అన్వేషించండి

Top Headlines Weekly: ట్విస్ట్‌లతో కూడిన ఈ వారం టాప్‌ హెడ్‌లైన్స్‌ ఇక్కడ చదివేయండి

వివేక హత్య కేసులో అవినాష్‌కు ఊరట లభించినట్టే మరో టెన్షన్ మొదలైంది. స్టీల్ ప్లాంట్ విషయంలో తెలంగాణ సైలెంట్ అయింది. ట్విటర్ యూజర్లకు మస్క్‌ గట్టిగానే షాక్ ఇచ్చారు. మోర్అ ప్‌డేట్స్‌ కోసం క్లిక్ చేయండి.

ప్రతీకాత్మక చిత్రం

1/11
వైఎస్‌ వివేకానంద రెడ్డి హత్య కేసులో కీలక పరిణామాలు జరిగాయి. తండ్రి భాస్కర్‌రెడ్డి అరెస్టుతో అలర్ట్‌ అయిన వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి తెలంగాణ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్‌ వేశారు. విచారించిన కోర్టు ఆయన్ని 25 వరకు అరెస్టు చేయొద్దని చెప్పింది. దీనిపై వివేక కుమార్తె సునీత సుప్రీం కోర్టుకు వెళ్లారు. ఈ ఆదేశాలు దారుణమైనవిగా సుప్రీం అభిప్రాయపడింది. హైకోర్టు ఉత్తర్వులపై స్టే ఇచ్చింది. అయితే సోమవారం వరకు అవినాష్‌ను అరెస్టు చేయొద్దని చెప్పింది.

2/11
ముందస్తు బెయిల్ కావాలని అభ్యర్థన విషయంలో ఊరట లభించినప్పటికీ రోజువారి విచారణకు మాత్రం అవినాష్ రెడ్డి హాజరుకావాల్సిందేనంటూ హైకోర్టు స్పష్టం చేసింది. ఆయనతోపాటు తండ్రి భాస్కర్‌ రెడ్డి, ఉదయ్‌ కుమార్‌ను కూడా కోర్టు ఆదేశాల మేరకు కస్డడీలోకి తీసుకొని మూడు రోజులుగా విచారించింది సీబీఐ. ముగ్గుర్ని వేర్వేరుగా, విడివిడిగా ప్రశ్నించింది. విచారణ ప్రక్రియను ఆడియో వీడియో రికార్డు చేసింది సీబీఐ.

3/11
రాష్ట్రీయ ఇస్పాత్ నిగం లిమిటెడ్‌కు  మూలధనం సమకూర్చేందుకు  జారీ చేసిన ఆసక్తి వ్యక్తీకరణ బిడ్‌లో పాల్గొనేందుకు సింగరేణి సంస్థ ఆసక్తి చూపించలేదు. ఐదు రోజుల కిందట.. పదిహేనో తేదీన బిడ్ల దాఖలకు ఆఖరు రోజున.. కాస్త సమయం కావాలని స్టీల్ ప్లాంట్ అధికారులను సింగరేణి యాజమాన్యం ప్రత్యేకంగా కోరింది. దీంతో మరో ఐదు రోజులు గడువు పొడిగిస్తూ స్టీల్ ప్లాంట్ యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. అయితే ఈ ఐదు రోజుల్లోనూ సింగరేణి యాజమాన్యం  బిడ్ దాఖలుకు నిర్ణయం తీసుకోలేదు. వర్కవుట్ కాదన్న అభిప్రాయంతోనే మిన్నకుండిపోయినట్లుగా భావిస్తున్నారు.

4/11
కుప్పం నుంచి ప్రారంభించిన నారా లోకేష్ యువగళం పాదయాత్ర కర్నూలు జిల్లా ఆదోనిలో వెయ్యి కిలోమీటర్లు పూర్తి చేసుకుంది.  యువగళం మహాపాద యాత్రలో భాగంగా ప్రతి 100 కిలోమీటర్లకు ప్రత్యేకంగా హామీ ఇచ్చి శిలాఫలకం ఆవిష్కరించే ఆనవాయితీని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ కొనసాగిస్తున్నారు.  ఈ క్రమంలోనే లోకేష్ తన పాదయాత్రలో 77వ రోజు  కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గం వర్గం చేరుకున్నారు. ఆదోని గుండా కొనసాగిన పాదయాత్ర సాయంత్రం సిరిగుప్ప క్రాస్ వద్దకు చేరుకోవడంతో 1000 కిలోమీటర్లు పూర్తి అయ్యాయి. 1000 కి.మీ. మైలురాయి చేరుకున్న సందర్భంగా ఆదోని టౌన్ వార్డ్ 21ని దత్తత తీసుకోవాలని నిర్ణయించుకున్నట్టు లోకేష్ ప్రకటించారు.

5/11
మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విట్టర్ సీఈఓ ఎలాన్ మస్క్ లెగసీ వెరిఫైడ్ అకౌంట్లపై బ్లూ టిక్‌లను తొలగించారు. ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, క్రికెటర్ విరాట్ కోహ్లీ, నటులు చిరంజీవి,  షారుఖ్ ఖాన్, అల్లు అర్జున్‌ను బ్లూ చెక్ మార్క్ నుంచి తొలగించారు.

6/11
వచ్చే సెప్టెంబరు నెల నుంచి తన కుటుంబం విశాఖపట్నానికి తరలి వెళ్తున్నట్లుగా సీఎం జగన్ ప్రకటించారు. మూలపేట పోర్టు శంకుస్థాపన అనంతరం బహిరంగ సభలో సీఎం జగన్ మాట్లాడుతూ.. సంచలన ప్రకటన చేశారు. రాష్ట్రంలో పరిపాలన వికేంద్రీకరణలో భాగంగా తాను తన కాపురాన్ని వచ్చే సెప్టెంబరు నుంచి విశాఖపట్నానికి తరలిస్తున్నట్లుగా చెప్పారు. శ్రీకాకుళం పర్యటనలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి ఈ కీలక ప్రకటన చేశారు. సంతబొమ్మాళి మండలంలో మూలపేట పోర్టుకు శంకుస్థాపన చేసిన అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం జగన్ మాట్లాడారు.

7/11
జమ్ము కశ్మీర్ లోని పూంఛ్ జిల్లాలో ఆర్మీ ట్రక్కు పేలి ఐదుగురు సైనికులు సజీవదహనం అయ్యారు. అయితే ఈ ఘటనలో ఉగ్రవాదుల హస్తం ఉన్నట్లు సైన్యం నిర్ధారించింది. పిడుగు పాటు వల్లే ట్రక్కులో మంటలు చెలరేగి ఉంటాయని ముందుగా భావించారు. కానీ దీని వెనుక ఉగ్రవాదుల హస్తం ఏమైనా ఉందా అనే కోణంలోనూ ఆరా తీశారు. దీంతో విషాధం వెనుక ఉన్న ఉగ్ర కుట్రలు వెలుగులోకి వచ్చాయి. బింభేర్ గలి నుంచి పూంఛ్ జిల్లాలోని సాంగియోట్ వైపు వెళ్తుండగా.. మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఈ దుర్ఘటన జరిగింది. అయితే ఈ ప్రమాదంలో ఐదుగురు జవాన్లు మరణించారు. భారీ వానలు, సరిగ్గా కనిపించకపోవడం వంటి పరిస్థితులను అనుకూలంగా మలుచుకున్న గుర్తు తెలియని ఉగ్రవాదులు భారత సైనికులు వెళ్తున్న ట్రక్కును లక్ష్యంగా చేసుకొని గ్రనేడ్లతో మెరుపుదాడికి దిగారని సైనిక అధికారులు వివరించారు. ఈ ఘటనలో తీవ్ర గాయాలపాలైన సైనికుడిని చికిత్స కోసం రాజౌరిలోని సైని ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స అందిస్తున్నట్లు చెప్పారు.

8/11
రాహుల్‌ గాంధీపై అనర్హతా వేటు పడినప్పటి నుంచి
రాహుల్‌ గాంధీపై అనర్హతా వేటు పడినప్పటి నుంచి "న్యాయ పోరాటం" చేస్తానంటూ గట్టిగానే చెబుతూ వచ్చారు. పైకోర్టులో తేల్చుకుంటామని ఇప్పటికే కాంగ్రెస్ కూడా పలు సందర్భాల్లో తేల్చి చెప్పింది. సూరత్ కోర్టు ఇచ్చిన ఈ తీర్పుని సవాలు చేస్తూ రాహుల్ పిటిషన్ వేశారు. ఈ క్రమంలోనే రాహుల్‌కి కోర్టు షాకిచ్చింది. ఈ పిటిషన్‌ కొట్టేసింది. విచారించడం కుదరదని తేల్చి చెప్పింది. మోదీ ఇంటి పేరుపై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యల ఆధారంగా ఆయనను దోషిగా తేల్చుతూ సూరత్ కోర్టు రెండేళ్ల జైలుశిక్ష విధించింది. ఈ తీర్పుపై స్టే విధించాలని రాహుల్ పిటిషన్ వేయగా...దాన్ని తిరస్కరించింది. దీంతో ఆయనపై అనర్హతా వేటు కొనసాగనుంది. 8 ఏళ్ల పాటు ఎన్నికల్లో పాల్గొనడానికి వీల్లేదు. ఇప్పటికే అధికారిక బంగ్లా ఖాళీ చేయాలని ప్రభుత్వం తేల్చి చెప్పింది. ఆ మేరకు ఖాళీ చేశారు రాహుల్. గత వారమే ఈ పిటిషన్‌పై తీర్పు చెప్పాల్సి ఉన్నప్పటికీ...ఇవాళ్టికి (ఏప్రిల్ 20) వాయిదా వేసింది సెషన్స్ కోర్టు. ఇవాళ ఆ పిటిషన్‌ను కొట్టేసింది. అంతకు ముందు రాహుల్ గాంధీ కోర్టుపై ఆరోపణలు చేశారు. ట్రయల్ కోర్టు తనతో చాలా దురుసుగా ప్రవర్తించిందని విమర్శించారు. ఏప్రిల్ 3వ తేదీన సెషన్స్ కోర్టుని ఆశ్రయించారు. రాహుల్ తరపున న్యాయవాదులు రెండు పిటిషన్‌లు వేశారు. జైలు శిక్షపై స్టే విధించేందుకు ఓ పిటిషన్, అప్పీల్ చేసుకునేంత వరకూ శిక్షపై విధించాలని మరో పిటిషన్ వేశారు. రాహుల్‌కి బెయిల్ ఇచ్చే క్రమంలోనే పూర్ణేష్ మోదీతో పాటు రాష్ట్ర ప్రభుత్వానికీ నోటీసులు పంపింది కోర్టు.
9/11
ప్రపంచంలో అత్యధిక జనాభా ఉన్న దేశమేది అంటే వెంటనే చైనా అని సమాధానం చెప్పేస్తాం. కానీ ఇకపై ఈ సమాధానం చెప్పే వాళ్లందరూ పప్పులే కాలేసినట్టే. ఎందుకంటే...చైనా రికార్డు బద్దలైంది. జనాభాలో చైనాను మించి భారత్‌ దూసుకుపోయింది. ఇది స్వయంగా ఐక్యరాజ్య సమితి వెల్లడించిన విషయం. చైనా కన్నా ఎక్కువ జనాభా ఉన్న దేశంగా భారత్ అవతరించిందని స్పష్టం చేసింది యూఎన్. చైనా జనాభాతో పోల్చి చూస్తే...ఎక్కువగానే భారత జనాభా 30 లక్షల మేర పెరిగిందని వెల్లడించింది. ఈ మేరకు అధికారికంగా ఓ రిపోర్ట్‌ కూడా విడుదల చేసింది.
ప్రపంచంలో అత్యధిక జనాభా ఉన్న దేశమేది అంటే వెంటనే చైనా అని సమాధానం చెప్పేస్తాం. కానీ ఇకపై ఈ సమాధానం చెప్పే వాళ్లందరూ పప్పులే కాలేసినట్టే. ఎందుకంటే...చైనా రికార్డు బద్దలైంది. జనాభాలో చైనాను మించి భారత్‌ దూసుకుపోయింది. ఇది స్వయంగా ఐక్యరాజ్య సమితి వెల్లడించిన విషయం. చైనా కన్నా ఎక్కువ జనాభా ఉన్న దేశంగా భారత్ అవతరించిందని స్పష్టం చేసింది యూఎన్. చైనా జనాభాతో పోల్చి చూస్తే...ఎక్కువగానే భారత జనాభా 30 లక్షల మేర పెరిగిందని వెల్లడించింది. ఈ మేరకు అధికారికంగా ఓ రిపోర్ట్‌ కూడా విడుదల చేసింది. "State of World Population Report, 2023" పేరిట United Nations Population Fund ఈ లెక్కలు వెల్లడించింది. ప్రస్తుతానికి చైనాలో 142 కోట్ల 57 లక్షల జనాభా ఉంది. భారత్‌లో ఈ సంఖ్య 142 కోట్ల 86 లక్షలకు పెరిగిందని తెలిపింది. అంటే...ఇకపై జనాభా విషయంలో భారత్‌ మొదటి స్థానంలో, చైనా రెండో స్థానంలో నిలవనున్నాయి. అగ్రరాజ్యం అమెరికా మూడో స్థానంలో నిలవనుంది. అమెరికా జనాభా ప్రస్తుతానికి 34 కోట్లుగా ఉంది. ఈ ఏడాది ఫిబ్రవరి నాటికి జనాభాను లెక్కించి ఈ వివరాలు తెలిపింది ఐక్యరాజ్య సమితి. నిజానికి గతంలోనూ యూఎన్ త్వరలోనే చైనా రికార్డుని భారత్ అధిగమిస్తుందని చెప్పింది. ఇప్పుడు అధికారికంగా ప్రకటించింది. భారత్‌లో చివరిసారి 2011లో జనాభా లెక్కల ప్రక్రియ చేపట్టారు. మూడేళ్ల క్రితం జరగాల్సి ఉన్నా...కరోనా సంక్షోభం కారణంగా అది ఆగిపోయింది. ప్రపంచ జనాభాలో మూడింట ఓ వంతు వాటా భారత్, చైనాదే ఉంది.
10/11
స్వలింగ వివాహాలపై (Same Sex Marriage) దాఖలైన పిటిషన్‌లపై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతున్న క్రమంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ అంశంపై అభిప్రాయాలేంటో చెప్పాలని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు లేఖ రాసింది. ఈ అంశంపై సుప్రీంకోర్టు విచారణను ఖండిస్తున్న కేంద్రం...ప్రొసీడింగ్స్‌లో రాష్ట్రాలనూ చేర్చాలని ధర్మాసనాన్ని కోరింది. అయితే...సుప్రీంకోర్టు మాత్రం ఇందుకు అంగీకరించలేదు. అందుకే వెంటనే కేంద్రం అలెర్ట్ అయ్యి అన్ని రాష్ట్రాలకూ లేఖలు పంపింది. ఆయా ప్రభుత్వాల అభిప్రాయాలేంటో తెలుసుకుని పూర్తి స్థాయి నివేదికను కోర్టులో సమర్పించనుంది. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనానికి ఇదే విషయాన్ని వెల్లడించింది కేంద్రం. ఈ విచారణలో రాష్ట్రాల అభిప్రాయాలూ కీలక పాత్ర పోషిస్తాయని కేంద్రం తేల్చి చెబుతోంది. సేమ్ సెక్స్ మ్యారేజ్ అనే అంశం రాష్ట్రాల చట్ట పరిధిలోనూ ఉంటుందని, అందుకే ప్రొసీడింగ్స్‌లో వాళ్లనూ చేర్చడం మంచిదని వివరిస్తోంది. దీనిపై ఓ
స్వలింగ వివాహాలపై (Same Sex Marriage) దాఖలైన పిటిషన్‌లపై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతున్న క్రమంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ అంశంపై అభిప్రాయాలేంటో చెప్పాలని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు లేఖ రాసింది. ఈ అంశంపై సుప్రీంకోర్టు విచారణను ఖండిస్తున్న కేంద్రం...ప్రొసీడింగ్స్‌లో రాష్ట్రాలనూ చేర్చాలని ధర్మాసనాన్ని కోరింది. అయితే...సుప్రీంకోర్టు మాత్రం ఇందుకు అంగీకరించలేదు. అందుకే వెంటనే కేంద్రం అలెర్ట్ అయ్యి అన్ని రాష్ట్రాలకూ లేఖలు పంపింది. ఆయా ప్రభుత్వాల అభిప్రాయాలేంటో తెలుసుకుని పూర్తి స్థాయి నివేదికను కోర్టులో సమర్పించనుంది. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనానికి ఇదే విషయాన్ని వెల్లడించింది కేంద్రం. ఈ విచారణలో రాష్ట్రాల అభిప్రాయాలూ కీలక పాత్ర పోషిస్తాయని కేంద్రం తేల్చి చెబుతోంది. సేమ్ సెక్స్ మ్యారేజ్ అనే అంశం రాష్ట్రాల చట్ట పరిధిలోనూ ఉంటుందని, అందుకే ప్రొసీడింగ్స్‌లో వాళ్లనూ చేర్చడం మంచిదని వివరిస్తోంది. దీనిపై ఓ "ఉమ్మడి అభిప్రాయం" ఏంటో తెలుసుకోవడం ముఖ్యమని చెప్పింది. అప్పటి వరకూ విచారణను వాయిదా వేయాలని ధర్మాసనాన్ని కోరింది. కానీ కోర్టు మాత్రం విచారణ కొనసాగిస్తామని స్పష్టం చేసింది.
11/11
భారతదేశంలో ఆపిల్ రిటైల్ స్టోర్స్‌ను ప్రారంభించారు ఆపిల్‌ సీఈవో టిమ్‌ కుక్‌ (Apple CEO Tim Cook). దీని కోసమే ఆయన నిన్న ఇండియా చేరుకున్నారు. ఆపిల్‌ ముంబై స్టోర్‌ను యాపిల్‌ బీకేసీగా (Apple BKC) పిలుస్తున్నారు. ముంబయిలోని ఖరీదైన బాంద్రా కుర్లా ప్రాంతంలో ఉన్న మాల్‌లో ఓ స్టోర్‌ దిల్లీ సాకేత్ ప్రాంతంలోని హై-ఎండ్ మాల్‌లో మరో స్టోర్‌ను ఆయన ప్రారంభించారు. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన, నాణ్యమైన ఆపిల్‌ ఉత్పత్తులను అమ్మే ఈ స్టోర్‌ను చాలా నిరాడంబరంగా ప్రారంభించారు. మేళతాళాలు, రిబ్బన్ కటింగ్స్‌ లాంటివేమీ పెట్టుకోలేదు. నలుపు రంగ టీ షర్ట్‌ వేసుకుని ఈ కార్యక్రమానికి వచ్చిన టిమ్‌ కుక్‌, సింపుల్‌గా బీకేసీ యాపిల్ స్టోర్‌ గేట్‌ను తెరిచి పట్టుకోవడంతో స్టోర్‌ లాంచ్‌ అయింది. వందలాది మంది ప్రజలు, ఆపిల్ అభిమానులు, అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ టూర్‌లో టిమ్‌ కుక్‌ ప్రధానమంత్రి నరేంద్రమోదీతోపాటు వివిధ పారిశ్రామిక దిగ్గజాలతో సమావేశమయ్యారు. బాలీవుడ్ నటి మాధురీ దీక్షిత్‌తో కలిసి వడ పావ్ తిన్నారు.

న్యూస్ ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

TTD Mumtaz Hotel : శ్రీవారి పాదాల చెంత ముంతాజ్ హోటల్ - జగన్ సర్కార్ అనుమతి - టీడీపీ ప్రభుత్వం రద్దు చేస్తుందా ?
శ్రీవారి పాదాల చెంత ముంతాజ్ హోటల్ - జగన్ సర్కార్ అనుమతి - టీడీపీ ప్రభుత్వం రద్దు చేస్తుందా ?
Target Revanth Reddy :  రేవంత్‌ను టార్గెట్ చేస్తే కాంగ్రెస్ బలహీనమైనట్లే -  పక్కా ప్లాన్ ప్రకారమే బీఆర్ఎస్ రాజకీయం !
రేవంత్‌ను టార్గెట్ చేస్తే కాంగ్రెస్ బలహీనమైనట్లే - పక్కా ప్లాన్ ప్రకారమే బీఆర్ఎస్ రాజకీయం !
Chandrababu Skill Case: స్కిల్ కేసులో కొత్త సంచలనం - డీజీపీకి పీవీ రమేష్ లేఖ - ఫేక్ కేసులో ఎవరెవరు ఇరుక్కుంటారు ?
స్కిల్ కేసులో కొత్త సంచలనం - డీజీపీకి పీవీ రమేష్ లేఖ - ఫేక్ కేసులో ఎవరెవరు ఇరుక్కుంటారు ?
Revanth Reddy: కేసీఆర్ అనే మొక్కను మళ్లీ మొలకెత్తనివ్వం, రాసి పెట్టుకోండి- వరంగల్ సభలో రేవంత్ రెడ్డి సంచలనం
కేసీఆర్ అనే మొక్కను మళ్లీ మొలకెత్తనివ్వం, రాసి పెట్టుకోండి- వరంగల్ సభలో రేవంత్ రెడ్డి సంచలనం
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

వీడియోలు

Marquee players list IPL 2025 Auction | ఐపీఎల్ వేలంలో ఫ్రాంచైజీల చూపు వీరి మీదే | ABP DesamRishabh pant IPL 2025 Auction | స్పైడీ రిషభ్ పంత్ కొత్త రికార్డులు సెట్ చేస్తాడా.? | ABP DesamRishabh Pant Border Gavaskar Trophy Heroics | ఒక్క ఇన్నింగ్స్ తో టెస్ట్ క్రికెట్ క్రేజ్ మార్చేశాడుPujara Great Batting at Gabba Test | బంతి పాతబడటం కోసం బాడీనే అడ్డం పెట్టేశాడు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TTD Mumtaz Hotel : శ్రీవారి పాదాల చెంత ముంతాజ్ హోటల్ - జగన్ సర్కార్ అనుమతి - టీడీపీ ప్రభుత్వం రద్దు చేస్తుందా ?
శ్రీవారి పాదాల చెంత ముంతాజ్ హోటల్ - జగన్ సర్కార్ అనుమతి - టీడీపీ ప్రభుత్వం రద్దు చేస్తుందా ?
Target Revanth Reddy :  రేవంత్‌ను టార్గెట్ చేస్తే కాంగ్రెస్ బలహీనమైనట్లే -  పక్కా ప్లాన్ ప్రకారమే బీఆర్ఎస్ రాజకీయం !
రేవంత్‌ను టార్గెట్ చేస్తే కాంగ్రెస్ బలహీనమైనట్లే - పక్కా ప్లాన్ ప్రకారమే బీఆర్ఎస్ రాజకీయం !
Chandrababu Skill Case: స్కిల్ కేసులో కొత్త సంచలనం - డీజీపీకి పీవీ రమేష్ లేఖ - ఫేక్ కేసులో ఎవరెవరు ఇరుక్కుంటారు ?
స్కిల్ కేసులో కొత్త సంచలనం - డీజీపీకి పీవీ రమేష్ లేఖ - ఫేక్ కేసులో ఎవరెవరు ఇరుక్కుంటారు ?
Revanth Reddy: కేసీఆర్ అనే మొక్కను మళ్లీ మొలకెత్తనివ్వం, రాసి పెట్టుకోండి- వరంగల్ సభలో రేవంత్ రెడ్డి సంచలనం
కేసీఆర్ అనే మొక్కను మళ్లీ మొలకెత్తనివ్వం, రాసి పెట్టుకోండి- వరంగల్ సభలో రేవంత్ రెడ్డి సంచలనం
Maharashtra Assembly Election 2024: మహారాష్ట్రలో కొనసాగుతున్న పోలింగ్- ఈ ప్రాంతాలపైనే పార్టీల ఫోకస్
మహారాష్ట్రలో కొనసాగుతున్న పోలింగ్- ఈ ప్రాంతాలపైనే పార్టీల ఫోకస్
Weather Today: తెలుగు రాష్ట్రాల్లో భారీగా పడిపోయిన ఉష్ణోగ్రతలు- 23 బంగాళాఖాతంలో అల్పపీడనం
తెలుగు రాష్ట్రాల్లో భారీగా పడిపోయిన ఉష్ణోగ్రతలు- 23 బంగాళాఖాతంలో అల్పపీడనం
AP News: ఫ్యామిలీ మొత్తం ఊరెళ్తున్నారా ? తక్షణం ఈ పని చేస్తే మీ ఇల్లు సేఫ్
ఫ్యామిలీ మొత్తం ఊరెళ్తున్నారా ? తక్షణం ఈ పని చేస్తే మీ ఇల్లు సేఫ్
AR Rahman Divorce: విడాకులు తీసుకున్న ఏఆర్ రెహమాన్ దంపతులు, నిర్ణయం ప్రకటించిన సైరా బాను
విడాకులు తీసుకున్న ఏఆర్ రెహమాన్ దంపతులు, నిర్ణయం ప్రకటించిన సైరా బాను
Embed widget