Rajinikanth Movie OTT Release : రజనీకాంత్ సినిమా ఓటీటీ విడుదలకు ఇప్పటికైనా మోక్షం లభిస్తుందా ? - రిలీజై ఏడాది దాటినా ఇంకా సస్పెన్సే
Rajinikanth Movie OTT Release : రజనీకాంత్ నటించిన 'లాల్ సలామ్' సినిమా థియేటర్లలోకి వచ్చి ఏడాది పూర్తయినా ఓటీటీ రిలీజ్ కు మాత్రం ఇంకా నోచుకోలేదు. తాజాగా ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ పై అప్డేట్ వచ్చింది.

Rajinikanth's Lal Salaam Movie OTT Release: జయాపజయాలతో సంబంధం లేకుండా రజనీకాంత్ మూవీ ఓటీటీలోకి అడుగు పెడుతోందంటే ఆ బజ్ వేరే లెవెల్‌లో ఉంటుంది. అయితే రజనీకాంత్ కీలకపాత్ర పోషించిన 'లాల్ సలామ్' మూవీ రిలీజ్ అయ్యి ఆల్మోస్ట్ ఏడాది పూర్తయింది. ఇప్పటివరకూ పలు కారణాల వల్ల ఈ మూవీ ఓటీటీలోకి రాకపోవడం పట్ల ఆయన అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ ఈ వారమే కాబోతోందనేది ఇండస్ట్రీ నుంచి అందుతున్న తాజా ఖబర్.
ఏడాది తర్వాత ఓటీటీలోకి...
సూపర్ స్టార్ రజనీకాంత్ కీలకపాత్ర పోషించిన స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా 'లాల్ సలామ్'. ఈ తమిళ మూవీకి రజనీకాంత్ కూతురు ఐశ్వర్య రజనీకాంత్ దర్శకత్వం వహించారు. 2024 ఫిబ్రవరి 9న ఈ సినిమా థియేటర్లలోకి వచ్చింది. అయితే థియేటర్లలో ఈ సినిమా ప్రేక్షకులను దారుణంగా నిరాశపరిచింది. అయినప్పటికీ అప్పటి నుంచి ఈ మూవీ ఓటీటీలో ఎప్పుడెప్పుడు అడుగు పెడుతుందా? అని ఆతృతగా ఎదురు చూస్తున్నారు సూపర్ స్టార్ ఫ్యాన్స్. ఈ మూవీ ఓటీటీ రైట్స్ సన్ నెక్స్ట్ సొంతం చేసుకుంది. ముందుగా నెట్ ఫ్లిక్స్ 'లాల్ సలామ్' డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ దక్కించుకుందని వార్తలు వచ్చాయి. కానీ ఇప్పటివరకూ ఈ రెండు ఓటీటీలోనూ సినిమా స్ట్రీమింగ్ కాలేదు. తాజాగా ఇండస్ట్రీ వర్గాల్లో చక్కర్లు కొడుతున్న సమాచారం ప్రకారం 'లాల్ సలామ్' మూవీ ఏప్రిల్ 4 నుంచి సన్ నెక్స్ట్ ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతోంది. ఒకవేళ ఈ వార్తలు గనుక నిజమైతే మూవీని థియేటర్లలో మిస్ అయినవారు ఎంచక్కా ఓటీటీలోనే చూడొచ్చు. కానీ ఇంకా మేకర్స్ నుంచి మూవీ ఓటీటీ రిలీజ్ గురించి అఫీషియల్ అనౌన్స్మెంట్ రాలేదు.
'లాల్ సలామ్' వివాదం
'లాల్ సలామ్' మూవీ థియేటర్లలో రిలీజ్ అయ్యి దాదాపు 14 నెలలు పూర్తవుతుంది. ఈ నేపథ్యంలోనే మరోసారి మూవీ ఓటీటీలోకి రాబోతుందని వార్తలు వినిపించడం ఆసక్తికరంగా మారింది. కానీ దీనిపై ఇంకా అఫీషియల్ అనౌన్స్మెంట్ రాలేదు. ఇక ముంబైలో మత కలహాలు, క్రికెట్ అనే అంశాలతో తెరకెక్కిన ఈ సినిమా గురించి గతంలో ఐశ్వర్య చేసిన కామెంట్స్ వివాదాస్పదంగా మారాయి. అప్పట్లో ఈ మూవీకి సంబంధించిన హార్డ్ డిస్క్ మిస్ అయ్యిందని, అందులోని సీన్స్ ఉంటే సినిమా అద్భుతంగా ఆడేదని ఆమె అన్నారు. తరువాత ఆ హార్డ్ డిస్క్ దొరికిందని, అదనపు సీన్లతో కలిపి ఈ సినిమాను ఓటీటీలో స్ట్రీమింగ్ చేయబోతున్నామని వెల్లడించారు. ఆమె ఈ కామెంట్ చేసి నెలలు గడుస్తున్నా మూవీ ఓటీటీలోకి రాలేదు. మరి ఇప్పుడు ప్రచారం జరుగుతున్నట్టుగా రేపటి నుంచి మూవీ సన్ ఎన్ఎక్స్టీలో అందుబాటులో ఉంటుందా? లేదా ? అన్నది చూడాలి.
'లాల్ సలామ్' చిత్రానికి ఐశ్వర్య రజనీకాంత్ దర్శకత్వం వహించగా, ఆమెతో పాటు విష్ణు రంగసామి స్క్రీన్ ప్లే అందించారు. సుభాస్కరన్ అల్లిరాజా నిర్మించారు. విష్ణు విశాల్, విక్రాంత్ లు ప్రధాన పాత్రలు పోషించగా, రజనీకాంత్ గెస్ట్ రోల్ పోషించారు. ఏఆర్ రెహమాన్ సంగీతం సమకూర్చారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

