అన్వేషించండి

Kalki Real Story: శంబలలో కల్కి .. శ్రీలంకలో పద్మావతి..కథను మలుపుతిప్పిన చిలుక..పురాణాల్లో ఉన్న కల్కి అసలు స్టోరీ ఇదే!

kalki 2898 AD: కలి ప్రభావం పెరిగి భూమిపై అధర్మం మాత్రమే రాజ్యమేలుతున్నప్పుడు కల్కి ధర్మ సంస్థాపన చేస్తాడని పురాణాల్లో ఉంది. కల్కి పుట్టుక నుంచి అవతార పరిసమాప్తి వరకూ ఏం జరిగిందంటే...

Kalki Real Story: శ్రీ మహావిష్ణువు దశావతారమే కల్కి. కలిపురుషుడి ప్రభావంతో భూమిపై ధర్మం అనే మాట పూర్తిగా మాయమైందంటూ దేవతలంతా శ్రీ మహావిష్ణువు దగ్గర మొరపెట్టుకున్నారు. స్వామీ  ధర్మసంస్థాపన దిశగా మీరు భూమిపై అడుగుపెట్టాల్సిన సమయం ఆసన్నమైందని కోరారు. సరే అన్న శ్రీమహావిష్ణువు కల్కి అవతారంలో శంబలలో విష్ణుయశుడు-సుమతి దంపతులకు జన్మిస్తానని చెప్పారు. ఇక వైకుంఠం నుంచి కిందకు బయలుదేరుతుండగా... లక్ష్మీదేవి, భూదేవి, గరుత్మంతుడు వీళ్లంతా ఎవరి సందేహాలు వారు వ్యక్తం చేశారు.

లక్ష్మీదేవి: స్వామీ మీరు శంబలలో కల్కిగా జన్మిస్తారు..మరి నేను మిమ్మల్ని ఎలా చేరుకోగలను...
విష్ణువు:  సింహళ దేశంలో ఓ రాజుకి పద్మావతిగా జన్మిస్తావు
లక్ష్మీదేవి : త్రేతాయుగంలో రుక్మిణీదేవిలా జన్మించి మిమ్మల్ని చేరుకునేందుకు చాలా అగచాట్లు పడ్డాను.. శిశుపాలుడితో పెళ్లి జరిగే సమయంలో  సందేశం పంపించిన తర్వాత వచ్చి తీసుకెళ్లారు..ఈ జన్మలో కూడా అన్ని బాధలు అనుభవించలేను..మిమ్మల్ని చేరుకునే మార్గంకూడా చెప్పండి 
విష్ణువు: నీకు పరమేశ్వరుడి నుంచి ఓవరం లభిస్తుంది..ఆ వరమే శాపం అవుతుంది..ఆ శాపమే మళ్లీ వరంగా మారి నన్ను చేరుకునేలా చేస్తుంది..

Also Read: కలి ఎవరు? కల్కి ఎవరు? ధర్మ సంస్థాపన ఏంటి? యుగాంతం ముందు కనిపించే సంకేతాలేంటో తెలుసా!

వైశాఖ శుద్ధ ద్వాదశి కల్కి జననం

ఆ తర్వాత భూదేవి, గరుడుడి సందేహాలను నివృతి చేసి శ్రీ మహావిష్ణువు వైకుంఠం నుంచి ధర్మసంస్థాపనార్థం భూమ్మీదకు బయలుదేరాడు. వైశాఖ శుద్ధ ద్వాదశి రోజు శంబలలో విష్ణువు ఇంట జన్మించాడు. (కల్కి ఇంకా రాబోతున్నాడు కదా మరి ఇవన్నీ ఎలా చెబుతున్నారు అనే సందేహం రావొచ్చు..అయితే పురాణాల్లో కల్కి పుట్టుక గురించి భాగవత పురాణం, బ్రహ్మ వైవర్త పురాణంలో ప్రస్తావించి ఉంది). వైకుంఠం నుంచి వచ్చి విష్ణుయశుడి ఇంట జన్మించిన స్వామిని చూసేందుకు దేవతలంతా తరలివచ్చారు...సకల ఉపచారాలు చేశారు.  సప్త చిరంజీవులంతా దర్శనం చేసుకోవాలని వచ్చారు. కృపాచార్యులు, అశ్వత్థాముడు, పరశురాముడు, వేద వ్యాసుడు సహా సప్త చిరంజీవులంతా భిక్షకుల రూపంలో వచ్చి ఆశీర్వదించి..కల్కి అనే పేరు పెట్టారు.  చేసి కల్కి అనే పేరు పెట్టారు. కల్కము అంటే పాపం అని అర్థం...పాపాన్ని పోగెట్టేవాడే కల్కి...

Also Read: అశ్వత్థామ ఇప్పుడు ఎక్కడున్నాడు? ‘కల్కి 2898 ఏడీ’ లో అమితాబ్ నుదుట కనిపించిన అద్భుతమైన మణి గురించి తెలుసా!
 
పరశురాముడే కల్కి గురువు

వయసు పెరిగిన తర్వాత ఉపనయనం చేసి విద్యాభ్యాసం కోసం పంపించారు. తానే శ్రీ మహావిష్ణువు అనే స్పృహ లేదు..గురుకులం వెతుక్కుంటూ బయలుదేరాడు కల్కి. మార్గమధ్యలో మహేంద్ర పర్వతం దగ్గర పరశురాముడు ఆ బాలుడిని కలసి తీసుకెళ్లి సకల విద్యలు నేర్పించాడు. గురుదక్షిణగా ఏం కావాలని కల్కి అడిగితే..అప్పటివరకూ తాను సాధారణ బాలుడినే అనే ఆలోచనలో ఉన్న కల్కికి అవతార ఆంతర్యం గురించి వివరించాడు పరశురాముడు. కలి సంహారం కోసం జన్మించిన నారాయణుడు... అధర్మంతో నిండిపోయిన భూమిపై ధర్మసంస్థాపన చేసేందుకు భూమ్మీదకు వచ్చారని చెప్పాడు. అప్పటికి తానెవరో స్ఫురుణకు వచ్చింది...

శివుడి కోసం తపస్సు

పరశురాముడి మాటలు విన్న కల్కి..విద్యాభ్యాసాన్ని ముగించుకుని వెళ్లిన తర్వాత పార్వతీపరమేశ్వరులకోసం తపస్సు చేశాడు. అప్పుడు ప్రత్యక్షమైన శివుడు...గారుడం అనే తెల్లటి గుర్రాన్ని ప్రసాదించాడు ( ఇదే విష్ణువు వాహనం గరుత్మంతుడు). భారమైన ఖడ్గాన్నిచ్చి ఇదే భూమి భారాన్ని తీరుస్తుందని చెప్పాడు. ఆ తర్వాత సర్వజ్ఞుడు అనే మాట్లాడే చిలుకను ప్రసాదించాడు. ఈ చిలుక ఎందుకు అని కల్కి అడిగితే మీ కథను మలుపుతిప్పేదే చిలుక అని చెప్పి అంతర్థానమయ్యాడు శివుడు....

పరశురాముడి దగ్గర సకలవిద్యలు నేర్చుకున్న కల్కి.. శివుడి నుంచి వరాలు పొంది తిరిగి శంబలకు పయనమయ్యారు. మరి శ్రీలంకలో ఉన్న అమ్మవారిని ఎలా చేరుకున్నారు? కల్కిని ధర్మ సంస్థాపన దిశగా నడిపించిన సందర్భం ఏంటి? మరో కథనంలో తెలుసుకుందాం...

Also Read: ఈ ఆలయంలో 4 స్తంభాలు 4 యుగాలకి ప్రతీక - ప్రస్తుతం ఉన్న ఒక్క స్తంభం కూలిపోతే కలియుగాంతమే!

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read More

టాప్ హెడ్ లైన్స్

19-08-2026 బుధవారం మీ రాశిఫలాలు! ధనస్సు, మకరం, కుంభం, మీన రాశుల దినఫలాలు!
19-08-2026 బుధవారం మీ రాశిఫలాలు! ధనస్సు, మకరం, కుంభం, మీన రాశుల దినఫలాలు!
19-08-2026 బుధవారం మీ రాశిఫలాలు! సింహం, కన్యా, తులా, వృశ్చిక రాశుల దినఫలం!
19-08-2026 బుధవారం మీ రాశిఫలాలు! సింహం, కన్యా, తులా, వృశ్చిక రాశుల దినఫలం!
19-08-2026 బుధవారం మీ రాశిఫలాలు! మేషం, వృషభం, మిథునం, కర్కాటకం!
19-08-2026 బుధవారం మీ రాశిఫలాలు! మేషం, వృషభం, మిథునం, కర్కాటకం!
India Post Rakhi Offer 2026: రాఖీ పంపాలా? తపాలా శాఖ కొత్త ఆఫర్లు: వాటర్‌ప్రూఫ్ కవర్లు, స్పీడ్ పోస్ట్ తగ్గింపు!
రాఖీ పంపాలా? తపాలా శాఖ కొత్త ఆఫర్లు: వాటర్‌ప్రూఫ్ కవర్లు, స్పీడ్ పోస్ట్ తగ్గింపు!

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nimmala Ramanaidu: 2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
Satyendar Jain Arrest: ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
AP Cabinet Decisions: స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
CM Revanth Reddy: మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
National Sports Awards: గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
India Dominates Galle Test:  విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
Maruti Alto K10 నుంచి Baleno వరకు.. కార్ల ధరలు పెంచిన మారుతి కంపెనీ
Maruti Alto K10 నుంచి Baleno వరకు.. కార్ల ధరలు పెంచిన మారుతి కంపెనీ
Congress Politics: వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
Embed widget