అన్వేషించండి

Israel-Iran Tension: పేజర్ పేలుడు నుంచి క్షిపణుల దాడి వరకు - ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య 14 రోజుల్లో ఏం జరిగింది?

Israel-Iran Tension Row: శాంతిస్తుందనుకున్న పశ్చిమాసియా మరోసారి అట్టుడుకుతోంది. ఇప్పటి వరకు బాగానే ఉన్న గత పక్షం రోజుల్లో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఇంతకీ 14 రోజుల పాటు ఏం జరిగిందో చూద్దాం.

Israel-Iran Tension Row: ఇజ్రాయెల్ ప్రధాన నగరాలవైపు వందల కొద్ది ఇరాన్ క్షిపణులు ఎగురుకుంటూ వచ్చి దాడి చేశాయి. ఇరాన్ మద్దతుతో చెలరేగిపోయిన  హిజ్బుల్లాపై ఇజ్రాయెల్ దాడి చేసింది. ఇది ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య వార్‌కు కారణమైంది. దీంతో ఈ వివాదంలోకి అమెరికా, రష్యా కూడా ప్రవేశించడంతో పరిస్థితి చేయి దాటిపోతుందేమో అన్న అనుమానం కలుగుతోంది. 

గతేడాది అక్టోబర్‌లో గాజాపై హమాస్‌ దాడితో ప్రారంభమైన వార్ ఇప్పుడు పేజర్ల దాడితో పీక్స్‌కు చేరింది. తర్వాత నస్రల్లాను హతమార్చడం జరిగింది. ఇప్పుడు ఇజ్రాయెల్‌పై ఇరాన్‌ గురి పెట్టింది. ఇజ్రాయెల్‌కు సహకరిస్తామని ప్రతిచర్య ఉంటుందని అమెరికా హెచ్చరికతో పరిస్థితి ఉద్రిక్తంగా ఉంది. 

14 రోజుల వ్యవధిలో మొత్తం పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఇంతకీ ఈ 14 రోజులు ఏం జరిగిందో ఓసారి పరిశీలిస్తే...

పశ్చిమాసియా కాస్త కుదుట పడుతుందని అనుకున్న టైంలో సెప్టెంబర్ 17 పేజర్ల దాడి పెను ప్రకంపనలు సృష్టించింది. లెబనాన్, సిరియా అంతటా హిజ్బుల్లా సభ్యులను లక్ష్యంగా చేసుకొని దాడి జరిగింది. 

సెప్టెంబరు 17-18, 2024: లెబనాన్, సిరియా వ్యాప్తంగా ఒకేసారి వేల పేజర్లు పేలుడం ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ప్రధానంగా హిజ్బుల్లా సభ్యులకు చెందిన పేజర్లు పేలడంతో పిల్లలతో సహా కనీసం 13 మంది మరణించారు. దాదాపు 4,000 మంది గాయపడ్డారు. ఈ దాడికి తామే కారణమని ఇజ్రాయెల్ ఎక్కడా ప్రకటన చేయలేదు. అయితే లెబనాన్‌ సరిహద్దుల్లో హిజ్బుల్లా దాడి కారణంగా నిరాశ్రయులైన వారిని ఏడాదిలో తిరిగి స్వస్థలాలకు రప్పిస్తామన్న ప్రకటన ఈ పేజర్ దాడులను పరోక్షంగా ధ్రువీకరించినట్టైంది. 

సెప్టెంబర్ 18: లెబనాన్‌లో జరిగిన మరో దాడుల్లో వాకీ-టాకీలతో సహా కమ్యూనికేషన్ పరికరాలు పేలాయి. ఆసారి 14 మంది మరణించారు. దాదాపు 450 మంది గాయపడ్డారు. ఈ పరిస్థితుల్లోనే ఓ ప్రకటన విడుదల చేసిన ఇజ్రాయెల్ రక్షణ మంత్రి యోవ్ గల్లంట్ "అద్భుతమైన విజయాలు" "ఆకట్టుకునే ఫలితాలు" అంటూ చెప్పుకొచ్చారు. ఎక్కడా పరికార పేలుడు ప్రస్తావన చేయలేదు. 

సెప్టెంబరు 19: దక్షిణ లెబనాన్‌లో వందలాది రాకెట్ లాంచర్‌లతో దాడి చేసినట్టు ఇజ్రాయెల్ ప్రకటించింది. 

సెప్టెంబరు 20-22: సెప్టెంబరు 20న బీరుట్ శివారులోని కొన్ని భవనాలపై దాడి చేసి 37 మందిని హతమార్చినట్టు ఇజ్రాయెల్ ప్రకటించింది. ఈ దాడిలో హిజ్బుల్లా సైనిక కమాండర్ ఇబ్రహీం అకిల్‌ హతమైనట్టు వెల్లడించింది. 

సెప్టెంబర్ 22: హిజ్బుల్లా స్థావరాలపై ఇజ్రాయెల్ దాడులు చేస్తూనే ఉంది. 

సెప్టెంబరు 23: దక్షిణ లెబనాన్ ప్రజలు ఆ ప్రాంతాన్ని ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోవాలని ప్రకటించిన కొన్ని గంటల తర్వాత ఇజ్రాయెల్ వైమానిక దాడులు స్టార్ట్ చేసింది. ఆ దుర్ఘటనలో 550 మందికిపైగా మరణించారు. 2,000 మందికిపైగా గాయపడ్డారని లెబనాన్ ప్రభుత్వం ప్రకటించిందని మీడియా ప్రజెంట్ చేసింది. అదే రోజు ఉత్తర ఇజ్రాయెల్‌పై హిజ్బుల్లా దాదాపు 200 రాకెట్‌లు ప్రయోగించారు. వైమానిక రక్షణ వ్యవస్థ వాటిని అడ్డగించగలిగింది. తమ దాడుల్లో బీరుట్‌లో ఉంటున్న హిజ్బుల్లా సదరన్ ఫ్రంట్ కమాండర్ అలీ కరాకిని ఇజ్రాయెల్ లక్ష్యంగా చేసుకుందని అతను మాత్రం తప్పించుకున్నట్టు మీడియా రిపోర్ట్ చేసింది. 

సెప్టెంబర్ 24-25: దక్షిణ లెబనాన్ నుంచి వెళ్లిపోవాలని స్థానికులను ఇజ్రాయెల్ హెచ్చరించింది. దాడులు కంటిన్యూ చేసింది. లెబనాన్ "ఇజ్రాయెల్ చేతిలో మరో గాజా"గా మారకూడదని సెప్టెంబరు 24న ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ స్టేట్‌మెంట్ ఇచ్చారు. అదే రోజు ఇజ్రాయెల్ బీరూట్‌లో చేసిన దాడిలో హిజ్బుల్లా క్షిపణి విభాగ అధిపతి ఇబ్రహీం కొబీస్సీ హతమయ్యాడు. 

సెప్టెంబర్ 25: మొదటిసారిగా సెంట్రల్ ఇజ్రాయెల్ వైపు సుదూర క్షిపణిని హిజ్బుల్లా ప్రయోగించింది. కానీ దాన్ని ఇజ్రాయెల్ దళాలు నిలువరించాయి. మరోవైపు దక్షిణ లెబనాన్ అంతటా ఇజ్రాయెల్ వైమానిక దాడులు కొనసాగిస్తూనే ఉంది. ఇందులో 72 మంది మరణించారని, దాదాపు 400 మంది గాయపడ్డారని లెబనాన్ తెలిపింది.

సెప్టెంబరు 26: న్యూయార్క్‌లో జరిగిన 70వ ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో ఇతర G7 సభ్యుల మద్దతుతో 21 రోజుల కాల్పుల విరమణ ప్రణాళికను US, ఫ్రాన్స్ ప్రతిపాదించాయి. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు దానిని తిరస్కరించారు. అదే రోజు దక్షిణ బీరుట్‌లో జరిగిన దాడిలో హిజ్బుల్లా వైమానిక దళ కమాండర్ మహ్మద్ హుస్సేన్ సరోర్‌ను చంపినట్లు ఇజ్రాయెల్ తెలిపింది.

సెప్టెంబరు 27: నెతన్యాహు UNGAని ఉద్దేశించి ప్రసంగిస్తూ... అక్కడ ఇజ్రాయెల్ పోరాడుతున్న యుద్ధం గెలుస్తుందని చెప్పారు. మధ్యప్రాచ్యంలో ఎక్కడైనా ఇరాన్, దాని ప్రాక్సీలపై దాడి చేస్తామని ప్రకటించారు. అదే రోజు దక్షిణ బీరుట్‌లో కొన్ని భవనాలను టార్గెట్ చేసుకొని ఇజ్రాయెల్ వైమానిక దాడులు జరిగాయి. హిజ్బుల్లాకు చెందిన ప్రధాన కార్యాలయాన్ని నేలమట్టం చేశారు. 

సెప్టెంబరు 28: ముందు రోజు జరిగిన దాడిలో హిజ్బుల్లా నాయకుడు హసన్ నస్రల్లా మరణించినట్లు ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. ఈ విషయాన్ని మొదట ఖండించిన హిజ్బుల్లా తర్వాత ధృవీకరించింది. .

సెప్టెంబరు 29-30: నస్రల్లాను టార్గెట్ చేస్తూ జరిగిన దాడిలోనే ఇరాన్ పారామిలిటరీ రివల్యూషనరీ గార్డ్‌లో ప్రముఖ జనరల్ జనరల్ అబ్బాస్ నిల్ఫోరుషన్ కూడా మరణించారు. ఉన్నత స్థాయి అధికారి నబిల్ కౌక్ కూడా చనిపోయినట్టు హిజ్బుల్లా ధృవీకరించింది. 

అక్టోబరు 1: దానికి ప్రతీకారంగానే ఇజ్రాయెల్‌పై ఇరాన్ విరుచుకుపడింది. కనీసం నాలుగు వందల వరకు క్షిపణులను ప్రయోగించింది, ఇది మధ్యప్రాచ్యంలో ప్రాంత-వ్యాప్త యుద్ధ భయానికి దారితీసింది.

Also Read: పశ్చిమాసియాలో మరోసారి టెన్షన్, ఇజ్రాయెల్‌పై ఇరాన్ క్షిపణుల వర్షం- అర్థరాత్రి విధ్వంసం

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Rains: అల్పపీడన ప్రభావం - ఈ నెల 15 వరకూ ఈ జిల్లాల్లో వర్షాలు, అధికారులకు సీఎం కీలక ఆదేశాలు
అల్పపీడన ప్రభావం - ఈ నెల 15 వరకూ ఈ జిల్లాల్లో వర్షాలు, అధికారులకు సీఎం కీలక ఆదేశాలు
KCR: తెలంగాణ తల్లి కొత్త విగ్రహం - కాంగ్రెస్ ప్రభుత్వానిది మూర్ఖపు చర్యంటూ కేసీఆర్ తీవ్ర ఆగ్రహం
తెలంగాణ తల్లి కొత్త విగ్రహం - కాంగ్రెస్ ప్రభుత్వానిది మూర్ఖపు చర్యంటూ కేసీఆర్ తీవ్ర ఆగ్రహం
WhatsApp Message Reminder: ‘బాబూ... మెసేజ్ ఓపెన్ చేయడం మర్చిపోయావ్’ - వాట్సాప్‌లో రానున్న కొత్త ఫీచర్ ఇదే!
‘బాబూ... మెసేజ్ ఓపెన్ చేయడం మర్చిపోయావ్’ - వాట్సాప్‌లో రానున్న కొత్త ఫీచర్ ఇదే!
Special Trains: శబరిమల భక్తులకు గుడ్ న్యూస్ - జనవరిలో 34 ప్రత్యేక రైళ్లు, ఆ రూట్లు ఇవే!
శబరిమల భక్తులకు గుడ్ న్యూస్ - జనవరిలో 34 ప్రత్యేక రైళ్లు, ఆ రూట్లు ఇవే!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఆ ఊళ్లోనే పెద్దపులి తిష్ట! డ్రోన్లతో గాలింపుభారత్ ఘోర ఓటమి ఆసిస్ సిరీస్ సమంరైతులకు నో ఎంట్రీ, రోడ్లపై ఇనుప మేకులు, బోర్డర్‌లో భారీ బందోబస్తుసప్తవర్ణ శోభితం, శ్రీపద్మావతి అమ్మవారి పుష్పయాగం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rains: అల్పపీడన ప్రభావం - ఈ నెల 15 వరకూ ఈ జిల్లాల్లో వర్షాలు, అధికారులకు సీఎం కీలక ఆదేశాలు
అల్పపీడన ప్రభావం - ఈ నెల 15 వరకూ ఈ జిల్లాల్లో వర్షాలు, అధికారులకు సీఎం కీలక ఆదేశాలు
KCR: తెలంగాణ తల్లి కొత్త విగ్రహం - కాంగ్రెస్ ప్రభుత్వానిది మూర్ఖపు చర్యంటూ కేసీఆర్ తీవ్ర ఆగ్రహం
తెలంగాణ తల్లి కొత్త విగ్రహం - కాంగ్రెస్ ప్రభుత్వానిది మూర్ఖపు చర్యంటూ కేసీఆర్ తీవ్ర ఆగ్రహం
WhatsApp Message Reminder: ‘బాబూ... మెసేజ్ ఓపెన్ చేయడం మర్చిపోయావ్’ - వాట్సాప్‌లో రానున్న కొత్త ఫీచర్ ఇదే!
‘బాబూ... మెసేజ్ ఓపెన్ చేయడం మర్చిపోయావ్’ - వాట్సాప్‌లో రానున్న కొత్త ఫీచర్ ఇదే!
Special Trains: శబరిమల భక్తులకు గుడ్ న్యూస్ - జనవరిలో 34 ప్రత్యేక రైళ్లు, ఆ రూట్లు ఇవే!
శబరిమల భక్తులకు గుడ్ న్యూస్ - జనవరిలో 34 ప్రత్యేక రైళ్లు, ఆ రూట్లు ఇవే!
Sandhya Theater Stampede: సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన - ముగ్గురిని అరెస్ట్ చేసిన పోలీసులు, కోలుకుంటోన్న బాలుడు
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన - ముగ్గురిని అరెస్ట్ చేసిన పోలీసులు, కోలుకుంటోన్న బాలుడు
Mahindra BE 6e Vs Tata Curvv EV: నెక్సాన్ వర్సెస్ కర్వ్ వర్సెస్ బీఈ 6ఈ - మూడు ఎలక్ట్రిక్ కార్లలో ఏది బెస్ట్!
నెక్సాన్ వర్సెస్ కర్వ్ వర్సెస్ బీఈ 6ఈ - మూడు ఎలక్ట్రిక్ కార్లలో ఏది బెస్ట్!
Bapatla Accident: ఏపీలో తీవ్ర విషాదం - టిప్పర్ లారీ ఢీకొని ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి
ఏపీలో తీవ్ర విషాదం - టిప్పర్ లారీ ఢీకొని ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి
Actor Manchu Manoj: బంజారాహిల్స్ ఆస్పత్రికి నటుడు మంచు మనోజ్ - నడవడానికి ఇబ్బంది పడుతూ వ్యక్తి సాయంతో.. వీడియో వైరల్
బంజారాహిల్స్ ఆస్పత్రికి నటుడు మంచు మనోజ్ - నడవడానికి ఇబ్బంది పడుతూ వ్యక్తి సాయంతో.. వీడియో వైరల్
Embed widget