లవర్స్ మధ్య గొడవ, కాసేపటికి బిల్డింగ్ కింద శవాలు
విశాఖ గాజువాక షీలానగర్ లో ప్రేమజంట ప్రాణాలు తీసుకున్న ఘటన స్థానికంగా కలకలం రేపింది. వెంకటేశ్వర కాలనీలో S.L. బినాయక్ క్లేవ్ అపార్ట్మెంట్ తెల్లవారుజామున బిల్డింగ్ పై నుండి కిందకు దూకి యువతి, యువకుడు బలవర్మరణానికి పాల్పడ్డారు. వారిని అమలాపురంకు చెందిన పిల్లి దుర్గారావు, సాయి సుస్మితగా పోలీసులు గుర్తించారు. మృతుడు దుర్గారావు క్యాటరింగ్ నడుపుతుండగా, మృతురాలు సాయి సుష్మిత ఒక ప్రైవేట్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పని చేస్తున్నట్టు స్థానికులు చెబుతున్నారు. ఆరు నెలలుగా అపార్ట్మెంట్లో ఉంటున్న పిల్లి దుర్గరావు వద్దకి అప్పుడప్పుడు అపార్ట్మెంట్ కు వచ్చి మృతురాలు సాయి సుస్మిత వచ్చి వెళ్తునట్టు సమాచారం. పోలీసులు ప్రాథమిక వివరాలు వెల్లడించారు. మృతులు ఇరువురు మధ్య వాగ్వాదం జరిగినట్టు గుర్తించిన పోలీసులు, ఇంట్లో గాజు గ్లాస్, టీవీ రిమోట్ పగిలిపోవడం గుర్తించారు. గొడవ కారణంగానే చనిపోయి ఉంటారని ప్రాథమికంగా భావిస్తున్నారు.