అన్వేషించండి

Maharashtra Govt Formation: మహరాష్ట్ర ప్రభుత్వంలో బీజేపీకి 17 మంత్రి పదవులు, షిండే వర్గంలో ఏడుగురికి ఛాన్స్

Maharashtra CM Eknath Shinde: మహారాష్ట్ర రాజకీయం రసకందాయంలో పడింది. బుధవారం బీజేపీ తరపున సీఎం అభ్యర్థిని ఎన్నుకోనున్న క్రమంలో తాజాగా ఆపద్ధర్మ సీఎం ఏకనాథ్ షిండే అనారోగ్యంతో ఆస్పత్రి పాలయ్యారు.

Maharashtra CM Eknath Shinde ముంబై: మహరాష్ట్రలో కొలువుదీరనున్న మహాయుతి ప్రభుత్వంలో చేరే అవకాశం ఉన్న 17 మంది మంత్రుల జాబితాను బీజేపీ మంగళవారం విడుదల చేసింది. ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఏకనాథ్ షిండే శివసేన నుంచి 7 మందికి కేబినెట్‌లో చోటు దక్కే అవకాశం ఉంది. మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవిస్‌ ప్రమాణం చేసే ఛాన్స్ ఉండగా, మహాయుతి క్యాబినెట్‌ జాబితాలో రాహుల్‌ నార్వేకర్‌, నితేశ్‌ రాణే ఆశిష్‌ షెలార్‌, గిరీష్‌ మహాజన్‌ పేర్లు ఉన్నాయి.

కాగా, శివసేనకు చెందిన ఏడుగురు నేతలకు మహారాష్ట్ర కేబినెట్‌లో చోటు దక్కే అవకాశం ఉంది. ఆపద్ధర్మ సీఎం ఏక్‌నాథ్ షిండేతో పాటు గులాబ్రావ్ పాటిల్, అర్జున్ ఖోట్కర్, దాదా భూసే, శంభురాజ్ దేశాయ్, సంజయ్ రాథోడ్, ఉదయ్ సామంత్ మహాయుతి కొత్త కేబినెట్‌లోకి రానున్నారు.

ఏకనాథ్ షిండేకు అనారోగ్యం

మహారాష్ట్ర ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఏకనాథ్ షిండే ఆరోగ్య పరిస్థితి విషమించినట్లు ప్రచారం జరిగింది. జర్వం, గొంతునొప్పి, వంటి నొప్పులతో బాధపడుతున్న ఆయనను తాజాగా థానేలోని జుపిటర్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి కొంచెం విషమంగానే ఉందని, డాక్టర్లు ఆయను పలు రకాల వైద్య పరీక్షలు చేస్తున్నట్లు తెలుస్తోంది. 

తీరికలేని షెడ్యూల్ తోనే..
సీఎం ఏకనాథ్ షిండ్ ఆరోగ్య పరిస్థితిపై శివసేన (షిండే) నేత సంజయ్ షిర్సత్ వ్యాఖ్యానించారు. గతనెలలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తీరిక లేని పని ఒత్తిడి వల్లే సీఎం ఆరోగ్యం ఖరాబైందని తెలిపారు. ఎన్నికల సభల్లో విశ్రాంతి లేకుండా పాల్గొనడం వల్లే ఆయన అనారోగ్యానికి గురయ్యారని తెలిపారు. ఎన్నికలు ముగిసి ఫలితాలు వచ్చాక, తాజాగా ఆయన తన స్వగ్రామం సతారా జిల్లాలోని దారే గ్రామానికి వెళ్లినట్లు తెలిపారు. అక్కడ షిండే పరిస్థితి కాస్త విషమించడంతో ముంబైకి తీసుకొచ్చినట్లు వెల్లడించారు. ప్రస్తుతం డాక్టర్లు వివిధ రకాలైన టెస్టులు చేస్తున్నారని, ఆ తర్వాత చికిత్సతో షిండే ఆరోగ్యం మెరుగవుతుందని భావిస్తున్నట్లు వెల్లడించారు.

 

రోటిన్ చెకప్ మాత్రమే..
మరోవైపు శివసేన (షిండే) మరో నేత ఉదయ్ సామంత్ మాత్రం ఏకనాథ్ షిండే ఆస్పత్రిలో చేరడంపై ఆందోళన అవసరం లేదని తమ పార్టీ శ్రేణులకు సూచించారు. రొటిన్ హెల్త్ చెకప్ లో భాగంగానే జుపిటర్ ఆస్పత్రికి షిండేను తీసుకొచ్చారని తెలిపారు. త్వరలోనే ముంబైలోని ఆయన అధికారిక నివాసానికి షిండే చేరుకుంటారని ఆశాభావం వ్యక్తం చేశారు. మరోవైపు షిండే అకస్మాత్తుగా తన స్వగ్రామానిక చేరుకోవడంపై పలు ఊహాగానాలు చెలరేగాయి. మహాయుతి కూటమి ఎన్నికల్లో బంపర్ మెజారీటి సాధించడంతో తిరిగి తననే సీఎంగా కొనసాగిస్తారని భావించిన షిండేకు ఎదురుదెబ్బ తగిలింది. బీజేపీ నుంచి దేవేంద్ర ఫడ్నవీస్ మళ్లీ సీఎంగా ఎన్నికయ్యే అవకాశముందని తెలిసి, ఆయన అలకతో స్వగ్రామానికి వెళ్లినట్లు ఆరోపణలు గుప్పుమన్నాయి. అంతకుముందు తన సీఎం పదవీ కాపాడుకోసం కోసం కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో భేటీ అయిన షిండే.. కనీసం తన కుమారుడు, ఎంపీ శ్రీకాంత్ షిండేకు ఉపముఖ్యమంత్రి పదవిని అయినా ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు సమాచారం. అయితే ఈ డిమాండ్లను బీజేపీ అధిష్టానం తిరస్కరించడంతో ప్రభుత్వంలో కీలక శాఖలు కేటాయించాలని షిండే డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. అయితే బీజేపీ మాత్రం పీడబ్ల్యూడీ శాఖను కేటాయిస్తామని తెలపడంతో షిండే అలక వహించినట్లు ప్రచారం జరుగుతోంది. 

Also Read: Tripura Bangladesh News: హోటల్స్‌లోకి బంగ్లాదేశీయులకు ఎంట్రీ లేదు- హోటల్ అసోసియేషన్ సంచలన నిర్ణయం

షరవేగంగా ప్రమాణ స్వీకార ఏర్పాట్లు..
మరోవైపు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారోత్సవ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈనెల 5న దక్షిణ ముంబైలోని ఆజాద్ మైదానంలో సీఎం ప్రమాణ స్వీకారం ఉంటుందని బీజేపీ వర్గాలు పేర్కొంటున్నాయి. దేవేంద్ర ఫడ్నవీస్ పేరు దాదాపుగా ఖరారైనప్పటికీ, ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదని తెలుస్తోంది. ఈనెల 4న బీజేఎల్పీ సమావేశంలో సీఎం అభ్యర్థిని ఎన్నుకుంటారని తెలుస్తోంది. 
ఇక గతనెలలో జరిగిన ఎన్నికల్లో మహాయుతి కూటమి ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. శివసేన (షిండే), ఎన్సీపీ (అజిత్ పవార్)లతో జట్టు కట్టిన బీజేపీ 288 అసెంబ్లీ స్థానాల్లో ఏకంగా 230 సీట్లను కైవసం చేసుకుంది. ఇందులో బీజేపీకి 132 సీట్లు, శివసేన 57, ఎన్సీపీకి 41 సీట్లు దక్కాయి. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Mohan Babu Complaint Against Manoj: మంచు మనోజ్ నుంచి నాకు ప్రాణహాని ఉంది - పోలీసులకు మోహన్ బాబు ఫిర్యాదు
మంచు మనోజ్ నుంచి నాకు ప్రాణహాని ఉంది - పోలీసులకు మోహన్ బాబు ఫిర్యాదు
Nagababu:వీడిన సస్పెన్స్ - ఏపీ కేబినెట్ లో మెగా బ్రదర్ నాగబాబుకు కీలక పదవి
వీడిన సస్పెన్స్ - ఏపీ కేబినెట్ లో మెగా బ్రదర్ నాగబాబుకు కీలక పదవి
Revanth Reddy Key Decisions: తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన - 9 మంది ప్రముఖులకు రూ.1 కోటి నగదు, ఇంటి స్థలం
తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన - 9 మంది ప్రముఖులకు రూ.1 కోటి నగదు, ఇంటి స్థలం
Best Selling SUV: ఇండియాలో బెస్ట్ సెల్లింగ్ ఎస్‌యూవీ ఇదే - నెక్సాన్, పంచ్, బ్రెజాలను వెనక్కి తోసేసిన కారు ఇదే!
ఇండియాలో బెస్ట్ సెల్లింగ్ ఎస్‌యూవీ ఇదే - నెక్సాన్, పంచ్, బ్రెజాలను వెనక్కి తోసేసిన కారు ఇదే!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Manchu Manoj vs Mohan babu | కరిగిన మంచు...ముదిరిన వివాదం | ABP DesamPushpa Day 4 Collections | రోజు రోజుకూ కలెక్షన్లు పెంచుకుంటున్న పుష్ప 2 | ABP DesamPushpa 2 Breaking all Bollywood Records | హిందీ సినీ ఇండస్ట్రీని షేక్ చేస్తున్న పుష్ప కలెక్షన్లు | ABP Desamఆటో డ్రైవర్ ఫ్యామిలీతో కేటీఆర్, ఆత్మీయ ముచ్చట - వైరల్ వీడియో

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mohan Babu Complaint Against Manoj: మంచు మనోజ్ నుంచి నాకు ప్రాణహాని ఉంది - పోలీసులకు మోహన్ బాబు ఫిర్యాదు
మంచు మనోజ్ నుంచి నాకు ప్రాణహాని ఉంది - పోలీసులకు మోహన్ బాబు ఫిర్యాదు
Nagababu:వీడిన సస్పెన్స్ - ఏపీ కేబినెట్ లో మెగా బ్రదర్ నాగబాబుకు కీలక పదవి
వీడిన సస్పెన్స్ - ఏపీ కేబినెట్ లో మెగా బ్రదర్ నాగబాబుకు కీలక పదవి
Revanth Reddy Key Decisions: తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన - 9 మంది ప్రముఖులకు రూ.1 కోటి నగదు, ఇంటి స్థలం
తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన - 9 మంది ప్రముఖులకు రూ.1 కోటి నగదు, ఇంటి స్థలం
Best Selling SUV: ఇండియాలో బెస్ట్ సెల్లింగ్ ఎస్‌యూవీ ఇదే - నెక్సాన్, పంచ్, బ్రెజాలను వెనక్కి తోసేసిన కారు ఇదే!
ఇండియాలో బెస్ట్ సెల్లింగ్ ఎస్‌యూవీ ఇదే - నెక్సాన్, పంచ్, బ్రెజాలను వెనక్కి తోసేసిన కారు ఇదే!
Manchu Family Issue: కుటుంబసభ్యులపై మనోజ్ ఫిర్యాదు చేయలేదు - దాడి చేసింది గుర్తు తెలియని వ్యక్తులు - పోలీసుల కీలక ప్రకటన
కుటుంబసభ్యులపై మనోజ్ ఫిర్యాదు చేయలేదు - దాడి చేసింది గుర్తు తెలియని వ్యక్తులు - పోలీసుల కీలక ప్రకటన
ICC Punishment: సిరాజ్ కి షాకిచ్చిన ఐసీసీ, శిక్ష ఖరారు- ట్రావిస్ హెడ్ కు మందలింపు
సిరాజ్ కి షాకిచ్చిన ఐసీసీ, శిక్ష ఖరారు- ట్రావిస్ హెడ్ కు మందలింపు
UPSC Mains Result 2024: యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ 2024 'మెయిన్' ఫలితాలు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే!
యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ 2024 'మెయిన్' ఫలితాలు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే!
Mohanbabu House: అది ఇల్లు కాదు ప్యాలెస్‌ కంటే ఎక్కువ - మోహన్ బాబు ఇంటిని స్వయంగా చూపిస్తున్న మంచు లక్ష్మి - చూస్తారా ?
అది ఇల్లు కాదు ప్యాలెస్‌ కంటే ఎక్కువ - మోహన్ బాబు ఇంటిని స్వయంగా చూపిస్తున్న మంచు లక్ష్మి - చూస్తారా ?
Embed widget