అన్వేషించండి
In Pics: ప్రగతి భవన్‌లో అతిథులకు అల్పాహార విందు, ‘జాగ్వార్’కు ఇడ్లీ వడ్డించిన కేటీఆర్
టీఆర్ఎస్ పార్టీ అధినేత కె.చంద్రశేఖర్ రావు నేడు (అక్టోబరు 5) జాతీయ పార్టీని ప్రకటించబోతున్న సందర్భంగా ముఖ్య అతిథులతో ప్రగతి భవన్ సందడిగా మారింది.

కేటీఆర్ వడ్డన
1/10

టీఆర్ఎస్ పార్టీ అధినేత కె.చంద్రశేఖర్ రావు నేడు (అక్టోబరు 5) జాతీయ పార్టీని ప్రకటించబోతున్న సందర్భంగా ముఖ్య అతిథులతో ప్రగతి భవన్ సందడిగా మారింది.
2/10

ఉదయమే వచ్చిన అతిథులకు కేసీఆర్ అల్పాహార విందు ఇచ్చారు.
3/10

కర్ణాటక నుంచి అక్కడి ప్రతిపక్ష పార్టీ జనతాదళ్ (సెక్యులర్) ముఖ్యనేత, ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి హెచ్ డీ కుమారస్వామి, ఆయన తనయుడు నిఖిల్ గౌడతో పాటు ఆ పార్టీ ఎమ్మెల్యేలు, తదితర ప్రజా ప్రతినిధుల బృందం బుధవారం ఉదయం ప్రగతి భవన్‌కు వచ్చింది.
4/10

తమిళ నాడు నుంచి ‘విదుతాలై చిరుతైగల్ కట్చె’ (విసికె) పార్టీ అధినేత ‘చిదంబరం పార్లమెంట్ సభ్యుడు’, ప్రముఖ దళిత నేత తిరుమావళవన్, వారితో పాటు వచ్చిన ప్రతినిధుల బృందం బుధవారం ఉదయం ప్రగతి భవన్ కు చేరుకుంది.
5/10

బుధవారం ఉదయం ప్రగతి భవన్ వచ్చిన కుమారస్వామి బృందాన్ని, తిరుమావళవన్ బృందాన్ని సీఎం కేసీఆర్, కేటీఆర్ లు సాదరంగా ఆహ్వానించారు.
6/10

అనంతరం ఏర్పాటు చేసిన అల్పాహార విందులో పాల్గొని వారికి ఆతిథ్యం ఇచ్చారు.
7/10

ఈ సందర్భంగా మంత్రులు హరీశ్ రావు, ప్రశాంత్ రెడ్డి, ఎంపీ సంతోష్ కుమార్, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, తదితర ప్రజాప్రతినిధులు ఉన్నారు.
8/10

అల్పాహార విందులో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు పదుల సంఖ్యలో నేతలు, అతిథులు సామూహికంగా అల్పాహారం స్వీకరించారు.
9/10

అతిథులకు మంత్రి కేటీఆర్ కూడా స్వయంగా అల్పాహారం వడ్డించారు.
10/10

కర్ణాటక మాజీ సీఎం కుమార స్వామి కుమారుడు, సినీ హీరో నిఖిల్ గౌడకు (జాగ్వార్ సినిమా హీరో) మంత్రి కేటీఆర్ స్వయంగా ఇడ్లీ వడ్డించారు.
Published at : 05 Oct 2022 12:49 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
పాలిటిక్స్
తెలంగాణ
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion