The End of the Kali Yuga : కలి మళ్లీ ఎప్పుడొస్తాడు.. కలియుగం అంతమయ్యాక సత్యయుగ పాలన అయోధ్య కేంద్రగా ఉండబోతోందా!
Kalki Avatar Real Story: భూమ్మీద ఉన్న అధర్మపరులను ఊచకోత కోసుకుంటూ వెళుతున్న కల్కికి అశ్వత్థాముడు ఏ విధంగా సహాయం చేశాడు? గాడిద వాహనం ఎక్కి పారిపోయిన కలి మళ్లీ వస్తాడా? కల్కి అవతార పరిసమాప్తి ఎప్పుడు?

Kalki Real Story: కీటకపురాన్ని పాలించే జిహుడితో భీకరమైన యుద్ధం జరిగింది..జిహుడి సంహారం తర్వాత సోదరుడు శుద్దోధనుడు కూడా యుద్ధంలో మరణించాడు. అప్పుడు శుద్ధోధనుడి భార్య, సైనికుల భార్యలంతా ఆయుధాలు చేతపట్టి యుద్ధ రంగంలో దిగాడు. స్త్రీలతో యుద్ధం చేయనని చెప్పి కల్కి ఆయుధాలన్నీ పక్కన పెట్టేసి నిల్చున్నారు. ఆ స్త్రీలంతా వేసిన బాణాలు, అస్త్రాలు అన్నీ కల్కిలో కలసిపోయాయి. ఆతర్వాత ఆ స్త్రీలకు మోక్షాన్ని ప్రసాదించి ముందుకు కదిలాడు కల్కి. ఆ సమయంలో కలిశాడు అశ్వత్థాముడు. కల్కిని కలిసిన అశ్వత్థాముడు.. మూడువేల సంవత్సరాలు ఒళ్లంతా పుళ్లుతో నిండిఉన్న నేను శాపవిమోచనం పొందాను.. నీకోసమే ఇంకా ఈ భూమ్మీద ఉన్నానని చెప్పాడు. అలా కల్కి సైన్యానికి అశ్వత్థాముడు యుద్ధ విద్యలు నేర్పించి..ధర్మసంస్థాపనలో భాగం అయ్యాడు.
Also Read: రామాయణ, మహాభారత యుద్ధాలకు ఓ కారణం ఉంది..మరి కల్కిని ధర్మసంస్థాపన దిశగా నడిపించిన సందర్భం ఏంటి!
ఆ తర్వాత కల్కిని కలిసిన మహర్షులు... కుంభ కర్ణుడి తనయుడు నికుంభుడి కుమార్తె అయిన కుథోధరి హిమాలయ ప్రాంతంలో ఉన్న మహర్షులను పీడిస్తోంది..ఆమెను సంహరించాలని కోరారు. మహర్షులకు అభయం ఇచ్చిన స్వామివారు వెంటనే హిమాలయా ప్రాంతానికి బయలుదేరి వెళ్లి గుహలా ఉన్న ఆమెను చంపడంతో...కుథోధరి కుమారుడు యుద్ధరంగంలో అడుగుపెట్టాడు. అప్పుడు బ్రహ్మాస్తం ప్రయోగించాడు కల్కి...
జిహుడిని నిర్మూలించాడు
ఘోరంగా హింస చేస్తున్నవారిని సంహరించాడు
అప్పటికీ మిగిలి ఉన్న రాక్షసులను అంతమొందించాడు
ఆ తర్వాత హరిద్వార్ లో అడుగుపెట్టిన కల్కిని దర్శించుకునేందుకు సప్తమహర్షులు, సప్త చిరంజీవులు రావడంతో వారిని పూజించి ఆశీర్వచనం పొందారు స్వామివారు. అదే సమయంలో కల్కిని దర్శించుకున్న మరువు - దేవాపి అనే ఇద్దరు వచ్చి మోక్షం కావాలని వేడుకున్నారు. మీరిద్దరూ సూర్య, చంద్ర, ఇంద్ర,యమ, కుబేర అంశలకు చెందినవారు..మీరు మోక్షంకోసం పుట్టినవారు కాదు.. ధర్మ సంస్థాపన తర్వాత మీరిద్దరూ పాలన చేయాలని చెప్పాడు
మరువు - అయోధ్య
దేవాపి - హస్తినాపురం
రాజధానిగా చేసుకుని పాలించనున్నారు. అయితే ఈ లోగా ధర్మ సంస్థాపనకు తనతో పాటూ కలసి రావాలని కోరాడు కల్కి. అప్పటి నుంచి కలి ప్రభావం ఉన్న ప్రదేశాలను ఒక్కొక్కటిగా తుడిచిపెట్టుకుంటూ , దుర్మార్గులైన రాజులను సంహరిస్తూ.. అధర్మపరులను ఊచకోత కోస్తూ ముందుకు వెళ్లాడు..
Also Read: శంబలలో కల్కి .. శ్రీలంకలో పద్మావతి..కథను మలుపుతిప్పిన చిలుక..పురాణాల్లో ఉన్న కల్కి అసలు స్టోరీ ఇదే!
'కల్కి'కి భయపడి గాడిదపై పారిపోయిన 'కలి'
మరువు, దేవాపి..కలి సైన్యంపై దండయాత్ర చేశారు..ఆ తర్వాత కలిని తరిమికొట్టారు కల్కి. గాడిద వాహనంపై పారిపోయాడు. కలికి మరణం ఉండదు కానీ కలిని దూరం చేసుకుంటే కొన్ని యుగాలు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు. అలా ధర్మసంస్థాపన చేశాడు కల్కి...
రమాదేవిగా జన్మించిన భూదేవి
కలిని తరిమికొట్టిన తర్వాత విష్ణుభక్తుడైన రాజు పాలించే భల్లాటపురం వెళ్లారు. కల్కితో యుద్ధం చేసిన ఆ రాజు..భగవంతుడిని ఎత్తుకుని తీసుకెళ్లి రాజమందిరంలో సింహాసనంపై కూర్చోబెట్టాడు. అప్పుడే పూజ అనంతరం బయటకు వచ్చిన ఆ మహారాజు భార్య..సాక్షాత్తూ భగవంతుడే వచ్చాడంటూ సకల ఉపచారాలు చేసింది. తన భర్తను క్షమించమని కోరింది..అప్పుడు స్వామివారు తానిక్కడు రావడం వెనుక కారణం ఉందని.. వారి పుత్రిక రమాదేవి కోసం వచ్చానని చెప్పాడు. భూదేవి రమాదేవిగా భల్లాటపురంలో జన్మించింది.
నాగలోకానికి కల్కి
భూలోకంలో ధర్మసంస్థాపన సాధ్యం అయిన తర్వాత సర్పలోకానికి వెళ్లారు కల్కి. అక్కడ ఉండే సులోచన అనే నాగకన్య చూపు పడితే ఎవ్వరైనా మాడి మసైపోతారు..కానీ కల్కికి ఏమీ కాలేదు. అప్పటికి ఆమెకు అర్థమైంది..తాను ఓ గంధర్వుడి భార్యను..శాపం కారణంగా ఇలా నాగలోకంలో విషకన్యగా ఉండిపోయానని ...మీ దర్శనంతో శాపవిమోచనం అయిందని చెప్పి వెళ్లిపోయింది...
సత్యయుగం ఆరంభం - కల్కి అవతార పరిసమాప్తి
భార్యలు పద్మావతి - రమాదేవిని తీసుకుని శంబల చేరుకున్నారు స్వామివారు. పైనుంచి దిగివచ్చిన దేవతలంతా మీరొచ్చిన కార్యం పూర్తైంది..తిరిగి వైకుంఠానికి రావాలని కోరారు. అప్పుడు సత్యయుగం పాలనను... మరువు - దేవాపికి అప్పగించి భార్యలతో కలసి వైకుంఠానికి వెళ్లిపోయాడు శ్రీ మహావిష్ణువు... సత్యయుగంలో మళ్లీ ధర్మం నాలుగుపాదాలపై నడుస్తూ పాలన సాగింది...
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

