Russia Ukraine War: రష్యా అంటే నాటోకు భయం- ఊ అంటారా ఊఊ అంటారా: జెలెన్‌స్కీ

రష్యా అంటే నాటో కూటమికి భయమని ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లొదిమిర్ జెలెన్‌స్కీ సంచలన వ్యాఖ్యలు చేశారు.

FOLLOW US: 

నాటో కూటమిపై ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లొదిమిర్ జెలెన్‌స్కీ కీలక వ్యాఖ్యలు చేశారు. నాటోలో చేరబోమని ఇటీవల సంచలన వ్యాఖ్యలు చేసిన జెలెన్‌స్కీ తాజాగా ఆ కూటమిపై విమర్శలు చేశారు. 

" నాటోలో మేం భాగస్వామిగా చేరేందుకు మీరు ఒప్పుకుంటారా లేక రష్యా అంటే మాకు భయమని బహిరంగంగా చెప్తారా? ఏది నిజం? మాకు అయితే ఈ విషయం అర్థమైంది. నాటోలో ఉక్రెయిన్‌ను చేర్చుకునేందుకు రష్యాను చూసి వాళ్లు భయపడుతున్నారు. ఉక్రెయిన్‌ను అంగీకరించేందుకు నాటో సిద్ధంగా లేదనే విషయం చాలా కాలం క్రితమే అర్ధం చేసుకుని ఆ విషయం పక్కనపెట్టేశాం. వివాదాస్పద అంశాలు, రష్యాతో ఘర్షణలకు నాటో భయపడుతోంది.                                                                           "
- వ్లొదిమిర్ జెలెన్‌స్కీ, ఉక్రెయిన్ అధ్యక్షుడు

చర్చలు విఫలం

యుద్ధం నిలిపేసే అవకాశాలపై ఉక్రెయిన్, రష్యా మధ్య ఫిబ్రవరి 28  నుంచి ప్రతినిధుల స్థాయిలో మూడుసార్లు బెలారస్‌లో చర్చలు జరిగాయి. మార్చి 14న ఉభయ పక్షాలు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా నాలుగో రౌండ్ చర్చలు జరిపాయి. కానీ ఈ చర్చల్లో యుద్ధం నిలిపివేసేలా ఎలాంటి పురోగతి రాలేదు. రాబోయే రోజుల్లో పుతిన్‌తో జెలెన్‌స్కీ సంభాషణలు జరిపే అవకాశాలున్నాయని ఉక్రెయిన్ అధ్యక్షుడి సలహాదారు మైఖైలో పోడోల్యాక్ గత వారం తెలిపారు.

సాయం కోరిన జెలెన్‌స్కీ

అమెరికా తమకు తక్షణ సాయం అందించాలని ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లొదిమిర్ జెలెన్‌స్కీ ఆ దేశ కాంగ్రెస్‌ (సభ)ను ఇటీవల కోరారు. అమెరికా కాంగ్రెస్‌లో వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా జెలెన్‌స్కీ మాట్లాడారు. ఈ ప్రసంగంలో పెర్ల్​ హర్బర్​, 9/11 ఉగ్రదాడిని ప్రస్తావించారు. తమ సార్వభౌమత్వాన్ని రష్యా సవాల్ చేస్తుందని జెలెన్‌స్కీ అన్నారు.

రష్యాపై పోరాటంలో ఉక్రెయిన్​కు సాయం చేసేందుకు అమెరికా కాంగ్రెస్​ మరిన్ని చర్యలు తీసుకోవాలి. మా దేశ గగనతలాన్ని నో ఫ్లై జోన్‌గా ప్రకటించాలని మేం ఎప్పటి నుంచో కోరుతున్నాం. కానీ ఇది నెరవేరే పరిస్థితులు కనిపించడం లేదు. కానీ మా కోసం అమెరికా తక్షణ చర్యలు చేపట్టాలి. రష్యన్​ చట్టసభ్యులపై ఆంక్షలు విధించాలి. దిగుమతులను నిలిపేయాలి. రష్యా దురాక్రమణను ఆపకపోతే మా జీవితాలు వ్యర్థం.                                         "

-వ్లొదిమిర్ జెలెన్‌స్కీ, ఉక్రెయిన్ అధ్యక్షుడు

Also Read: PM Narendra Modi: రోజుకు 2 గంటలే మోదీ నిద్రపోతున్నారట- ఎందుకో తెలుసా?

Also Read: Russia Ukraine War: రష్యాపై ఆంక్షలు విధిస్తే భారత్ వణుకుతోంది: బైడెన్

Published at : 22 Mar 2022 04:28 PM (IST) Tags: Vladimir Putin Russia Ukraine Conflict Russia Ukraine War Russia Ukraine Conflict

సంబంధిత కథనాలు

UK Prime Minister Resignation: బ్రేకింగ్ న్యూస్- బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ రాజీనామా!

UK Prime Minister Resignation: బ్రేకింగ్ న్యూస్- బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ రాజీనామా!

UK political crisis: యూకేలో మహారాష్ట్ర పాలిటిక్స్ రిపీట్- కానీ చిన్న ట్విస్ట్ ఏంటంటే?

UK political crisis: యూకేలో మహారాష్ట్ర పాలిటిక్స్ రిపీట్- కానీ చిన్న ట్విస్ట్ ఏంటంటే?

UK Political Crisis: యూకే ప్రధానికి దెబ్బ మీద దెబ్బ- మరో ఆరుగురు మంత్రులు రాజీనామా!

UK Political Crisis: యూకే ప్రధానికి దెబ్బ మీద దెబ్బ- మరో ఆరుగురు మంత్రులు రాజీనామా!

Dalai Lama Birthday: హాలీవుడ్ యాక్టర్‌తో కలిసి కేక్ కట్ చేసిన దలైలామా, ట్విటర్‌లో ప్రముఖుల శుభాకాంక్షలు

Dalai Lama Birthday: హాలీవుడ్ యాక్టర్‌తో కలిసి కేక్ కట్ చేసిన దలైలామా, ట్విటర్‌లో ప్రముఖుల శుభాకాంక్షలు

Brazilian Model Killed: ఉక్రెయిన్- రష్యా యుద్ధంలో బ్రెజిల్ మోడల్ మృతి!

Brazilian Model Killed: ఉక్రెయిన్- రష్యా యుద్ధంలో బ్రెజిల్ మోడల్ మృతి!

టాప్ స్టోరీస్

Why Nagababu Target Modi : మోదీపైనా నాగబాబు సెటైర్లు ! జనసేన డైరక్ట్‌గానే చెబుతోందా ?

Why Nagababu Target Modi : మోదీపైనా నాగబాబు సెటైర్లు ! జనసేన డైరక్ట్‌గానే చెబుతోందా ?

Chintamaneni Reaction: కోడిపందేల ఘటనలో ఎస్కేప్ ఆరోపణలపై చింతమనేని రియాక్షన్, ఏమన్నారంటే

Chintamaneni Reaction: కోడిపందేల ఘటనలో ఎస్కేప్ ఆరోపణలపై చింతమనేని రియాక్షన్, ఏమన్నారంటే

Home Sales In Telangana: హైదరాబాద్‌లో అద్దెకు ఉంటున్న వాళ్లకు షాకింగ్- ఇంటి ఓనర్‌ అవ్వడం నాట్‌ సో ఈజీ!!

Home Sales In Telangana: హైదరాబాద్‌లో అద్దెకు ఉంటున్న వాళ్లకు షాకింగ్- ఇంటి ఓనర్‌ అవ్వడం నాట్‌ సో ఈజీ!!

Eluru Borewell News: ఎట్టకేలకు బయటికొచ్చిన బాలుడు, 5 గంటలుగా బోరుబావిలో నరకయాతన

Eluru Borewell News: ఎట్టకేలకు బయటికొచ్చిన బాలుడు, 5 గంటలుగా బోరుబావిలో నరకయాతన