముంచేసిన ఆ మూడు శాపాలేంటి? ఆ సందర్భాలేంటి?
Also Read: కర్ణుడు - అర్జునుడు ఇద్దరిలో ఎవరు బలవంతులు? కల్కి 2898 AD సినిమాలో ఏం చూపించారు - పురాణాల్లో ఏముంది?
శాపగ్రస్త జీవితం
భూమ్మీద పడగానే శాపగ్రస్తుడయ్యాడు కర్ణుడు. దూర్వాసుడు తనకిచ్చిన వరాన్ని పరీక్షించాలి అనుకుంది కుంతీదేవి. నదీ తీరంలో కనిపిస్తున్న సూర్యుడిని చూసి...మహర్షి తనకు ఉపదేశించిన మంత్రాన్ని పఠించింది. వెంటనే ప్రత్యక్షమైన సూర్యుడు కర్ణుడిని ప్రసాదించాడు. కవచకుండలాలతో, సూర్య తేజస్సుతో వెలిగిపోతున్న బాలుడిని చూసి కంగారుపడింది. అప్పటికి ఇంకా కుంతీదేవికి వివాహం కాలేదు. అందుకే ఆ బాలుడిని ఓ పెట్టెలో పెట్టి నదిలో వదిలేసింది. అలా రథం నడుపుకునేవాని ఇంటికి చేరాడు కర్ణుడు. అందుకే సూతపుత్రుడు అని పిలుస్తారు. పాండవుల్లో అగ్రజుడైన కర్ణుడు..రాజ్యంలో భోగభాగ్యాల మధ్య పెరగాల్సినప్పటికీ రథం నడుపుకునేవానిఇంట పెరగాల్సి వచ్చింది...
Also Read: శంబల నగరం ఎక్కడుంది , ఇప్పటివరకూ ఎవరెవరు వెళ్లొచ్చారు - శంబల గురించి ఆశ్చర్యపోయే విషయాలివే!
మొదటి శాపం
పాండవులు, కౌరవులకు విద్య నేర్పిస్తున్న ద్రోణాచార్యుడి వద్ద తానుకూడా విద్యను అభ్యసించాలి అనుకున్నాడు కర్ణుడు. కానీ అక్కడ అవమానాలు ఎదురవడంతో పరశురామునిడి ఆశ్రయించాడు. అయితే పరశురాముడికి క్షత్రియులంటే వైరం. క్షత్రియవంశ నిర్మూలనే ధ్యేయంగా పరశురాముడు మాహిష్మతి రాజ్యం మొదలు ఎందరో రాజులపై దండయాత్ర చేశాడు. అందుకే బ్రాహ్మణ పుత్రులకు తప్ప..క్షత్రియులకు విద్య నేర్పించడు పరశురాముడు. అయితే విద్య నేర్చుకోవాలన్న ఆలోచనతో తాను బ్రాహ్మణుడినే అని అబద్ధం చెబుతాడు కర్ణుడు. సకల విద్యలు నేర్పించి జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు పరశురాముడు. అయితే ఓ సందర్భంలో అలసిపోయిన పరశురాముడు..కర్ణుడి తొడపై తలపెట్టి నిద్రపోతాడు. ఆ సమయంలో ఓ తేనెటీగ కర్ణుడిని కుట్టేస్తుంది. రక్తం కారుతున్నప్పటికీ గురువుకి నిద్రాభంగం కలగకూడదని భరిస్తాడు కర్ణుడు. నిద్రలేచి జరిగిన సంఘటన చూసి కర్ణుడు బ్రాహ్మణుడు కాదు ఇంత బాధని భరించగలిగాడంటే క్షత్రియపుత్రుడని గ్రహిస్తాడు. అబద్ధం, మోసాన్ని సహించలేకపోయిన పరశురాముడు నువ్వు సంపాదించిన జ్ఞానం, నేర్చుకున్న విద్య..అత్యవసర సమయంలో మర్చిపోతావనే శాపం ఇచ్చాడు..
Also Read: కలి మళ్లీ ఎప్పుడొస్తాడు.. కలియుగం అంతమయ్యాక సత్యయుగ పాలన అయోధ్య కేంద్రగా ఉండబోతోందా!
రెండో శాపం
విద్యను అభ్యసించి ఇంటికి చేరుకున్న కర్ణుడు ఓసారి..తన విలువిద్యా నైపుణ్యాన్ని పరీక్షించుకుంటుండగా ఆ బాణం ఆవుకి తగిలింది. అప్పుడే అక్కడకు వచ్చిన ఆవు యజమాని అయిన బ్రాహ్మణుడు.. ఇందుకు ఫలితంగా తీవ్రంగా యుద్ధం జరుగుతున్న సమయంలో నీ రథచక్రం భూమిలో కుంగిపోతుందని శపించాడు
మూడో శాపం
కర్ణుడిని అంగరాజ్యానికి రాజుని చేసి ప్రాణస్నేహితుడిగా పట్టం కట్టాడు దుర్యోధనుడు. ఓసారి తన రాజ్యంలో తిరుగుతుండగా..ఓ చిన్నారి ఏడుస్తుండడం చూసి..అక్కడకు వెళ్లి కారణం అడిగి తెలుసుకున్నాడు. తన తల్లి తనకు మట్టి కుండలో ఇచ్చిన నెయ్యి కిందపడింది..ఆమె కోప్పడుతుందని ఏడుపు మొదలెట్టింది. అదే నెయ్యి కావాలని పట్టుబడ్డడంతో..ఆ మట్టి నుంచి నెయ్యిని పిండి ఇచ్చి చిన్నారిని సంతోషపెట్టాడు. కానీ అదేక్షణం భూదేవి శాపానికి గురయ్యాడు. నీ పిడికిలి కారణంగా గాయపడ్డానని..అత్యంత ముఖ్యమైన యుద్ధ సమయంలో నీ రథాన్ని అంతే గట్టిగా పట్టుకుంటానని శపించింది భూమాత.
Also Read: అశ్వత్థామ మంచివాడా - చెడ్డవాడా..అత్యంత శక్తిమంతుడైన బ్రాహ్మణ పుత్రుడికి ఎందుకీ శాపం!
అలా పుట్టుకతో మొదలైన శాపగ్రస్త జీవితానికి ఈ మూడు శాపాలు తోడవడం, అధర్మపరులైన కౌరవుల పక్షాన నిలవడం...ఫలితంగా కురుక్షేత్ర సంగ్రామంలో నేలకూలాడు కర్ణుడు.