SSMB 29: మహేష్ బాబు సినిమా కోసం రాజమౌళి కీలక నిర్ణయం... సీక్వెల్ ట్రెండ్‌కు ఎండ్ కార్డ్... కారణం ఇదేనా?
SSMB 29 : మహేష్ బాబు సినిమా కోసం దర్శకుడు రాజమౌళి కీలక నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. ఈ మూవీతో ఆయన సీక్వెల్ ట్రెండ్ కు ఎండ్ కార్డ్ వేయబోతున్నారని ఇండస్ట్రీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం.

దర్శక దిగ్గజం రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్లో రూపొందుతున్న మూవీ ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఈ మూవీ కోసం రాజమౌళి కీలక నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. ఇప్పటిదాకా రెండు భాగాలుగా సినిమాను తెరకెక్కిస్తూ వస్తున్న జక్కన్న ఈ సినిమాతో ఆ ట్రెండ్ కి ఫుల్ స్టాప్ పెట్టాలని నిర్ణయించుకున్నారట. దానికి కారణం చాలామంది చిత్ర నిర్మాతలు రెండు భాగాలుగా సినిమాను తెరపై చూపించాలనే కాన్సెప్టును దుర్వినియోగం చేశారని, ఆర్థిక లాభాల కోసం ప్రాజెక్టులను సాగదీస్తున్నారని రాజమౌళి భావిస్తున్నారని ఫిలిం నగర్ సర్కిల్స్ లో టాక్ చక్కర్లు కొడుతోంది.
పాత ట్రెండ్ కు ఫుల్ స్టాప్ పెట్టబోతున్న జక్కన్న
మహేష్ బాబు - రాజమౌళి కాంబినేషన్లో పొందుతున్న 'ఎస్ఎస్ఎంబీ 29' మూవీ పాన్ వరల్డ్ రేంజ్ లో రిలీజ్ కాబోతోంది. ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమాన్ కూడా ఈ సినిమాలో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. 2027 వేసవిలో ఈ సినిమా తెరపైకి రాబోతోంది. 2026 వరకు షూటింగ్ కంటిన్యూగా జరగబోతుందని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ ఫుల్ స్వింగ్లో జరుగుతుండగా, 'ఎస్ఎస్ఎంబి 29'కు సంబంధించిన మరో ప్రత్యేకమైన అప్డేట్ బయట కొచ్చింది. ఫిలిం నగర్ సర్కిల్స్ లో వినిపిస్తున్న టాక్ ప్రకారం రాజమౌళి ఈ ఫారెస్ట్ అడ్వెంచర్ మూవీని రెండు భాగాలుగా తీయాలనే ఆలోచనను విరమించుకున్నట్టు తెలుస్తోంది.
రాజమౌళి కెరీర్ లోనే లాంగెస్ట్ మూవీ
ఇన్సైడ్ వర్గాల సమాచారం ప్రకారం రాజమౌళి ఇప్పటిదాకా తాను కొనసాగించిన రెండు భాగాల సినిమా ట్రెండ్ కు ఫుల్ స్టాప్ పెట్టబోతున్నారు. 'బాహుబలి'తో ఒకే కథను రెండు భాగాలుగా చెప్పే ట్రెండ్ ను ఆయన మొదలుపెట్టారు. అయితే 'ఎస్ఎస్ఎంబీ 29' వంటి భారీ స్టోరీని ఒకే భాగంలో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించే ఫార్మాట్లో చెప్పాలని ఆలోచిస్తున్నారట. నిజానికి తను మొదలు పెట్టిన ఈ రెండు భాగాల కథ అనే కాన్సెప్ట్ ను నిర్మాతలు దుర్వినియోగం చేశారని, లాభాల కోసం సినిమాలను సాగదీస్తున్నారని రాజమౌళి భావిస్తున్నారట. అందుకే సింగిల్ పార్ట్ స్టోరీ టెల్లింగ్ ఫార్మాట్లో తన స్క్రీన్ ప్లేను మార్చాలని ఆయన భావిస్తున్నట్టు తెలుస్తోంది. 'ఆర్ఆర్ఆర్' లాగానే ఈ మూవీని కూడా మూడు గంటల 30 నిమిషాల రన్ టైంతో థియేటర్లలోకి తీసుకురావాలనే నిర్ణయాన్ని రాజమౌళి తీసుకున్నారని సమాచారం. అలాగే రాజమౌళి కెరీర్ లోనే 'ఎస్ఎస్ఎంబి 29' మూవీ అత్యధిక రన్ టైం ఉన్న సినిమా కావచ్చు అని అంటున్నారు.
ఇదిలా ఉండగా మహేష్ బాబు, ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమార్ కలిసి నటిస్తున్న 'ఎస్ఎస్ఎంబి 29' మూవీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోంది. రాజమౌళి అంతర్జాతీయ చిత్ర నిర్మాతలతో కలిసి ఈ సినిమాను ప్రపంచ స్థాయిలో రిలీజ్ చేయాలని ఆలోచిస్తున్నారు. ప్రస్తుతం ఈ ప్లాన్ కి సంబంధించిన పనులు చర్చల దశలో ఉన్నాయి. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ఇక 'ఎస్ఎస్ఎంబి 29' మూవీని డీవీవీ దానయ్య, కేఎల్ నారాయణ అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. రాజమౌళి, మహేష్ బాబు ఈ సినిమాకు వచ్చే లాభాలలో 40% వాటాను రెమ్యూనరేషన్ గా తీసుకోబోతున్నట్టు ప్రచారం జరుగుతోంది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

