Salman Khan - Harish Shankar: క్రేజీ ఛాన్స్ పట్టేసిన హరీష్ శంకర్... బాలీవుడ్ బడా హీరోతో సినిమా? మరి పవన్ మూవీ స్టార్ట్ అయ్యేదెప్పుడు?
Harish Shankar Next Movie: ప్రముఖ దర్శకుడు హారీష్ శంకర్ బాలీవుడ్ బడా హీరోతో సినిమా చేయబోతున్నారు అనే రూమర్లు ఫిల్మ్ సర్కిల్స్ లో జోరుగా విన్పిస్తున్నాయి. మరి పవన్ తో ఆయన చేయాల్సిన మూవీ సంగతేంటి?

'గబ్బర్ సింగ్' లాంటి బ్లాక్ బస్టర్ ట్రాక్ రికార్డు ఉన్న డైరెక్టర్ హరీష్ శంకర్ ప్రస్తుతం డిజాస్టర్ ఫేజ్ లో ఉన్నారు. కానీ ఆ ఎఫెక్ట్ అయిన అప్ కమింగ్ సినిమాలపై ఏమాత్రం పడలేదు. ప్రస్తుతం హరీష్ శంకర్ మూడు నాలుగు క్రేజీ ప్రాజెక్టులు చేయడానికి సిద్ధమవుతున్నారు. అందులో ఆయన బాలీవుడ్ డెబ్యూకి రెడీ అవుతున్న సినిమా కూడా ఉన్నట్టు సమాచారం. ఇప్పటికే ఓ బాలీవుడ్ బడా హీరోతో ఈ ప్రాజెక్ట్ కన్ఫర్మ్ అయినట్టు ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది.
సల్మాన్ ఖాన్ తో హరీష్ శంకర్ ప్రాజెక్ట్
గత ఏడాది రిలీజ్ అయిన 'మిస్టర్ బచ్చన్' సినిమాతో హరీష్ శంకర్ కి పెద్ద షాకే తగిలింది. 'రైడ్' అనే హిందీ సినిమాకు రీమేక్ గా రూపొందిన ఈ సినిమా కనీసం యావరేజ్ టాక్ కూడా తెచ్చుకోలేకపోయింది. అయితే దీని ప్రభావం తన నెక్స్ట్ సినిమాలపై పెద్దగా పడలేదు. పవన్ కళ్యాణ్ తో ఆయన మోస్ట్ అవైటింగ్ సినిమా 'ఉస్తాద్ భగత్ సింగ్' ఇంకా సెట్స్ పైకి వెళ్లాల్సి ఉంది. ఆ తర్వాత ఈ డైరెక్టర్ చేయబోయే మూవీ అంటూ రోజుకొక స్టార్ హీరో పేరు వినిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఆయన సల్మాన్ ఖాన్ కి ఓ కథ చెప్పాడని, హరీష్ శంకర్ నేరేషన్ కి ఫిదా అయిన కండల వీరుడు వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం. మైత్రి మూవీ మేకర్స్ ఈ మూవీని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించబోతుందని తెలుస్తోంది. త్వరలోనే ఈ కాంబోకి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ రాబోతుందని అంటున్నారు.
హరీష్ శంకర్ కి బిగ్గెస్ట్ ఛాలెంజ్
ఒకవేళ హరీష్ శంకర్ - సల్మాన్ ఖాన్ కాంబినేషన్ లో సినిమా పక్కా అయితే గనక ఈ డైరెక్టర్ కి బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఎదురు కాబోతోంది అనే చెప్పాలి. ఎందుకంటే ఇటీవల కాలంలో సల్మాన్ ఖాన్ ట్రాక్ రికార్డు చాలా దారుణంగా ఉంది. ఆయన 'భజరంగీ భాయిజాన్' లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలను చూసి ఏళ్ళు గడిచిపోయాయి. ఆ తర్వాత వచ్చిన ఒక్క సినిమా కూడా సల్మాన్ కు హిట్టు తెచ్చిపెట్టలేకపోయింది. 'కిసీకా భాయ్ కిసీకా జాన్' అయితే ఆయన కెరీర్ లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ గా మిగిలింది. ఇక ఇప్పుడు సౌత్ డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్ తీసిన 'సికందర్' మూవీ కూడా సల్మాన్ కు బ్లాక్ బస్టర్ ఇవ్వలేకపోయింది. ఈ నేపథ్యంలోనే సల్మాన్ ఖాన్ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీకి హరీష్ శంకర్ సిద్ధమవుతుండడం హాట్ టాపిక్ గా మారింది. ఎందుకంటే సల్మాన్ కి బ్లాక్ బస్టర్ ఇచ్చే అతి పెద్ద బాధ్యత ఇప్పుడు ఆయనపై ఉండబోతోంది. అంతేకాదు ఆయన బాలీవుడ్ ఎంట్రీపై కూడా ఈ మూవీ రిజల్ట్ ఎఫెక్ట్ ఉంటుంది. అయితే సాలిడ్ కథతోనే హరీష్ శంకర్ రంగంలోకి దిగుతున్నట్టు సమాచారం. ఈ ఏడాది చివర్లో మూవీ ఓపెనింగ్ జరగబోతుందని సమాచారం.
Also Read: మధుశాల రివ్యూ: ETV Winలో పొలిటికల్ క్రైమ్ డ్రామా... వరలక్ష్మి శరత్ కుమార్ సినిమా బావుందా? లేదా?
ఇదిలా ఉండగా, ప్రస్తుతం పవన్ కళ్యాణ్ రాజకీయాలతో బిజీగా ఉన్న కారణంగా హరీష్ శంకర్ తో ఆయన చేయాల్సిన 'ఉస్తాద్ భగత్ సింగ్' ఇప్పట్లో పట్టాలెక్కే సూచనలు కనిపించట్లేదు. ఇదిలా ఉండగా హరీష్ శంకర్ చేతిలో పవన్ సినిమాతో పాటు కేవీఎన్ ప్రొడక్షన్స్, సితార ఎంటర్టైన్మెంట్స్ లాంటి పెద్ద బ్యానర్లతో ఒక్కో సినిమా చేయాల్సి ఉంది. ఈ మూడు సినిమాలు కాకుండా ఇప్పుడు మైత్రి మూవీస్ బ్యానర్ పై సల్మాన్ ఖాన్ హీరోగా మరో సినిమా చేయబోతున్నారు హరీష్ శంకర్.





















