తలవంచని జీవితం - బాధలేని మరణం కావాలా!

ఆలయానికి వెళ్లి దర్శనం అనంతరం కాసేపు కూర్చుంటారు

ఆలయ ప్రాంగణంలో కూర్చున్నప్పుడు దైవనామస్మరణ చేస్తుంటారు

దర్శనం అనంతరం కూర్చున్నప్పుడు ఈ శ్లోకం చదువుకోవాలి...

అనాయాసేన మరణం - వినాదైన్యేన జీవనం
దేహాంతే తవ సాయుజ్యం - దేహిమే పరమేశ్వరా!

నొప్పి కానీ బాధ కానీ లేని మరణాన్ని ప్రసాదించు

జీవితంలో ఎవరిమీదా ఆధారపడకుండా..ఎవరి ముందూ తలవంచకుండా..

ఎవరినీ నొప్పించకుండా..ఎవరి వద్దా చులకనకాకుండా ఉండే జీవితాన్ని ప్రసాదించు

మరణం ప్రాప్తించిన తర్వాత నీలో లీనమయ్యేలా దీవించు

పరమేశ్వరా నాకు ఈ వరాలని అనుగ్రహించు...

All Images Credit: playground.com