అన్వేషించండి

Kalki 2898 AD Kurukshetra : మహాభారత యుద్ధం జరిగిన కురుక్షేత్ర ఎక్కడుంది..ఎలా వెళ్లాలి..అక్కడ చూసేందుకు ఏమున్నాయ్?

మహాభారత యుద్ధం కురుక్షేత్ర భూమిలోనే ఎందుకు జరిగింది? దృతరాష్ట్రుడు ఆ ప్రదేశాన్నే ఎందుకు ఎంపిక చేశాడు? ఆ స్థలం విశిష్టత ఏంటి? ఎక్కడుందా ప్రదేశం, ఎలా చేరుకోవాలి, అక్కడ ఇంకా ఏమేం చూడొచ్చు...

Mahabharatam Kurukshetra : కురుక్షేత్ర అంటే కేవలం మహాభారత యుద్ధం జరిగిన స్థలం మాత్రమే కాదు. హర్యానా రాష్ట్రంలో ఉన్న ఆ ప్రదేశానికి ఓ విశిష్టత ఉందని స్థలపురాణం చెబుతోంది. ద్వాపరయుగంకన్నా ముందు ఈ ప్రదేశానికి కురు అనే రాజు వచ్చాడు. ఆ చుట్టుపక్కల 8 నదులు పరవళ్లు తొక్కుతూ ప్రవహించడం చూసిన ఆ రాజు..తన బంగారు రథం నుంచి కిందకు దిగివచ్చి నాగలి తయారు చేశాడు. ఆ తర్వాత పరమేశ్వరుడిని పూజించి నందిని, యముడిని ప్రార్థించి మహిషాన్ని తీసుకొచ్చి ఆ నాగలికి కట్టి భూమి దున్నడం ప్రారంభించాడు. అక్కడకు వచ్చిన ఇంద్రుడు.. ఏం చేస్తున్నావని ప్రశ్నించాడు. సత్యం, దయ, క్షమ, దానం, స్వచ్ఛత, నిష్కామం, బ్రహ్మచర్యం, యోగం అనే 8 పంటలు పండించేందుకు ఉపక్రమిస్తున్నానని చెప్పాడు కురు రాజు. ఆ తర్వాత శ్రీ మహావిష్ణువు స్వయంగా దిగివచ్చి అదే ప్రశ్న అడిగితే..మళ్లీ అదే సమాధానం చెప్పాడు కురు మహారాజు. అయితే విత్తనాలేవని అడిగితే..తన శరీరాన్ని అప్పగించాడు. అప్పుడు ఏవరం కావాలో కోరుకోమనడంతో కురురాడు..వెంటనే తాను మరణించిన తర్వాత ఈ ప్రదేశం తనపేరుతో వర్థిల్లాలని..ఇక్కడ పోయిన ప్రతిప్రాణి స్వర్గానికి చేరుకోవాలన్నాడు. సరే అని వరమిచ్చాడు శ్రీ మహావిష్ణువు. అలా కురు రాజు క్షేత్రంగా మలచాలి అనుకున్నప్రదేశం కురుక్షేత్రం అయింది.  

Also Read: మహాభారత విషాద వీరుడు సూర్య పుత్ర కర్ణుడిని ముంచేసిన మూడు శాపాలు ఇవే!

ధృతరాష్ట్రుడు ఈ ప్రదేశం ఎందుకు ఎంపిక చేశాడు?

మాయాజూదంలో ఓడిన పాండవువు అరణ్యవాసం, అజ్ఞాతవాసం పూర్తిచేసుకున్నాక మహాభారతయద్ధం జరిగింది. మహా సంగ్రామాన్ని ఎక్కడ నిర్వహించాలి అనే చర్చ జరిగినప్పుడు అప్పుడు కురుక్షేత్రం ప్రదేశాన్ని ఎంపిక చేశాడు ధృతరాష్ట్రుడు. దీనివెనుకున్న ఉద్దేశం ఏంటంటే.. పరాక్రమవంతులు, ధర్మపరులైన పాండవు చేతిలో తన సంతానం అయిన కౌరవులు ఎలాగూ మరణిస్తారు..వారికి స్వర్గప్రాప్తి కలగాలనే ఉద్దేశంతో ఈ ప్రాంతాన్ని ఎంపిక చేశాడని చెబుతారు.  

Also Read: కర్ణుడు - అర్జునుడు ఇద్దరిలో ఎవరు బలవంతులు? కల్కి 2898 AD సినిమాలో ఏం చూపించారు - పురాణాల్లో ఏముంది?

కురుక్షేత్రలో ఏమున్నాయ్?

కురుక్షేత్రలో చూసితీరాల్సిన కట్టడాలేమీ లేవు. బ్రహ్మసరోవరం అనే ఓ కొలను..దాని ఒడ్డునే లక్ష్మీనారాయణుడి పురాతన ఆలయం ఉంటుంది. అప్పట్లో చాలా పెద్దదిగా ఉండే కొలనును పునర్నించారు. ప్రస్తుతం దీని పొడవు 1170 మీటర్లు..ఇక్కడ స్నానమాచరించడం పుణ్యప్రదంగా భావిస్తారు. ముఖ్యంగా గ్రహణ స్నానాలు ఆఛరిస్తుంటారంచా. ఉత్తర ప్రదేశ్ లో చాలా ప్రాంతాల నుంచి గ్రహణం రోజు వచ్చి స్నానమాచరించే భక్తులతో కురుక్షేత్రలో ఉన్న బ్రహ్మరసరోవరం నిండిపోతుంది. ఈ ప్రదేశానికి సమీపంలో రానురాను కొన్ని ఆలయాలు నిర్మించారు. కురుక్షేత్ర నుంచి దూరంగా ఓ చిన్న ఆలయానికి ఆనుకుని దిగుడుబావి లాంటి కొలను ఉంటుంది. కురుక్షేత్ర సంగ్రామం ముగిసిన తర్వాత అంపశయ్యమీదున్న భీష్ముడి దాహం తీర్చేందుకు అర్జునుడు వేసిన బాణం ద్వారా ఆ కొలను ఏర్పడిందని చెబుతారు. కురుక్షేత్రకి మరోవైపు జ్యోతి సర్ అని మరో కొలను ఒడ్డున అర్జునుడికి శ్రీకృష్ణుడు గీతోపదేశం చేసినట్టు స్థలపురాణం. బ్రహ్మ సరోవరం ఒడ్డునే ఉండే రోడ్డుకు రెండో వైపు బిర్లా ధర్మశాల, జాట్ ధర్మశాలలున్నాయి. 

Also Read: శంబల నగరం ఎక్కడుంది , ఇప్పటివరకూ ఎవరెవరు వెళ్లొచ్చారు - శంబల గురించి ఆశ్చర్యపోయే విషయాలివే!

కురుక్షేత్ర ఎలా చేరుకోవచ్చు?

ఈ ప్రదేశం కురుక్షేత్ర, తానేశ్వర్ అనే జంటనగరాలుగా ఉంటుంది. ఇక్కడున్న స్థానీశ్వరుడి ఆలయం పేరుమీద ఈ పేరు వచ్చింది.ఈ సమీపంలోనే అత్యంత పురాతనమైన భద్రకాళి ఆలయం కూడా ఉంది. దిల్లీ నుంచి ఉత్తరంగా చండీగఢ్, జమ్మూ వైపు వెళ్లే రైలు మార్గంలో కురుక్షేత్ర ఉంటుంది. దిల్లీ నుంచి దాదాపు 165 కిలోమీటర్లు ఉన్న కురుక్షేత్ర చేరుకోవాలంటే ట్రైన్లోనే నాలుగున్నర గంటలు పట్టేస్తుంది. బస్సుల్లో వెళ్లాలి అనుకుంటే దిల్లీ నుంచి బస్సులు అందుబాటులో ఉంటాయి..

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read More

టాప్ హెడ్ లైన్స్

బుధుడు అస్తమయం: ఉద్యోగం మారాలని ఆలోచిస్తున్నారా? ముందుగా ఈ విషయాన్ని తెలుసుకోండి!
బుధుడు అస్తమయం: ఉద్యోగం మారాలని ఆలోచిస్తున్నారా? ముందుగా ఈ విషయాన్ని తెలుసుకోండి!
Guru Gochar 2026: నిద్రలేవగానే మొబైల్ చూసే అలవాటుందా? మీపై గురుగ్రహం ప్రభావం ఎలా ఉంటుందో తెలుసా!
నిద్రలేవగానే మొబైల్ చూసే అలవాటుందా? మీపై గురుగ్రహం ప్రభావం ఎలా ఉంటుందో తెలుసా!
Chandra Grahan 2026: చంద్ర గ్రహణం రోజు రక్షా బంధన్! పూజ చేసేందుకు సమయం, నియమాలు తెలుసుకోండి!
చంద్ర గ్రహణం రోజు రక్షా బంధన్! పూజ చేసేందుకు సమయం, నియమాలు తెలుసుకోండి!
బుధవారం ఏ దేవుడిని పూజించాలి?చదవాల్సిన శ్లోకాలు, పూజా విధానం, నైవేద్యం తెలుసుకోండి!
బుధవారం ఏ దేవుడిని పూజించాలి?చదవాల్సిన శ్లోకాలు, పూజా విధానం, నైవేద్యం తెలుసుకోండి!

వీడియోలు

Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kakinada AE Nookaraju Family Suicide Case: కాకినాడ ఏఈ కుటుంబం ఆత్మహత్య కేసులో కీలక మలుపు!వెలుగులోకి సౌజన్య లేఖలు! షూటింగ్ కోచ్‌ ఖాన్‌పై హత్య కేసు నమోదు!
కాకినాడ ఏఈ కుటుంబం ఆత్మహత్య కేసులో కీలక మలుపు!వెలుగులోకి సౌజన్య లేఖలు! షూటింగ్ కోచ్‌ ఖాన్‌పై హత్య కేసు నమోదు!
Nalgonda crime news:నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Tamil Nadu CM Vijay: చంద్రబాబును మించిపోయిన విజయ్‌! మూడో బిడ్డ పుడితే ఏడాది సెలవులు! తమిళనాడు సీఎం కీలక నిర్ణయం!
చంద్రబాబును మించిపోయిన విజయ్‌! మూడో బిడ్డ పుడితే ఏడాది సెలవులు! తమిళనాడు సీఎం కీలక నిర్ణయం!
Kolkata Hotel Fire Accident: కోల్‌కతాలోని న్యూ మార్కెట్ హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం- పిల్లలు, మహిళలు సహా 9 మంది మృతి! 
కోల్‌కతాలోని న్యూ మార్కెట్ హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం- పిల్లలు, మహిళలు సహా 9 మంది మృతి! 
LPG to PNG Shift: LPG నుంచి PNGకి మారడానికి ప్రభుత్వం సహాయం! డబ్బు ఆదా చేసే ఈ కొత్త సబ్సిడీ స్కీమ్ గురించి తెలుసా?
LPG నుంచి PNGకి మారడానికి ప్రభుత్వం సహాయం! డబ్బు ఆదా చేసే ఈ కొత్త సబ్సిడీ స్కీమ్ గురించి తెలుసా?
NTR Trivikram Movie Title: గాడ్ ఆఫ్ వార్ కాదు... త్రివిక్రమ్ మార్క్ టచ్‌తో మరో క్రేజీ టైటిల్
గాడ్ ఆఫ్ వార్ కాదు... త్రివిక్రమ్ మార్క్ టచ్‌తో మరో క్రేజీ టైటిల్
Prabhas: ప్రభాస్ 'స్పిరిట్' వాయిదా? 'ఫౌజీ'కి నెట్‌ఫ్లిక్స్ డెడ్‌లైన్!?
ప్రభాస్ 'స్పిరిట్' వాయిదా? 'ఫౌజీ'కి నెట్‌ఫ్లిక్స్ డెడ్‌లైన్!?
Embed widget