Andhra Latest News:ఏపీ సబ్‌రిజిస్ట్రార్ ఆఫీసుల్లో కొత్త విధానం- పది నిమిషాల్లో రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి
Andhra Latest News:ఏపీ సబ్‌రిజిస్ట్రార్ ఆఫీసుల్లో కొత్త విధానం అమలులోకి వచ్చింది. దీంతో పది నిమిషాల్లో రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి అయ్యే అవకాశం ఉంది.

Andhra Latest News: ఆంధ్రప్రదేశ్‌లో సబ్‌రిజిస్ట్రార్ ఆఫీసుల్లో కొత్త విధానం అమలులోకి వచ్చింది. దీన్ని రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ ప్రారంభించారు. ఇకపై రాష్ట్రంలోని అన్ని కార్యాలయాల్లో అమల్లోకి రానుంది. ఉదయం 10 గంటలకు వెలగపూడి సచివాలయంలోని సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో మంత్రి అనగాని సత్యప్రసాద్ ఆన్‌లైన్ స్లాట్ బుకింగ్ ప్రారంభించారు.
26 జిల్లాల ప్రధాన కార్యాలయాల సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో స్లాట్ బుకింగ్ సేవలు స్టార్ట్ అయ్యాయి. అనంతరం మాట్లాడిన సత్యప్రసాద్... స్టాంప్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖలో ఏదో కీలక ఘట్టమని అభివర్ణించారు. ముఖ్యమంత్రి సూచనతో అనేక మార్పులు తీసుకొని వస్తున్నామన్నారు. ప్రజలకు సేవలు మరింత సులభంగా అందుబాటులో ఉండేందుకే ఈ ప్రక్రియ మొదలు పెట్టామన్నారు.
నిపుణులతో చర్చించిన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నామని అన్నారు సత్యప్రసాద్. 10నిమిషాల వ్యవధిలో అమ్మకం, కొనుగోలు, సాక్షులు పని పూర్తి అవుతుందని అన్నారు. సెలవు రోజుల్లో కూడా ఎక్స్ట్రా ఫీజ్ తో రిజిస్ట్రేషన్లు చేస్తున్నామని తెలిపారు.
కొత్త విధానం 26 జిలాల్లోని 296 సబ్ రిజిస్టర్ ఆఫీస్‌లో స్లాట్ బుకింగ్ మొదలవుతుందని తెలిపారు సత్యప్రసాద్. ఇప్పటికే దీన్ని ప్రయోగాత్మకంగా కృష్ణాజిల్లాలో అమలు చేశారు.





















