White House Facts: అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్ గురించి ఈ ఆసక్తికర విషయాలు తెలుసా ?
US Election Results 2024: అమెరికా అధ్యక్షుడిగా డోనాల్ట్ ట్రంప్ గెలిచారు. ఇక వైట్ హౌస్ లో ప్రవేశం మిగిలి ఉంది. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన భవనం వైట్ హౌస్ లో త్వరలో మరోసారి అడుగు పెట్టనున్నారు.
The White House USA | అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రాటిక్ అభ్యర్థి కమలా హారిస్ పై రిపబ్లికన్ పార్టీ నేత డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించి మరోసారి అగ్రరాజ్యానికి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. అమెరికా అధ్యక్షుడి పేరు చెప్పగానే మనకు గుర్తొచ్చేది ద వైట్ హౌస్ లేదా శ్వేతభవనం. ఈ పేరు మనం తరచూ వింటుంటాం. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన దేశమైన అమెరికా ప్రెసిడెంట్ నివాస, కార్యాలయం వైట్ హౌస్. ఇక్కడి నుండే అమెరికన్ ప్రెసిడెంట్ కీలకమైన నిర్ణయాలన్నీ తీసుకుంటారు. అమెరికాకు సంబంధించినవైనా, ఇతర దేశాలకు సంబంధించిన నిర్ణయాలు ఇక్కడే జరుగుతాయి. ఎన్నో ముఖ్యమైన సమావేశాలకు ఇది వేదిక. ప్రపంచ దేశాల నేతలతో కీలక చర్చలకు వైట్ హౌస్ ఓ సాక్షి. ఎన్నో ప్రపంచ పరిణామాలకు సంబంధించిన ఎన్నో రహస్యాలు ఈ వైట్ హౌస్ గోడలకు తెలుసంటే అతిశయోక్తి కాదు. ఇంతటి ప్రాముఖ్యమైన వైట్ హౌస్ చరిత్ర ఏంటో ఇప్పుడు చూద్దాం.
వైట్ హౌస్ చరిత్ర ఇదే...
అమెరికా అధ్యక్షుడి నివాస, కార్యాలయ భవనం ఈ వైట్ హౌస్. ఈ భవన నిర్మాణం 1792లో ప్రారంభమై 1800 నాటికి పూర్తి అయింది. జేమ్స్ హోబన్ అనే ఐరిష్ ఆర్కిటెక్ దీన్ని రూపొందించారు. నియో క్లాసికల్ పద్ధతిలో ఈ శ్వేత భవనాన్ని నిర్మించారు. 18 ఎకరాల్లో నిర్మించిన ఈ పురాతన భవనం, వాషింగ్టన్ డీసీ 1600 పెన్సిల్వేనియా అవెన్యూలో ఉంది. ఇది మేరీ ల్యాండ్, వర్జినియీ రాష్ట్రాల మధ్య ఉంది. ఈ ప్రాంతం పోటామాక్ నదీ సమీపంలో ఉంది. దీన్ని ఎంపిక చేసింది అమెరికా తొలి అధ్యక్షుడు అయిన జార్జ్ వాషింగ్టన్. కానీ ఆయన వైట్ హౌస్ లో మాత్రం నివసించలేదు. ఆయన 1789 నుంచి 1797 వరకు అమెరికాకు అధ్యక్షుడిగా పని చేశారు. ఈ నిర్మాణం 1800 సంవత్సరంలో పూర్తయింది.
అమెరికా రెండో అధ్యక్షుడు జాన్ ఆడమ్స్ (1797- 1801) వైట్ హౌస్ లో నివాసమున్న తొలి అధ్యక్షుడిగా రికార్డులకు ఎక్కారు. ఆ తర్వాత వచ్చిన ధామస్ జెఫర్సన్, అబ్రహాం లింకన్, ధియోడర్ రూజ్ వెల్ట్, ఫ్రాంక్లిన్ డి. రూజ్ వెల్ట్, జాన్ ఎప్. కెనడీ, రిచర్డ్ నిక్సన్, జార్జిబుష్, బిల్ క్లింటన్, బరాక్ ఒబామా, డోనాల్డ్ ట్రంప్, జో బైడెన్ వంటి అధ్యక్షులు ఇక్కడ నివాసం ఉన్న వారిలో ముఖ్యులు. గెలిచిన ప్రతి అమెరికా అధ్యక్షుడు ఇక్కడే నివాసం ఉండటం ఓ సంప్రదాయంగా మారింది. ప్రతీ అధ్యక్షుడి కాలంలో అమెరికాలోను, ప్రపంచం రాజకీయాలకు సంబంధించిన కీలక చర్చలు, నిర్ణయాలకు ఈ భవనం వేదికయింది.
వైట్ హౌస్ విశిష్టతలు ఇవే..
ఈ శ్వేత భవనంలో ఆరు ఫ్లోర్లు ఉన్నాయి. 16 ఫ్యామిలీ గెస్ట్ రూంలు ( 132 గదులు), 35 బాత్రూంలు, 28 పైర్ ప్లెసెస్, 8 స్టెయిర్ కేస్ లు, మూడు ఎలివేటర్స్, 412 డోర్లు, 147 కిటికీలు, అన్ని సౌకర్యాలతో కూడిన అతిపెద్ద కిచెన్, 1000 మంది సందర్శకులకు సైతం భోజనం పెట్టే స్థాయి కిచెన్ శ్వేత భవనంలో ఉంది. ప్రతీ నాలుగు నుంచి ఆరేళ్ల వ్యవధిలో ఈ భవనానికి రంగు వేస్తారు. దీని కోసం 570 గ్యాలన్ల పెయింట్ వాడతారంటే నమ్ముతారా.. ఇంతటి గొప్ప విశేషాలు ఈ భవనానికి ఉన్నాయి.
ఆ శ్వేత భవనంలో ఇండోర్ , అవుట్ డోర్ స్విమ్మింగ్ ఫూల్స్ ఉన్నాయి. ఇండోర్ స్విమ్మింగ్ పూల్ ను ఫ్రాంక్లిన్ డి. రూజ్ వెల్ట్ ఏర్పాటు టేస్తే, అవుడ్ డోర్ స్విమ్మింగ్ ఫూల్ ను గెరాల్డ్ ఆర్. ఫోర్డ్ నిర్మించారు. వీటితో పాటు టెన్నిస్ కోర్ట్, చిన్న మూవీ ధియెటర్, గేమ్ రూం, జాగింగ్ ట్రాక్ వంటి సదుపాయాలు అమెరికా అధ్యక్ష భవనంలో ఉన్నాయి. అయితే ఇందులో అనేక రహస్య గదులు ఉన్నాయన్న ప్రచారం ఉంది. అయితే వైట్ హౌస్ హిస్టారికల్ అసోషియేషన్ వారు చెప్పిందేంటంటే అధ్యక్షుడి ప్రాణాలకు ప్రమాదం ఉంటే అక్కడి నుంచి బయటపడటానికి రహస్య మార్గాలు ఉన్నాయని మాత్రమే చెప్పారు. అండర్ గ్రౌండ్ టన్నెల్స్ ఉన్నాయని, అమెరిక్ ప్రెసిడెంట్ ఎమర్జెన్సీ ఎగ్జిట్ గా వీటిని వాడటానికి ఏర్పాటు చేశారని వివిధ ప్రముఖ పత్రికలు ఈ శ్వేత భవనం గురించి ప్రస్తావించాయి.
Also Read: Donald Trump: మ్యాజిక్ మార్క్ దాటేసిన ట్రంప్ - కౌంటింగ్ కొనసాగుతున్న రాష్ట్రాల్లోనూ ఆధిక్యం
వైట్ హౌస్ అనే పేరు ఎందుకు వచ్చింది..
వైట్ హౌస్ నిర్మాణంలో వాస్తవానికి తెల్ల రాయిని వాడలేదు. ఈ కట్టడంలో ప్రధానంగా వినియోగించిన రాయి పేరు ఆక్వా క్రీక్ శాండ్ స్టోన్. ఇది వాషింగ్టన్ డీసీకి దగ్గరలో ఉండే అక్వియా క్రీక్ నుంచి తీసుకున్నారు. ఈ రాయి తెలుపుగా కనిపించినా ఇది పూర్తిగా తెల్లటి రాయి ఏ మాత్రం కాదు. ఇది కొన్ని ప్రాంతాల్లో తెల్లగాను, మరి కొన్ని ప్రాంతాల్లో గోధుమ రంగులో కనిపిస్తుంది. అయితే ఈ రాయిని వాడటం వల్ల వైట్ హౌస్ అనే పేరు స్థిరపడిందని చెప్పాలి. కానీ ఇది పూర్తి తెల్లటి రంగు రాయి మాత్రం కాదు.
కట్టడం పూర్తయిన సమయం 1800 కాలంలో దీన్ని వైట్ హౌస్ గా ఎవరూ పిలవలేదు. దీన్ని అమెరిక్ ప్రెసిడెంట్ హౌస్, ఎగ్జిక్యూటీవ్ మాన్సన్ గా పిలిచేవారు. అమెరికా నాల్గవ అధ్యక్షుడు అయిన జెమ్స్ మాడిసన్ పాలనా కాలంలో దీనికి వైట్ హౌస్ అన్న పేరు ప్రాచుర్యం పొందింది. అయితే ఈ పేరు హెన్రీ. ఎస్. ట్రెంట్ అనే పత్రికా రచయత తన వ్యాసాల్లో రాయడం ద్వారా ప్రాచుర్యం పొందినట్లు చరిత్ర చెబుతోంది. ఇక వైట్ హౌస్ అన్న పేరు 1801 నుండి 1809 వరకు అమెరికా అధ్యక్షుడిగా ఉన్న ధామస్ జెఫర్సన్ కాలంలో అత్యంత ప్రాచుర్యంలోకి వచ్చింది. అప్పటి నుండి వైట్ హౌస్ గా ఇది ప్రపంచ వ్యాప్తంగా ఫేమస్ అయింది.
Also Read: గెలిచింది ట్రంప్ - గెలిపించింది మస్క్ -అమెరికా రాజకీయాల్లో కొత్త సూపర్ స్టార్