Varanasi : మహేష్ 'వారణాసి' ఇంటర్నేషనల్ ప్రమోషన్స్ - ఫ్యాన్స్‌కు బిగ్ సర్ ప్రైజ్!
Varanasi Movie : మహేష్ 'వారణాసి' మూవీకి ఇంటర్నేషనల్ స్థాయిలో ప్రమోషన్స్ ప్లాన్ చేస్తున్నారు దర్శక ధీరుడు రాజమౌళి. ఈ క్రమంలో హాలీవుడ్ మీడియాలో ఓ క్రేజీ న్యూస్ చక్కర్లు కొడుతోంది.

Rajamouli Varanasi Title Glimpse To Drop With Avatar 3 : సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శక ధీరుడు రాజమౌళి పాన్ వరల్డ్ అడ్వెంచర్ ప్రాజెక్ట్ 'వారణాసి'. 2027 సమ్మర్‌లో మూవీ ప్రేక్షకుల ముందుకు రానుండగా... ఇప్పటి నుంచి అంతర్జాతీయ స్థాయిలో ప్రమోషన్స్ ప్లాన్ చేస్తున్నారు మూవీ టీం. కేవలం టైటిల్ గ్లింప్స్‌కే భారీ స్థాయిలో ఈవెంట్ నిర్వహించి 'అవతార్ కా బాప్' అనేలా వీడియో రిలీజ్ చేసిన వరల్డ్ వైడ్‌గా అందరి దృష్టి ఆకర్షించారు రాజమౌళి.
వాట్ ఏ ప్లాన్ జక్కన్న
తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ బజ్ అటు సోషల్ మీడియా ఇటు హాలీవుడ్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రపంచ స్థాయి ప్రేక్షకులకు 'వారణాసి'ని మరింత దగ్గర చేేసేలా ఈ నెల 19న ప్రేక్షకుల ముందుకు రానున్న జేమ్స్ కామెరూన్ 'అవతార్ ఫైర్ అండ్ యాష్'లో 'వారణాసి' సర్‌ప్రైజ్ ఉండబోతున్నట్లు తెలుస్తోంది. టైటిల్ గ్లింప్స్ వీడియోను అందులో ప్లే చేసేందుకు జక్కన్న ప్లాన్ చేస్తున్నట్లు హాలీవుడ్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. మరి దీనిపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రావాల్సి ఉంది.
Also Read : ఓటీటీలోకి వచ్చేసిన 'ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో' - ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే?
అవతార్ 3 వరల్డ్ వైడ్‌గా ఈ నెల 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. జేమ్స్ కామెరూన్ మూవీ అంటే ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. టైటానిక్, అవతార్ 1, 2 రికార్డ్ కలెక్షన్స్ రాబట్టాయి. నిజానికి 'వారణాసి' టైటిల్ గ్లింప్స్‌నే కామెరూన్ చేతుల మీదుగా లాంచ్ చేయాలని రాజమౌళి ప్లాన్ చేశారట. అయితే, అది సాధ్యం కాలేదు. తనకు కామెరూన్ అంటే ఎంత అభిమానమో గతంలో రాజమౌళి పలు సందర్భాల్లో చెప్పారు. ఆయన్ను కలిసిన బెస్ట్ మూమెంట్‌ను అప్పుడు షేర్ చేసుకున్నారు.
ప్రస్తుతం కామెరూన్ దర్శకత్వం వహించిన 'అవతార్ 3' మూవీతో పాటే 'వారణాసి' టైటిల్ గ్లింప్స్ ప్లే చేసేలా సర్ ప్రైజ్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే 'వారణాసి' గ్లింప్స్‌ను 'అవతార్ కా బాప్' అంటూ పలువురు సెలబ్రిటీలతో పాటు నెటిజన్లు సైతం ప్రశంసలు కురిపించారు. ఇప్పటికీ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూనే ఉంది. తెలుగు సినిమా స్థాయిని ప్రపంచ స్థాయికి మించి తీసుకెళ్లేలా జక్కన్న ప్లానింగ్ అదిరిపోయిందని మూవీ లవర్స్ అంటున్నారు.
వీడియోలో ఏముంది?
ఈ మూవీలో మహేష్ బాబు రుద్ర పాత్రలో కనిపించనుండగా మందాకిని పాత్రలో బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రా, విలన్ కుంభగా పృథ్వీరాజ్ సుకుమారన్ నటిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఇప్పటికే రిలీజ్ అయిన ప్రీ లుక్స్, ఫస్ట్ లుక్స్ వేరే లెవల్‌లో ఉన్నాయి. వారణాసి నగరం పుట్టుక నుంచి త్రేతా యుగం, హిమాలయాల్లో చిన మస్తా దేవి ఆలయంతో పాటు కీలక ఘట్టాలను చూపించారు. ఇందులో మహేష్ రాముడిగా కనిపించనున్నారు. విజువల్స్ హాలీవుడ్ రేంజ్‌లో ఆకట్టుకోగా మూవీ కోసం యావత్ ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోంది. దుర్గా ఆర్ట్స్ బ్యానర్‌పై కేఎల్ నారాయణ మూవీని నిర్మిస్తున్నారు. కీరవాణి మ్యూజిక్ అందిస్తున్నారు.





















