అన్వేషించండి
Gunde Ninda Gudi Gantalu March 17th Episode Highlights: బాలుకి మళ్లీ అవమానం.. ఇక భరించలేక విశ్వరూపం చూపించిన మీనా - గుండె నిండా గుడి గంటలు మార్చి 17 ఎపిసోడ్ హైలెట్స్!
Gunde Ninda Gudi Gantalu March 17th Episode: చెల్లెలి వేడుక కోసం బాలు 24 గంటలు డ్రైవింగ్ చేసి డబ్బులు సమకూరుస్తాడు. మౌనిక అత్తింటివారు మాత్రం బాలు ఇంట్లో ఉండకూడదంటారు. ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే

Gunde Ninda Gudi Gantalu March 17th Episode Highlights
1/8

మౌనిక తాళి మార్చే ఫంక్షన్ ప్లాన్ చేస్తారు తల్లిదండ్రులు ప్రభావతి-సత్యం. ఇదే విషయం మౌనిక అత్తింటివారికి చెబుతారు. వాళ్లు బాలు ఇంట్లో ఉండకూడదనే కండిషన్ పెడతారు
2/8

మౌనిక ఫంక్షన్ కి అవసరం అయిన డబ్బులన్నీ బాలు సమకూరుస్తాడు. రాత్రి పగలు డ్రైవింగ్ చేసి తీసుకొచ్చి ఇస్తాడు. మీనా కూడా పూలుఅమ్మి సంపాదించిన డబ్బులు ఇచ్చేస్తుంది. రెస్ట్ లేకుండా బాలు తిరుగుతున్నాడని బాధపడుతుంది.
3/8

బాలు ఇంట్లో ఉండకూడదని మౌనిక అత్తింటివారు పెట్టిన కండిషన్ గురించి బాలుతో చెప్పమని ప్రభావతి అంటుంది. మొత్తం బాధ్యత మోస్తున్నవాడికి ఆ మాట ఎలా చెప్పాలని బాధపడతాడు తండ్రి సత్యం..
4/8

మార్చి 17 ఎపిసోడ్ లో ఫంక్షన్ హడావుడి ఓ వైపు జరుగుతుంటే..కాకినాడ వెళ్లి గుడిలో పూజ చేసుకుని రమ్మంటుంది ప్రభావతి. నేను ఇక్కడే ఉంటాను వెళ్లను అంటాడు బాలు
5/8

అత్తింట్లో జరుగుతున్న అవమానాలు పుట్టింట్లో చెప్పలేక, మానలేక తనలో తానే కుమిలిపోతుంటుంది మౌనిక. కన్నవారి ముందు భర్త, మావయ్య ఆడుతున్న నాటకాన్ని బయటపెట్టలేకపోతుంది
6/8

నువ్వు ఇంట్లో ఉండకూడదు అనే కండిషన్ మౌనిక అత్తింటివారు పెట్టారనే విషయం అప్పుడు బయటపడతుంది. ఆ విషయం మీ నాన్నకి కూడా తెలుసు అని ఇరికించేస్తుంది.
7/8

బాధపడిన బాలు..మీరు ఆ మాట చెప్పి ఉంటే మౌనిక వేడుక జరుగుతున్నంతసేపూ ఏ చెట్టుకిందో కూర్చునేవాడిని కదా అని బాధపడతాడు బాలు..
8/8

అప్పటివరకూ అన్నీ భరించిన మీనా.. భర్తకు మరింత అవమానం జరుగుతుంటే తట్టులేకపోతుంది. మౌనిక ఫంక్షన్ కోసం ఇంత కష్టపడి సంపాదించిన మీ కొడుకు మీకు అవసరం లేదని ఫైర్ అవుతుంది..
Published at : 16 Mar 2025 12:21 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్
సినిమా
ఐపీఎల్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion