అన్వేషించండి

Kalki 2898 AD Dulquer Salmaan : కల్కి 2898 AD లో దుల్కర్ సల్మాన్ క్యారెక్టర్ పురాణాల్లో ఎవరో తెలిస్తే ఆశ్చర్యపోతారు.. పార్ట్ 2 లో కీలక రోల్ ఇది!

Kalki 2898 AD Dulquer Salmaan: కల్కి 2898 AD సినిమాలో చాలా గెస్ట్ రోల్స్ ఉన్నాయి. వాటన్నింటినీ ఎక్కడికక్కడ ముగించేశాడు డైరెక్టర్. కానీ దుల్కర్ సల్మాన్ ఇంకా ఉన్నాడు..పురాణాల్లో తనెవరో తెలుసా...

Kalki 2898 AD Dulquer Salmaan  as Parashurama

కల్కి 2898 AD సినిమా చూశారా?
ఇందులో ఉన్న గెస్ట్ రోల్స్ అన్నింటినీ ఎక్కడిక్కడ ముగించేశాడు డైరెక్టర్ నాగ్ అశ్విన్..
కానీ దుల్కర్ సల్మాన్ క్యారెక్టర్ మాత్రం చంపలేదు. ఎందుకో తెలుసా? ఆ క్యారెక్టర్ ఇంపార్టెన్స్ ఏంటో అర్థమైందా?
అసలు దుల్కర్ సల్మాన్ ని ఏదో గెస్ట్ రోల్ మాత్రమే అనుకుంటున్నారా?..అస్సలు కాదు..
నాగ్ అశ్విన్ పురాణాలను ఎంత క్షుణ్ణంగా చదివి ఈ స్టోరీ రాసుకున్నాడో చెప్పేందుకు కల్కి 2898 AD మూవీలో ఉండే ప్రతి పాత్ర బ్యాగ్రౌండ్ పరిశీలిస్తే అర్థమవుతుంది. అందులో అత్యంత ముఖ్యమైనది దుల్కర్ సల్మాన్..

Also Read: మహాభారత యుద్ధం జరిగిన కురుక్షేత్ర ఎక్కడుంది..ఎలా వెళ్లాలి..అక్కడ చూసేందుకు ఏమున్నాయ్?

సినిమా మొదలైన కొద్దిసేపటికి  మృణాల్ ఠాకూర్ ఎంట్రీ ఇస్తుంది.  గర్భిణిగా కనిపించే  ఆమెను చూసి శంబల నుంచి వచ్చిన రాజేంద్ర ప్రసాద్ తాము వెతుకుతున్న అమ్మ అనుకుంటాడు.  అయితే ఆమె కడుపులో పెరుగుతున్న బిడ్డ దేవుడు కాదని క్లారిటీ వస్తుంది.  అక్కడి నుంచి వెళ్లిపోవాలనే ప్రయత్నంలో భాగంగా...మృణాళ్ ..ఆ తర్వాత రాజేంద్ర ప్రసాద్ సుప్రీమ్ యాస్కిన్ అనుచరుల చేతిలో ప్రాణాలు కోల్పోతారు..  శంబలలో అమ్మకోసం ఎదురుచూస్తున్న మరియం క్యారెక్టర్లో నటించింది శోభన. ఎట్టకేలకు అమ్మ శంబలలో అడుగుపెడుతుంది. ఆ ఆనందంలో ఉన్న సమయంలో భైరవ కారణంగా సుప్రీమ్ యాస్కిన్ మనుషులు ఎంట్రీ ఇస్తారు...వారితో పోరాటంతో ప్రాణాలు కోల్పోతుంది మరియం. ‘కల్కి 2898 AD’లో కైరాగా నటించింది మల్లూవుడ్ బ్యూటీ ఆన్నా బెన్. అమ్మగా నటించిన దీపికను శంబలకు తీసుకెళ్లే ప్రయత్నంలో సుప్రీమ్ యాస్కిన్ మనుషులతో  పోరాడి ప్రాణాలు వదిలేస్తుంది.. ఇక రాజమౌళి, ఆర్జీవీ, బ్రహ్మానందం వీళ్లు.. ప్రేక్షకుల్లో ఉత్సాహం పెంచేందుకు వచ్చిపోయే పాత్రలుగా చూపించారు.  కానీ దుల్కర్ సల్మాన్ రోల్ అలా కాదు..ఇంతకీ తనెవరంటే... సప్త చిరంజీవుల్లో ఒకడైన పరశురాముడు..

పరశురాముడి క్యారెక్టర్లో దుల్కర్ సల్మాన్

రేణుక-జమదగ్ని మహర్షి ఐదో సంతానం పరశురాముడు. ఇప్పటికీ భూమ్మీద బతికి ఉన్న ఏడుగురు చిరంజీవుల్లో ఒకడు పరశురాముడు.  తండ్రి  జమదగ్ని మహర్షి దగ్గర్నుంచి దౌర్జన్యంగా కామధేనువుని తీసుకెళ్లిపోయిన మాహిష్మతి మహారాజు అయిన కార్తావీర్యార్జునుడిపై దండయాత్ర చేసి చంపేస్తాడు పరశురాముడు. అందుకు ప్రతిగా కార్తావీర్యార్జునుడి తనయులు...జమగద్ని మహర్షి తలనరికేస్తారు. అప్పటి నుంచి క్షత్రియుల అంతమే లక్ష్యంగా వరుస దండయాత్రలు చేస్తాడు పరశురాముడు. భీష్ముడు, ద్రోణుడు, కర్ణుడికి సకల విద్యలు నేర్పించిన పరశురాముడు..కలియుగంలో కల్కిగా జన్మించబోతున్న శ్రీ మహావిష్ణువుకి  విద్యలు నేర్పించేది కూడా పరశురాముడే.

Also Read: మహాభారత విషాద వీరుడు సూర్య పుత్ర కర్ణుడిని ముంచేసిన మూడు శాపాలు ఇవే!

దుల్కర్ సల్మాన్...పరశురాముడు ఎలా అయ్యాడంటే!
 
కల్కిలో భైరవుడిగా నటించిన ప్రభాస్..గడిచిన యుగంలో కర్ణుడు. అప్పుడు కర్ణుడికి విద్యలు నేర్పించిన గురువు, అబద్ధం చెప్పాడని శాపం ఇచ్చిన గురువు పరశురాముడే. ఈ మూవీలో భైరవగా నటించిన ప్రభాస్ ని చేరదీసి సకల విద్యలు నేర్పిస్తాడు. అప్పుడు బ్రాహ్మణుడిని అని అబద్ధం చెబుతాడు..ఈ మూవీలో భైరవ తన గురువుని కాంప్లెక్స్ కి అమ్మేస్తాడు. అన్ని క్యారెక్టర్స్ ని ఎక్కడికక్కడ చంపేసిన నాగ్ అశ్విన్.. దుల్కర్ సల్మాన్ ని మాత్రం బంధించి తీసుకెళ్లిపోతారంతే. 

Also Read: కర్ణుడు - అర్జునుడు ఇద్దరిలో ఎవరు బలవంతులు? కల్కి 2898 AD సినిమాలో ఏం చూపించారు - పురాణాల్లో ఏముంది?

కల్కి 2898 AD పార్ట్ 2 లో దుల్కర్ పాత్ర కీలకం

ప్రస్తుతం థియేటర్లో ఉన్న కల్కి మూవీలో అమ్మను..భైరవ తీసుకెళ్లడంతో సినిమా ముగిసింది. రెండో భాగంలో కల్కి జన్మించిన తర్వాత .. గురుకులానికి బయలుదేరే సమయంలో పరశురాముడు ఎంట్రీ ఇచ్చి కల్కిని తీసుకెళ్లి విద్యలు నేర్పించి.. కల్కి జననం వెనుకున్న ఆంతర్యం వివరిస్తాడు. అప్పటి నుంచి అశ్వత్థామ సహాయంతో ధర్మసంస్థాపన మొదలవుతుంది. అంటే పార్ట్ 2 లో కథను కీలక మలుపు తిప్పబోయేది దుల్కర్ సల్మానే. ప్రస్తుతం కాంప్లెక్స్ మనుషుల చేతిలో ఉన్న కెప్టెన్... అక్కడి నుంచి బయటపడి కల్కిని ఎలా చేరుకుంటాడో వెయిట్ అండ్ సీ...

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ధనుష్‌పై మరో సంచలన పోస్ట్ పెట్టిన నయనతారరివర్స్ గేర్‌లో కారు.. ఇంతలో భారీ ప్రమాదం సీసీటీవీ వీడియోరామ్ చరణ్ దర్గా వివాదంపై స్ట్రాంగ్‌గా రియాక్ట్ అయిన ఉపాసనబాచుపల్లిలో కాలకూట విషంగా మారిన తాగు నీళ్లు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Nara Lokesh : ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
Adani Group Statement:  అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
Diksha Divas: తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
Posani : మగాడ్ని ఎవరికీ తలవంచను - పోసాని సంచలన ప్రకటన - రాజకీయాలకు గుడ్ బై
మగాడ్ని ఎవరికీ తలవంచను - పోసాని సంచలన ప్రకటన - రాజకీయాలకు గుడ్ బై
Embed widget