అన్వేషించండి
Venkatesh Daughter Marriage: వెంకటేష్ రెండో కూతురి పెళ్లిలో మహేష్ కూతురు సితార సందడి - ఫోటోలు చూశారా?
వెంకటేష్ రెండో అమ్మాయి హయవాహిని పెళ్లి ఈ రోజు అతి కొద్ది మంది బంధుమిత్రులు, ప్రముఖుల మధ్యలో జరగనుంది. పెళ్లికి ముందు సంగీత్, మెహందీ వేడుకలకు మహేష్ భార్య నమ్రత, కుమార్తె సితార అటెండ్ అయ్యారు.

Venkatesh daughter Hayavahini marriage photos: వెంకటేష్ కుమార్తె హయవాహిని సంగీత్, మెహందీ వేడుకలో మహేష్ భార్య నమ్రత, కుమార్తె సితార సందడి చేశారు. ఆ ఫోటోలు చూడండి. (Image Courtesy: namratashirodkar / Instagram)
1/5

టాలీవుడ్ టాప్ హీరోలలో ఒకరైన విక్టరీ వెంకటేష్ ఇంటిలో పెళ్లి బాజాలు మోగాయి. ఆయన రెండో కుమార్తె హయవాహిని పెళ్లి మార్చి 15న (శుక్రవారం) హైదరాబాద్ సిటీలో జరుగుతోంది. ఈ వివాహ వేడుకకు అతికొద్ది మంది బంధుమిత్రులు, సినీ ప్రముఖులు మాత్రమే హాజరు కానున్నారని తెలిసింది. పెళ్లికి ముందు రోజు సంగీత్, మెహందీ వేడుకలు జరిగాయి. వాటిలో సూపర్ స్టార్ మహేష్ బాబు భార్య నమ్రత, కుమార్తె సితార ఘట్టమనేని సందడి చేశారు. ఆ ఫోటోలు చూడండి. (Image Courtesy: namratashirodkar / Instagram)
2/5

'నూతన వధూవరులు జీవితాంతం సంతోషంగా కలిసి ఉండాలి. ఫ్రెండ్స్, ఫ్యామిలీతో మెహందీ రోజు మంచి టైమ్ స్పెండ్ చేశాం' అని నమ్రతా శిరోద్కర్ ఈ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. (Image Courtesy: namratashirodkar / Instagram)
3/5

నమ్రతతో పాటు కుమార్తె సితార ఘట్టమనేని సైతం హయవాహిని మెహందీ వేడుకలో సందడి చేశారు. ప్రజెంట్ సోషల్ మీడియాలో ఈ ఫోటోలు చక్కర్లు కొడుతున్నాయి. సితార స్పెషల్ ఎట్రాక్షన్ అయ్యారని ఫ్యాన్స్ కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు. (Image Courtesy: namratashirodkar / Instagram)
4/5

తల్లీ కుమార్తెలు నమ్రతా శిరోద్కర్ మహేష్, సితార ఘట్టమనేని (Image Courtesy: namratashirodkar / Instagram)
5/5

వెంకటేష్ రెండో కుమార్తె హయవాహిని మెహందీ వేడుకలో స్నేహితులతో నమ్రతా మహేష్ (Image Courtesy: namratashirodkar / Instagram)
Published at : 15 Mar 2024 03:58 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
అమరావతి
విజయవాడ
న్యూస్
హైదరాబాద్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion