Madalasa Sharma : ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్! - 17 ఏళ్లకే వదిలేసి వెళ్లిపోవాలనుకున్నా... హీరోయిన్ సెన్సేషనల్ కామెంట్స్
Madalasa Sharma Reaction : ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్‌పై హీరోయిన్ మదాలస శర్మ తాజాగా ఓ ఇంటర్వ్యూలో సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. కెరీర్ ప్రారంభంలో కొంత ఇబ్బంది పడినట్లు చెప్పారు.

Actress Madalasa Sharma Reaction On Casting Couch In Industry : హీరోయిన్ మదాలస శర్మ బాలీవుడ్‌తో పాటు తెలుగు, కన్నడ, తమిళ భాషల్లో మూవీస్ చేశారు. అల్లరి నరేష్ హీరోగా నటించి 'ఫిట్టింగ్ మాస్టర్' హీరోయిన్‌గా చేసి టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత పలు తెలుగు మూవీస్‌లో నటించినా ప్రస్తుతం ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో క్యాస్టింగ్ కౌచ్ అంశంపై ఆమె స్పందించారు.
17 ఏళ్లకే...
తన కెరీర్ ప్రారంభంలో తనకు ఎదురైన చేదు అనుభవంతో ఇండస్ట్రీనే వదిలి వెళ్లిపోవాలనుకున్నట్లు మదాలస శర్మ తెలిపారు. కొన్నేళ్ల తర్వాత సౌత్ ఇండస్ట్రీని ఎందుకు వదిలేయాల్సి వచ్చిందో ఆమె వివరించారు. 'కెరీర్ ప్రారంభంలో నాకు కొన్ని చేదు అనుభవాలు ఎదురయ్యాయి. నేను ఆ దారిలో ముందుకు వెళ్లలేనని నాకు అనిపించింది. క్యాస్టింగ్ కౌచ్ వంటివి అన్ని చోట్లా ఉంటాయి. కానీ సౌత్‌లో నాకు కొంచెం ఎక్కువ నిరాశ ఎదురైంది.
దాని వల్ల పెద్ద ప్రమాదం ఏమీ జరగలేదు. 17 ఏళ్ల వయసులో ఓ సంభాషణ నన్ను చాలా ఇబ్బంది పెట్టింది. అలా అనిపించగానే అక్కడి నుంచి బయటకు వచ్చేసి ముంబైకి తిరిగి వెళ్లిపోవాలని అనుకున్నా.' అని తెలిపారు. అయితే, కెరీర్ ప్రారంభంలోనే మదాలస ఇలాంటి అసహ్యకరమైన పరిస్థితులు ఎదుర్కొన్నట్లు ఆమె కామెంట్స్ బట్టి అర్థమవుతుండగా ప్రస్తుతం ఇవి వైరల్ అవుతున్నాయి.
టాలీవుడ్ మూవీస్
మదాలస శర్మ అల్లరి నరేష్ హీరోగా 2009లో వచ్చిన 'ఫిట్టింగ్ మాస్టర్' మూవీతో తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత శౌర్య, ఆలస్యం అమృతం, మేం వయసుకు వచ్చాం, రామ్ లీల మూవీస్‌లో నటించారు. వీటితో పాటే కొన్ని బాలీవుడ్, కన్నడ, తమిళ మూవీస్ కూడా చేశారు. అయితే, 'అనుపమ' టీవీ షోతో పాపులారిటీ సంపాదించుకున్నారు. 2018లో మిథున్ చక్రవర్తి కుమారుడు మహాఅక్షయ్ చక్రవర్తిని మదాలస వివాహం చేసుకున్నారు.
Also Read : ఒకే మూవీలో సౌత్ బ్యూటీస్ - మృణాల్, పూజా హెగ్డే బాలీవుడ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ రిలీజ్ ఎప్పుడంటే?





















