అన్వేషించండి
In Pics: పడి లేచిన కెరటం మా బాబాయ్, పిఠాపురంలో వరుణ్ తేజ్ - ఫోటోలు
Varun Tej in Pithapuram: పవన్ కల్యాణ్ అన్న నాగబాబు కుమారుడు వరుణ్ తేజ్ పిఠాపురంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. వివిధ గ్రామాల్లో కలయతిరుగుతూ రోడ్ షో నిర్వహించారు.

వరుణ్ తేజ్
1/8

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలుపు కోసం సినీ సెలబ్రిటీలు క్యూ కడుతున్నారు.
2/8

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలుపునకే అత్యధిక అవకాశాలు ఉన్నాయని సర్వేలు చెబుతున్నాయి. అయినా సినీ ప్రముఖులు ఆయన కోసం రంగంలోకి దిగుతున్నారు.
3/8

తాజాగా పవన్ కల్యాణ్ అన్న నాగబాబు కుమారుడు వరుణ్ తేజ్ పిఠాపురంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.
4/8

తన బాబాయి పవన్ కల్యాణ్ కోసం వరుణ్ తేజ్ రోడ్ షో నిర్వహించారు.
5/8

గొల్లప్రోలు మండల పరిధిలోని పలు గ్రామాల్లో వరుణ్ తేజ్ శనివారం నాడు భారీ రోడ్ షో నిర్వహించారు.
6/8

పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురాన్ని మెగా ఫ్యామిలీ మొత్తం సొంత ఊరుగా చేసుకుంటామని వరుణ్ తేజ్ తెలిపారు.
7/8

‘‘పిఠాపురం నియోజకవర్గం అభివృద్ధి కోసం పవన్ కళ్యాణ్ చాలా గొప్ప విజన్ తో వస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా పిఠాపురం నియోజకవర్గం ప్రజలను స్వంత కుటుంబ సభ్యులుగా చూసుకుంటారు’’ అని వరుణ్ తేజ్ మాట్లాడారు.
8/8

తాటిపర్తిలో శ్రీ అపర్ణాదేవి అమ్మవారి ఆలయాన్ని వరుణ్ తేజ్ సందర్శించి అమ్మవారి ఆశీస్సులు తీసుకున్నారు.
Published at : 28 Apr 2024 08:57 AM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
అమరావతి
సినిమా
ఎడ్యుకేషన్
సినిమా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion