రెండుగా వీడిపోయిన గూడ్స్ ట్రైన్, అలాగే వెళ్లిపోయిన లోకోపైలట్
Mahabubabad Goods Train Incident: గూడ్స్ రైలు (Goods Train Link) లింక్ తెగిపోయి రెండుగా విడిపోయిన సంఘటన మహబూబాబాద్ రైల్వే స్టేషన్ (Mahabubabad Railway Station) దగ్గర్లో జరిగింది. గూడ్స్ రైలు రెండుగా విడిపోయిన విషయాన్ని గమనించిన రైలు గార్డు లోకో పైలట్ ను అప్రమత్తం చేయడంతో రైలును వెంటనే నిలిపివేశారు. సమాచారం తెలుసుకొని రైల్వే ఉన్నతాధికారులు సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని విడిపోయిన గూడ్స్ ఇంజన్ ను వెనక్కి రప్పించి మూడు బోగీలను జత చేసి మరమ్మతులు చేపట్టారు. అంతరం రైలును అక్కడి నుంచి పంపారు. గూడ్స్ రైలు ఖాలీగా డోర్నకల్ రైల్వే స్టేషన్ నుండి కాజీపేట కు వెళ్తున్న క్రమంలో ఈ ఘటన చోటుచేసుకుంది. రైలు రెండుగా విడిపోవడంతో 45 నిమిషాలపాటు నిలిచింది. ఎగువ మార్గంలో వెళ్ళాల్సిన పలు రైలు ఆలస్యంగా నడిచాయి. దీంతో ప్రయాణికులు కొంత ఇబ్బందులు పడ్డారు.