అన్వేషించండి

Donald Trump: మ్యాజిక్ మార్క్ దాటేసిన ట్రంప్ - కౌంటింగ్ కొనసాగుతున్న రాష్ట్రాల్లోనూ ఆధిక్యం

America: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ మ్యాజిక్ మార్క్‌ను దాటారు. కౌంటింగ్ జరుగుతున్న రాష్ట్రాల్లోనూ ఆయనకే ఆధిక్యం కనిపిస్తోంది.

Trump crossed the magic mark in the US presidential election:  అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ మ్యాజిక్ ఫిగర్ ను దాటేశారు.  విస్కాన్సిన్ గెలుపుతో మ్యాజిక్‌ ఫిగర్ దాటిన ట్రంప్ ట్రంప్‌కు 277, కమలా హారిస్‌కు 224 ఎలక్టోరల్ ఓట్లు వచ్చాయి.  అమెరికాకు రెండోసారి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టబోతున్నారు. ఇప్పటికీ కౌంటింగ్ జరుగుతున్న రాష్ట్రాల్లో ఆయన ఆధిక్యంలో కొనసాగుతున్నారు. 

ట్రంప్‌ కు మద్దతుగా ఓటేసిన రాష్ట్రాలు - వాటికి ఉన్న ఎలక్టోరల్ ఓట్లు 

అలబామా 9, ఆర్కాన్సాస్‌ 6, ఫ్లోరిడా 30, జార్జియా 16, అయోవా 6, ఐడహో 4, ఇండియానా 11, కాన్సస్‌ 6, కెంటకీ 8, లూసియానా 8, మైన్‌ 1, మిస్సోరి 10, మిసిసిపి 6, మోంటానా 4, నార్త్‌ కరోలినా 16, నార్త్‌ డకోటా 3, నెబ్రాస్కా 4, ఒహాయో 17,  ఓక్లహోమా 7, పెన్సిల్వేనియా 19, సౌత్‌ కరోలినా 9, సౌత్‌ డకోటా 3, టెన్నెసీ 11, టెక్సాస్‌ 40, యుటా 6, వెస్ట్‌ వర్జీనియా 4,వయోమింగ్‌  3, విస్కాన్సిన్‌ 10

కమలా హ్యారిస్‌కు  మద్దతుగా ఓటేసిన రాష్ట్రాలు - వాటికి ఉన్న ఎలక్టోరల్ ఓట్లు 

కాలిఫోర్నియా 54, కొలరాడో 10, కనెక్టికట్‌ 7, డీసీ 3, డెలవేర్‌ 3, హవాయి 4, ఇల్లినోయీ 19, మసాచుసెట్స్‌ 11, మేరీల్యాండ్‌ 10, మైన్‌ 1, మిన్నెసోటా 10, నెబ్రస్కా 1, న్యూహ్యాంప్‌షైర్‌ 4, న్యూజెర్సీ 14, న్యూమెక్సికో 5, న్యూయార్క్‌ 28, ఓరెగాన్‌ 8, రోడ్‌ ఐల్యాండ్‌ 4, వర్జినియా 13, వెర్మాంట్‌ 3, వాషింగ్టన్‌ 12

కౌంటింగ్ జరుగుతున్న రాష్ట్రాల్లో ట్రంప్ ఆధిక్యం

అరిజోనా, నెవెడా, అలస్కా, మిచిగాన్ వంటి రాష్ట్రాల్లో కౌంటింగ్ కొనసాగుతోంది.అక్కడ కూడా రిపబ్లికన్ అభ్యర్థికి మెజార్టీ పాపులర్ ఓట్లు వస్తున్నాయి. దీంతో ఆయన మెజార్టీ మరింతపెరగడం ఖాయంగా కనిపిస్తోంది.                      

గెలిచింది ట్రంప్ - గెలిపించింది మస్క్ -అమెరికా రాజకీయాల్లో కొత్త సూపర్ స్టార్

రికార్డులు సృష్టించిన ట్రంప్                          
 
రెండు దశాబ్దాల తర్వాత పాపులర్‌ ఓటింగ్‌తో రిపబ్లికన్‌ అభ్యర్థి ట్రంప్‌ విజయం సాధించారు.  2004 ఎన్నికల్లో రిపబ్లికన్‌ అభ్యర్థి జార్జ్‌ బుష్‌ 62,040,610 ఓట్లతో 286 ఎలక్టోరల్‌ దక్కించుకున్నారు.  డెమోక్రటిక్‌ అభ్యర్థి జాన్‌ కెర్రీకి 59,028,444 ఓట్లతో 251 ఎలక్టోరల్‌ ఓట్లు వచ్చాయి. ఇప్పుడు ట్రంప్‌ మళ్లీ ఆ ఘనత సాధించారు.మామూులుగా పాపులర్ ఓట్లు ఎక్కువగా డెమెక్రాట్స్‌ కు వస్తూంటాయి. వరుసగా కాకుండా  ఓ సారి గ్యాప్ వచ్చిన తర్వాత మరోసారి అధ్యక్షుడిగా ఎన్నికైన రెండో వ్యక్తి ట్రంప్.  1885 అమెరికా ఎన్నికల్లో గ్రోవర్‌ క్లీవ్‌లాండ్‌ అధ్యక్షుడిగా నెగ్గారు. అయితే మళ్లీ ఒక టర్మ్‌ ముగిశాక.. అంటే 1893 ఎన్నికల్లోనూ గ్రోవర్‌ ప్రెసిడెంట్‌గా విజయం సాధించారు. అమెరికాకు 45వ అధ్యక్షుడిగా పని చేసిన ట్రంప్‌  ఒక టర్మ్‌ గ్యాప్‌ తర్వాత ఇప్పుడు మళ్లీ  గెలిచారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఎన్ని సార్లు అయినా పోటీ చేయవచ్చు కానీ రెండు సార్లు మాత్రమే అధ్యక్ష పదవి చేపట్టడానికి అర్హులు. మూడో సారి అధ్యక్ష పదవి చేపట్టడానికి రాజ్యాంగం అనుమతించదు.         

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ గెలుపు వెనుక ఉష- తమిళ అమ్మాయిని ఓడించిన తెలుగమ్మాయి!

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Vizianagaram MLC: విజయనగరం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక లేనట్లే - రఘురాజు అనర్హత రద్దు చేసిన హైకోర్టు
విజయనగరం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక లేనట్లే - రఘురాజు అనర్హత రద్దు చేసిన హైకోర్టు
AP Cabinet: ల్యాండ్ గ్రాబింగ్ ప్రొహిబిషన్ బిల్లుకు ఆమోదం - ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలివే!
ల్యాండ్ గ్రాబింగ్ ప్రొహిబిషన్ బిల్లుకు ఆమోదం - ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలివే!
Honor X9c: 108 మెగాపిక్సెల్ కెమెరాతో హానర్ కొత్త ఫోన్ - ధర ఎంతంటే?
108 మెగాపిక్సెల్ కెమెరాతో హానర్ కొత్త ఫోన్ - ధర ఎంతంటే?
US New President Donald Trump: మిత్రమా! ప్రజల కోసం కలిసి పని చేద్దాం; ట్రంప్‌నకు మోదీ ట్వీట్, ప్రపంచవ్యాప్తంగా శుభాకాంక్షల వెల్లువ
మిత్రమా! ప్రజల కోసం కలిసి పని చేద్దాం; ట్రంప్‌నకు మోదీ ట్వీట్, ప్రపంచవ్యాప్తంగా శుభాకాంక్షల వెల్లువ
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Usha Vance Chilukuri on Donald Trump Win | US Elections 2024 లో ట్రంప్ గెలుపు వెనుక తెలుగమ్మాయిDonald Trump Won US Elections 2024 | అధికారం కోసం అణువణువూ శ్రమించిన ట్రంప్ | ABP DesamDonald Trump Going to be Win US Elections 2024 | అధ్యక్ష ఎన్నికల్లో విజయానికి చేరువలో ట్రంప్ | ABPవీడియో: మా ఇంటికి దేవుడు వచ్చి టీ చేసిచ్చాడు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vizianagaram MLC: విజయనగరం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక లేనట్లే - రఘురాజు అనర్హత రద్దు చేసిన హైకోర్టు
విజయనగరం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక లేనట్లే - రఘురాజు అనర్హత రద్దు చేసిన హైకోర్టు
AP Cabinet: ల్యాండ్ గ్రాబింగ్ ప్రొహిబిషన్ బిల్లుకు ఆమోదం - ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలివే!
ల్యాండ్ గ్రాబింగ్ ప్రొహిబిషన్ బిల్లుకు ఆమోదం - ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలివే!
Honor X9c: 108 మెగాపిక్సెల్ కెమెరాతో హానర్ కొత్త ఫోన్ - ధర ఎంతంటే?
108 మెగాపిక్సెల్ కెమెరాతో హానర్ కొత్త ఫోన్ - ధర ఎంతంటే?
US New President Donald Trump: మిత్రమా! ప్రజల కోసం కలిసి పని చేద్దాం; ట్రంప్‌నకు మోదీ ట్వీట్, ప్రపంచవ్యాప్తంగా శుభాకాంక్షల వెల్లువ
మిత్రమా! ప్రజల కోసం కలిసి పని చేద్దాం; ట్రంప్‌నకు మోదీ ట్వీట్, ప్రపంచవ్యాప్తంగా శుభాకాంక్షల వెల్లువ
Vasamsetti Subhash: చంద్రబాబు తిడతారు, అవసరమైతే కొడతారు: తనకు సీఎం క్లాస్‌పై మంత్రి వాసంశెట్టి సుభాష్‌
చంద్రబాబు తిడతారు, అవసరమైతే కొడతారు: తనకు సీఎం క్లాస్‌పై మంత్రి వాసంశెట్టి సుభాష్‌
AP DSC 2024: ఏపీలో నిరుద్యోగులకు షాక్, 'మెగా డీఎస్సీ' ప్రకటనను వాయిదా వేసిన విద్యాశాఖ, కారణమిదేనా!
ఏపీలో నిరుద్యోగులకు షాక్, 'మెగా డీఎస్సీ' ప్రకటనను వాయిదా వేసిన విద్యాశాఖ, కారణమిదేనా!
US Election Elon Musk: గెలిచింది ట్రంప్ - గెలిపించింది మస్క్ -అమెరికా రాజకీయాల్లో కొత్త సూపర్ స్టార్
గెలిచింది ట్రంప్ - గెలిపించింది మస్క్ -అమెరికా రాజకీయాల్లో కొత్త సూపర్ స్టార్
Allu Arjun: అల్లు అర్జున్‌కు భారీ ఊరట- నంద్యాల కేసు కొట్టేసిన హైకోర్టు 
అల్లు అర్జున్‌కు భారీ ఊరట- నంద్యాల కేసు కొట్టేసిన హైకోర్టు 
Embed widget